MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • National
  • Gold : పాత సిమ్ కార్డులే కదా అని పడేయకండి.. వీటిలో లక్షల విలువైన బంగారం ఉంది !

Gold : పాత సిమ్ కార్డులే కదా అని పడేయకండి.. వీటిలో లక్షల విలువైన బంగారం ఉంది !

Gold From SIM Cards : చైనాకు చెందిన ఒక వ్యక్తి పాత సిమ్ కార్డుల నుండి 191 గ్రాముల బంగారాన్ని వెలికితీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 02 2026, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మీ ఇంట్లో పాత సిమ్ కార్డులు ఉన్నాయా? అయితే మీరు కోటీశ్వరులే
Image Credit : Gemini

మీ ఇంట్లో పాత సిమ్ కార్డులు ఉన్నాయా? అయితే మీరు కోటీశ్వరులే

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన క్యో అనే వ్యక్తి సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. పాత సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే ఈ వేస్ట్ నుండి ఏకంగా 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీసి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ. 28 లక్షలు ఉంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతన్ని ఆల్కెమిస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
2 టన్నుల వ్యర్థాల వెనుక అసలు నిజం
Image Credit : Getty

2 టన్నుల వ్యర్థాల వెనుక అసలు నిజం

ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది తమ ఇంట్లో ఉన్న పాత సిమ్ కార్డులతో బంగారం తయారు చేయవచ్చని భావిస్తున్నారు. కానీ, క్యో ఇక్కడే ఒక కీలక విషయాన్ని చెప్పాడు. తాను సేకరించిన 191 గ్రాముల బంగారం కేవలం కొన్ని సిమ్ కార్డుల నుండి వచ్చింది కాదు. ఇందుకోసం సుమారు 2 టన్నుల బరువున్న టెలికాం చిప్ వ్యర్థాలను, పాత సర్క్యూట్ బోర్డులను ఉపయోగించినట్లు ఆయన వెల్లడించారు. సాధారణంగా ఒక సిమ్ కార్డులో 0.001 గ్రాము కంటే తక్కువ బంగారం ఉంటుంది. అంటే, క్యో తీసినంత బంగారం రావాలంటే కనీసం 4 లక్షల సిమ్ కార్డులు అవసరమవుతాయి.

Related Articles

Related image1
Mobile Price Drops : మొబైల్ కొనేవారికి, ఈవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. కేంద్రం ఏం ప్రకటించిందంటే?
Related image2
Union Budget: పండగ చేస్కోండి.. బడ్జెట్ తర్వాత ధరలు తగ్గే వస్తువులివే. మరి పెరిగేవి ఏంటంటే.?
36
ఇలా బంగారం తీయడం అంత ఈజీ కాదు
Image Credit : our own

ఇలా బంగారం తీయడం అంత ఈజీ కాదు

క్యో తన వీడియోలో పెద్ద పెద్ద కెమికల్ డ్రమ్ములను ఉపయోగించి బంగారం తీసే ప్రక్రియను నిర్వహించాడు. ఇందులో తుప్పు పట్టించడం, డిస్‌ప్లేస్‌మెంట్, అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వంటి దశలు ఉన్నాయి. చివరగా వడపోత ద్వారా వచ్చిన గోల్డ్ మడ్ ను కరిగించి బిస్కెట్ రూపంలోకి మార్చాడు.

అయితే, ఈ ప్రక్రియలో వాడే అక్వా రెజియా అనే రసాయనం అత్యంత ప్రమాదకరమైనది. ఇది నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ల మిశ్రమం. దీని నుండి వెలువడే విష వాయువులు ప్రాణాపాయానికి దారితీస్తాయని క్యో హెచ్చరించాడు.

46
మార్కెట్‌లో పెరిగిన సిమ్ కార్డుల డిమాండ్
Image Credit : Getty

మార్కెట్‌లో పెరిగిన సిమ్ కార్డుల డిమాండ్

ఈ వీడియో ప్రభావంతో చైనాలోని సెకండ్ హ్యాండ్ వెబ్‌సైట్లలో పాత సిమ్ కార్డుల విక్రయాలు జోరందుకున్నాయి. చాలా మంది వ్యాపారులు సిమ్ కార్డుల బండిల్స్‌ను బంగారం వెలికితీతకు అనువైనవిగా ప్రకటిస్తూ విక్రయిస్తున్నారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా బంగారం వెలికితీసే టూల్ కిట్స్, శిక్షణ వీడియోలను 485 యువాన్లకు (సుమారు రూ. 5,700) అమ్ముతున్నాడు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు వీటిని కొనుగోలు చేయడం గమనార్హం.

56
చట్టపరమైన చిక్కులు, కఠిన శిక్షలు ఉన్నాయి
Image Credit : Freepik

చట్టపరమైన చిక్కులు, కఠిన శిక్షలు ఉన్నాయి

చైనాలో పాత సిమ్ కార్డులను ప్రమాదకర వ్యర్థాలుగా పరిగణిస్తారు. లైసెన్స్ లేకుండా వీటిని రీసైక్లింగ్ చేయడం నేరం. గతంలో ఇలాగే పాత బ్యాటరీల నుండి సీసం తీసిన ఏడుగురికి మూడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించారు. క్యో తాను ఒక ప్రొఫెషనల్ రిఫైనర్ అని, తనకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపాడు. సామాన్యులు ఇంట్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే పర్యావరణ కాలుష్య నిరోధక చట్టాల కింద కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించాడు.

66
భారతదేశంలో ఇ-వేస్ట్ నిబంధనలు ఎలా ఉన్నాయి?
Image Credit : our own

భారతదేశంలో ఇ-వేస్ట్ నిబంధనలు ఎలా ఉన్నాయి?

భారతదేశంలో కూడా ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2022 ప్రకారం అనధికారికంగా బంగారం వెలికితీత నేరం. అక్వా రెజియా వంటి యాసిడ్లను వాడటం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. పట్టుబడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పాత ఎలక్ట్రానిక్ వస్తువులను కేవలం గుర్తింపు పొందిన రీసైక్లింగ్ సెంటర్లకు మాత్రమే విక్రయించడం సురక్షితం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
బంగారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
చైనా
వైరల్ న్యూస్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
Recommended image2
India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
Recommended image3
Now Playing
పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
Related Stories
Recommended image1
Mobile Price Drops : మొబైల్ కొనేవారికి, ఈవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. కేంద్రం ఏం ప్రకటించిందంటే?
Recommended image2
Union Budget: పండగ చేస్కోండి.. బడ్జెట్ తర్వాత ధరలు తగ్గే వస్తువులివే. మరి పెరిగేవి ఏంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved