ముద్దుల వివాదం.. చిన్నారికి, కుటుంబానికి క్షమాపణలు చెప్పిన దలైలామా..
బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా బాలుడికి, అతని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Dalailama health tips
ఢిల్లీ : తన దగ్గరికి వచ్చిన బాలుడికి పెదవులపై ముద్దు పెట్టడమే కాకుండా.. బాలుడు నోటితో తన నాలుకను తాకాలంటూ.. దలైలామా అడిగిన వీడియో వైరల్ కావడంతో దలైలామ మీద తీవ్ర స్థాయిలో నిరసన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దీంతో దలైలామా తన చర్యలకు బాలుడిని, అతని కుటుంబాన్ని క్షమాపణలు కోరారు.
అత్యుత్తమ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు బాలుడికి, అతని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడు. దీనిమీద అతని బృందం మాట్లాడితే "తాను కలుసుకునే వ్యక్తులను తరచుగా అమాయకంగా, ఉల్లాసభరితంగా ఆటపట్టిస్తుంటారు. ఇది కూడా అలాంటిదే. దీని వెనుక వేరే ఉద్దేశ్యం లేదు’ అని తెలిపారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.
‘తనకు కౌగిలింత ఇవ్వమని ఓ చిన్నారిని అడగడం, ముద్దు పెట్టడం.. వీడియో వైరల్ కావడంతో దలైలామా బాలుడికి, అతని కుటుంబ సభ్యులకు, అలాగే ఈ చర్యవల్ల తీవ్రస్థాయిలో కోపానికి వచ్చిన స్నేహితులు, అనుచరులు అందరికీ క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నారు. ప్రపంచానికి, అతని మాటలు కలిగించిన బాధ వల్లే ఈ నిర్ణయానికి వచ్చారు. ఇదంతా దలైలామా తన దగ్గరికి వచ్చేవారికి ఉల్లాసంగా ఉంచడానికి చేసే చిలిపి చేష్టలు మాత్రమే. వేరే ఉద్దేశం లేదు కాబట్టే బహిరంగంగా, కెమెరాల ముందు ఆటపట్టించేవాడు. ఈ సంఘటనకు దలైలామా చింతిస్తున్నారు"అని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది.
కాగా, బౌద్ధ మత గురువు దలైలామా వివాదాల్లో చిక్కుకున్నారు. తననాలుకను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని కోరాడు. ఈ ఘటన తాజాగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో దలైలామా ఆశీస్సులు అందుకోవడానికి వచ్చిన బాలుడి పెదవులపై ముద్దు పెట్టడం కనిపిస్తుంది. ఆ తరువాత ఆయన బాలుడిని నా నాలుకను తాకమని అడగడం అందులో కనిపిస్తుంది. ఈ వీడియో సంచలనం రేపింది.
తన దగ్గరికి వచ్చిన బాలుడికి పెదవులపై ముద్దు పెట్టడమే కాకుండా.. బాలుడు నోటితో తన నాలుకను తాకాలంటూ... నాలుక బైటపెట్టడం కనిపిస్తుంది. ‘నువ్వు నా నాలుకను నోటితో తాకుతావా’ అని మైనర్ బాలుడిని అడిగడం కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ ఇప్పుడది వెలుగులోకి రావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకునపడుతున్నారు.
దలైలామా ఇలా చేయడం.. "అసహ్యకరమైనది", "దౌర్జన్యం", "ఖండించదగినది" అని అనేక మంది నెటిజన్లు పేర్కొంది. వీడియోను ట్విట్టర్ షేర్ చేస్తూ.. "దలైలామా ఒక బౌద్ధ కార్యక్రమంలో భారతీయ బాలుడిని ముద్దుపెట్టుకుంటున్నాడు అతని నాలుకను తాకడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఆ బాలుడిని "నా నాలుకను తాకుమని" కోరాడు. అతను ఎందుకు అలా చేస్తాడు?" అని రాసుకొచ్చాడు.