MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • Real Estate : బెంగళూరులో సొంతిల్లు కావాలా..? ఈ ఏరియాల్లో కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌లోనే వచ్చేస్తుంది

Real Estate : బెంగళూరులో సొంతిల్లు కావాలా..? ఈ ఏరియాల్లో కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌లోనే వచ్చేస్తుంది

ఐటీ క్యాపిటల్ బెంగళూరులో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినా మధ్యతరగతి వాళ్లు కూడా సొంతిల్లు కొనేందుకు కొన్ని ఏరియాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మహానగరంలో తక్కువ ధరలో ఇళ్లు ఎక్కడ దొరుకుతాయో చూద్దాం.

1 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 24 2026, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈస్ట్ బెంగళూరు (IT Corridor)
Image Credit : swagruha.telangana.gov.in

ఈస్ట్ బెంగళూరు (IT Corridor)

బెంగళూరులోని ఐటీ హబ్ వైట్‌ఫీల్డ్ దగ్గరగా ఉండటంతో ఇక్కడి ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే కొత్త గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు వేగంగా వస్తున్నాయి. ఇక్కడ చదరపు అడుగుకు రూ.4,000–రూ.6,500 ధరలో ఫ్లాట్లు దొరుకుతాయి. స్కూళ్లు, హాస్పిటల్స్, ఐటీ పార్కులకు కనెక్టివిటీ బాగుంది. ఇంటి అద్దెలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ ఇప్పుడే కొనే ప్రాపర్టీ విలువ భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సౌత్ బెంగళూరు (Electronic City Zone)
Image Credit : Gemini AI

సౌత్ బెంగళూరు (Electronic City Zone)

ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండటంతో రోజువారీ ప్రయాణం తగ్గుతుంది. మెట్రో రావడంతో కనెక్టివిటీ మెరుగుపడింది. ఎలక్ట్రానిక్ సిటీలో సగటున చదరపు అడుగుకు ₹5,850 ఉంది. బడ్జెట్ ఫ్యామిలీలకు ఇది సరైన ప్రాంతం. చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు మంచి అవకాశం. తక్కువ ధరలో కొత్త ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

35
నార్త్ బెంగళూరు (Airport Corridor)
Image Credit : Gemini AI

నార్త్ బెంగళూరు (Airport Corridor)

ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉండటంతో ఇది ఇన్వెస్ట్‌మెంట్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ఇక్కడ చదరపు అడుగుకు ₹4,000–₹6,000 ధరలో పెద్ద ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌లు నిర్మిస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఐటీ, ఏరోస్పేస్ పరిశ్రమల వల్ల డిమాండ్ పెరుగుతోంది.

45
వెస్ట్ బెంగళూరు (Kengeri Zone)
Image Credit : swagruha.telangana.gov.in

వెస్ట్ బెంగళూరు (Kengeri Zone)

ఇక్కడికి నేరుగా మెట్రో కనెక్టివిటీ ఉంది, కాబట్టి ప్రయాణం సులభం. చదరపు అడుగుకు ₹3,000–₹4,000 ధరతో చౌకైన ఫ్లాట్లు దొరుకుతాయి. తక్కువ ధరలో ఇల్లు దొరికే అరుదైన ఏరియా ఇది. విద్యార్థులు, ఫ్యామిలీల నుంచి అద్దెలకు మంచి డిమాండ్ ఉంది. మైసూర్ రోడ్ అభివృద్ధి చెందడంతో కొత్త అవకాశాలు వస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది.

55
కేవలం రూ.48 లక్షల్లోపే సొంతిల్లు...
Image Credit : Getty

కేవలం రూ.48 లక్షల్లోపే సొంతిల్లు...

కెంగేరి జోన్‌లో ₹48 లక్షల నుంచే ఫ్లాట్ కొనొచ్చు. మధ్యతరగతి వారికి EMI ఆప్షన్లు అనువుగా ఉంటాయి. ₹5,500–₹10,000 అద్దెతో కొత్తగా పెళ్లైన జంటలకు ఇది బెస్ట్. పెట్టుబడి పెడితే అద్దె ఆదాయం గ్యారెంటీ. లోన్ వడ్డీపై సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బెంగళూరు
స్థిరాస్తి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image2
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image3
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Related Stories
Recommended image1
Best Spas in Hyderabad : నో రిస్క్, బెస్ట్ సర్వీస్.. హైదరాబాద్ లో టాప్ 5 స్పా సెంటర్లు ఇవే
Recommended image2
Real Estate: తెలంగాణ‌లో 2 కొత్త ఎయిర్ పోర్టుల‌కు ముహుర్తం ఖ‌రారు.. ఇక్క‌డ భూములు కొన్న వారి రాత మారిన‌ట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved