భారత్ లోని ఈ ఫేమస్ ఫుడ్స్ పాకిస్తాన్ లోనూ ఫేమస్ తెలుసా?
మన భారత దేశంలో ఫుల్ ఫేమస్ అయిన కొన్ని ఫుడ్స్, మన పొరుగు దేశం పాకిస్తాన్ లోనూ ఫేమస్ అనే విషయం మీకు తెలుసా? అవేంటో ఓసారి చూద్దాం...
ప్రపంచంలోని ఒక్కో ప్రాంతానికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో ప్రదేశంలో ఒక్కో ఫుడ్ ఫేమస్ అయ్యి ఉంటుంది. ఆ ఫుడ్ ని మరో ప్రాంతంలో అంత రుచికరంగా ఉండకపోవచ్చు. అయితే, మన భారత దేశంలో ఫుల్ ఫేమస్ అయిన కొన్ని ఫుడ్స్, మన పొరుగు దేశం పాకిస్తాన్ లోనూ ఫేమస్ అనే విషయం మీకు తెలుసా? అవేంటో ఓసారి చూద్దాం...
Cheese Corn Samosa
1.సమోసా
సమోసా భారత్ లో దాదాపు అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే, ఈ సమోసా పాకిస్తాన్ లోనూ ఫేమస్ అట తెలుసా?ఈ ప్రసిద్ధ చిరుతిండి బంగాళాదుంపలు, బఠానీలు, వేరుశెనగలు మొదలైన వాటితో నిండి ఉంటుంది. ఈ చిరుతిండి పట్ల ఉన్న ప్రేమ హద్దులను ఛేదిస్తుంది
2.గోల్ గప్పే..
గోల్ గప్పే, అది పానీపూరి. ఇది కూడా అంతే భారత్ లోని అన్ని ప్రాంతాల్లో విపరీతంగా లభిస్తుంది. దీనికి పిల్లలు అందరూ ఇష్టంగా లాగిస్తూ ఉంటారు. కానీ, దీనిని పాకిస్తాన్ లోనూ అంతే ఇష్టంగా తింటారు తెలుసా.
Image: Getty
3.బిర్యానీ
భారతీయులు అమితంగా ఇష్టపడే రైస్ ఐటెమ్ బిర్యానీ. వెజ్, నాన్ వెజ్ బిర్యానీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దీపావళి అయినా, ఈద్ అయినా బిర్యానీ గిన్నె లేకుండా ఏ వేడుక పూర్తికాదు. కాగా, పాకిస్తాన్ లోనూ బిర్యానీని అమితంగా ఇష్టపడతారట.
4.గుష్టబా
ఇది LOCకి ఇరువైపులా ఉన్న ప్రజలు ఇష్టపడే కాశ్మీరీ వంటకం. ఈ వంటకం ప్రజాదరణ , గొప్పతనం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారత్, పాక్ రెండింటీలోనూ దీనిని ఇష్టంగా తింటారు.
Boti Kabab
5.కబాబ్స్
సీక్ కబాబ్, రష్మీ కబాబ్, షమ్మీ కబాబ్-- ఈ డిష్‌లో ఎవరైనా ఆలోచించగలిగే దానికంటే చాలా వెరైటీలు ఉన్నాయి. కబాబ్‌లను రెండు దేశాల ప్రజలు ఇష్టపడతారు
6.కుల్ఫీ ఫలూదా
ఢిల్లీ, లక్నో లేదా లాహోర్, కరాచీ కావచ్చు-- తెల్లటి నూడుల్స్ ఆకారంలో ఉండే ఫలూడా డిజర్ట్ ని భారత్, పాక్ రెండు దేశాల్లోనూ విపరీతంగా ఇష్టపడతారు.