MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • వయనాడ్ విపత్తుతో కేరళలో ఊపందుకున్న డార్క్ టూరిజం... అంటే ఏమిటి..?

వయనాడ్ విపత్తుతో కేరళలో ఊపందుకున్న డార్క్ టూరిజం... అంటే ఏమిటి..?

కేరళ టూరిజం గురించి అందరికీ తెెలిసిందే. కానీ వయనాడ్ ప్రకృతి విళయం తర్వాత ఇక్కడ డార్క్ టూరిజం పెరిగింది. అసలు ఏమిటీ డార్క్ టూరిజం..? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 03 2024, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Dark Tourism

Dark Tourism

Dark Tourism : దేవభూమిగా పిలుచుకునే కేరళపై ఆ దేవుడే కన్నెర్రజేసాడు. వయనాడ్ లో ప్రకృతి విళయతాండవం చేసి మారణహోమం సృష్టించింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి... దీంతో వయనాడ్ ప్రజల ప్రాణాలు గాల్లో కలిసాయి. గత మంగళవారం తెల్లవారుజామున కొండప్రాంతాల్లోని ఇళ్లపై బండరాళ్లు, మట్టిదిబ్బలు పడటంతో నిద్రలో వున్నవారు సజీవ సమాధి అయ్యారు. ఇంకా వందలాది మంది గాయపడగా... వేలాదిమంది నిరాశ్రయులై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Dark Tourism

Dark Tourism

కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటివరకు 350 మందికిపైగా మృతిచెందినట్లు గుర్తించారు. ఇంకా వందలాదిమంది ఆఛూకీ లభించడంలేదు. బండరాళ్ల కింద, మట్టిదిబ్బల మధ్య, పారుతున్న వరదనీటిలో...ఎక్కడచూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అలాగే కూలిన ఇళ్లు, చచ్చిపడివున్న జంతువులతో ఆ ప్రాంతమంతా విషాదంతో నిండివుంది.  
 

310
Dark Tourism

Dark Tourism

ఇలా చూడ్డానికి భయంకరంగా మారినవేళ వయనాడ్ కు టూరిస్ట్ లు పెరిగారట. దీంతో ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు చేపట్టిన రెస్య్యూ ఆపరేషన్స్ కు ఆటంకం కలుగుతోందట. దీంతో కేరళ పోలీసులు ఇతర ప్రాంతాల నుండి వయనాడ్ కు ఎవరూ రావద్దని అభ్యర్థిస్తున్నారు. ఇలా వయనాడ్ విపత్తువేళ డార్క్ టూరిజం అనే పదం వైరల్ గా మారింది. 
 

410
Dark Tourism

Dark Tourism

అసలు ఏమిటీ డార్క్ టూరిజం : 

టూరిజం అంటే కనువిందుచేసే ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాంతాల పర్యటన. ఈ టూరిజంకు కేరళ చాలా ఫేమస్. పచ్చని  ప్రకృతి సోయగాలు, అందమైన కొండకోనలు, జలజలాపారే సెలయేర్లు, సముద్ర తీరప్రాంతాలతో భారతదేశంలో అత్యధికంగా టూరిస్టులను ఆకర్షిస్తున్న రాష్ట్రం కేరళ.  

510
Dark Tourism

Dark Tourism

అయితే ఈ ప్రకృతి అందాల వెనక దాగివున్న ప్రమాదం ఎంత భయంకరమో తాజాగా బయటపడింది. అందంగా కనిపిస్తూ ఎప్పుడూ ప్రశాంతంగా వుండే కొండలే తాజాగా ప్రళయం సృష్టించారు. టీ  ఎస్టేట్స్ తో రమణీయంగా వుండే వయనాడ్ ప్రాంతమంతా ఇప్పుడు శవాళ దిబ్బగా మారింది. భారీ వర్షాలు, వరద ప్రవాహం దాటికి కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం జరిగింది.  
 

610
Dark Tourism

Dark Tourism

ఈ ప్రకృతివిళయం, మారణహోమాన్ని చూసేందుకు ఇతర ప్రాంతాలనుండి అనేకమంది వయనాడ్ వెళుతున్నారట. ఇలా విషాదంలో మునిగిన ప్రాంతాలను చూసేందుకు వెళ్లడానే డార్క్ టూరిజం అంటారు. ఇంకా చెప్పాలంటే మనకు ఆనందాన్నిచ్చే ప్రాంతాలను చూసేందుకు వెళ్లడం టూరిజం... ఇతరుల బాధలను చూసేందుకు వెళ్లడం డార్క్ టూరిజం. 
 

710
Dark Tourism

Dark Tourism

ప్రకృతి విపత్తులకు గురయిన ప్రాంతాలనే కాదు  యుద్దభూమిని, సమాధులను, ఉరితీసిన ప్రాంతాలను చూసేందుకు వెళ్లడమూ డార్క్ టూరిజమే. మరణం,హింస, విషాదభరిత ప్రాంతాలను సందర్శిస్తే అది డార్క్ టూరిజంలో భాగమే.
 

810
Dark Tourism

Dark Tourism

డార్క్ టూరిజంతో పొంచివున్న ప్రమాదం : 

వయనాడ్ విపత్తు ఏ స్థాయిలో జరిగిందో మనందరం టీవిల్లోనో, సోషల్ మీడియా మాధ్యమాల్లోనో చూస్తున్నాం. కానీ కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నేరుగా వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతానికే వెళుతున్నారు. అక్కడి పరిస్థితులను కళ్లారా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కేరళలో మరీముఖ్యంగా వయనాడ్ లో డార్క్ టూరిజం పెరిగిపోయింది. 
 

910
Dark Tourism

Dark Tourism

ఇప్పటికే వయనాడ్ లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా వుంది... వర్షాలు కొనసాగుతున్నా ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది. కేరళ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఇతర ప్రాంతాలనుండి ఈ ప్రకృతి విపత్తును చూసేందుకు వచ్చేవారి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అంతేకాదు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరేదైనా ప్రమాదం జరిగితే ఇలా చూసేందుకు వచ్చినవాళ్ళు కూడా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం  వుంటుంది. కాబట్టి డార్క్ టూరిజంను అపేయాలని ప్రజలన హెచ్చరిస్తున్నారు కేరళ పోలీసులు. 
 

1010
Dark Tourism

Dark Tourism

అంతేకాదు వర్షాలు, వరదనీటితో వయనాడ్ ప్రాంతం ప్రమాదకరంగా వుంది.  ఇక చనిపోయిన జంతువులు, ఇతర వ్యర్థాలతో వ్యాధులు సంక్రమించే అవకాశం వుంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో పర్యటించి సహాయక చర్యలకు ఆటంకం కలిగించడమే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకోవద్దని...  పరిస్థితులు మెరుగుపడ్డాకే వయనాడ్ కు రావాలని సూచిస్తున్నారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways: రూ. 1628 కోట్ల బిగ్ ప్రాజెక్టు.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి.. రౌఘాట్‌కు రైల్వే కనెక్టివిటీ
Recommended image2
PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు.. దీపావళికి ముందు గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి
Recommended image3
భారత్‌లో సీజేపీ నిరసనలపై స్పందించిన అమెరికా .. విదేశాంగ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved