పశువులను ఢీకొని నిలిచిన వందే భారత్ ట్రైన్
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పశువులను ఢీకొని నిలిచిపోయింది. పశువులను ఢీకొన్న రైలు ముందు భాగం దెబ్బతింది.
11

crtoon punchCartoon punch on vande bharat express train
వందే భారత్ రైలుకు ప్రమాదం జరిగింది. ఈ నెల 6వ తేదీన పశువుల మంద ఢీకొనడంతో వందే భారత్ రైలు ముందు భాగం దెబ్బతింది. ముంబై నుండి గాంధీనగర్ కు రైలు వెళ్తున్న సమయంలో బట్వా మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది సెప్టెంబర్ 30 ప్రారంభించారు. ఈ రైలులో మోడీ కొంత దూరం ప్రయాణం చేశారు. విమానంలో మాదిరిగా ఈ రైలులో సౌకర్యాలుంటాయి. 180 కి.మీ వేగంతో రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. సాధారణ రైలులో ముంబై నుండి గుజరాత్ కు 9గంటల సమయం పడితే ఈ రైలులో 6 గంటల సమయం పడుతుంది. గాంధీ నగర్ ముంబై మధ్య ఈ రైలు నడుస్తుంది.
Latest Videos