MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Axis Bank Rules : యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్, ఏంటో తెలుసా?

Axis Bank Rules : యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్, ఏంటో తెలుసా?

మీరు యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వాడుతున్నారా? అయితే వచ్చే నెల అంటే డిసెంబర్ 1 నుంచి కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 06 2026, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డిసెంబర్ 1 నుంచి యాక్సిస్ బ్యాంక్ కొత్త రూల్స్
Image Credit : Asianet News

డిసెంబర్ 1 నుంచి యాక్సిస్ బ్యాంక్ కొత్త రూల్స్

ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ డిసెంబర్ 1 నుండి అంటే వచ్చే నెల నుండి కొత్త రూల్స్ అమలుచేస్తోంది. ఇందులో కీలకమైనది సేవింగ్స్ అకౌంట్స్ సర్వీస్ ఛార్జీల్లో మార్పు. దేశీయ కస్టమర్లతో పాటు ఎన్ఆర్ఐల సేవింగ్స్ అకౌంట్లకు కూడా ఇవి వర్తిస్తాయి. ముఖ్యంగా ఈజీ యాక్సెస్, కృషి, సహజ్ అకౌంట్లు వాడేవాళ్లు ఈ విషయాలు తెలుసుకోవాలి.

ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు నెలకు 4 సార్లు లేదా లక్ష రూపాయల వరకు ఉచితంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. కానీ డిసెంబర్ 1 నుంచి ఈ ఉచిత లావాదేవీల సంఖ్యను 4 నుంచి 3కి తగ్గిస్తున్నారు… కానీ లక్ష రూపాయల లిమిట్‌లో ఎలాంటి మార్పు లేదు. తరచుగా అకౌంట్లో డబ్బులు వేసేవాళ్లు లేదా తీసేవాళ్లకు ఇకపై అదనపు ఛార్జీలు కట్టాల్సి రావచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ పెంపు
Image Credit : getty

మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ పెంపు

అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయని వాళ్లకు యాక్సిస్ బ్యాంక్ వేసే పెనాల్టీలు కూడా ఇకపై పెరగనున్నాయి. సెమీ అర్బన్, రూరల్ బ్రాంచ్‌లలోని ఈజీ యాక్సెస్ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. సెమీ అర్బన్ బ్రాంచ్‌లలో ఇప్పటివరకు గరిష్ఠంగా రూ.300 వసూలు చేయగా, ఇకపై రూ.600 వరకు ఛార్జ్ చేస్తారు. రూరల్ బ్రాంచ్‌లలో ఉన్న రూ.150 పెనాల్టీని కూడా రూ.600కి పెంచారు.

ఎన్ఆర్ఐ ఈజీ యాక్సెస్ అకౌంట్లకు కూడా ఈ పెనాల్టీ రూ.300 నుంచి రూ.600కి పెరిగింది. అర్బన్, మెట్రో బ్రాంచ్‌లలో ఉన్న రూ.600 పెనాల్టీలో ఎలాంటి మార్పు లేదు. షార్ట్‌ఫాల్ ఆధారంగా 6 శాతం చొప్పున ఈ ఛార్జీలు లెక్కిస్తారు. శాలరీ అకౌంట్లకు ఈ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తించవు.

33
చెక్ రిటర్న్ ఛార్జీలు, రివార్డ్ పాయింట్లలో మార్పులు
Image Credit : stockphoto

చెక్ రిటర్న్ ఛార్జీలు, రివార్డ్ పాయింట్లలో మార్పులు

చెక్ బౌన్స్ అయితే వేసే ఛార్జీలను కూడా బ్యాంక్ పెంచింది. ప్రస్తుతం మొదటిసారి చెక్ రిటర్న్ అయితే రూ.50, ఆ తర్వాత ప్రతిసారీ రూ.100 వసూలు చేస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రతి చెక్ రిటర్న్‌కు ఫిక్స్‌డ్ ఛార్జీగా రూ.200 వసూలు చేయనున్నారు. ఎన్ఆర్ఐల బర్గండీ, ప్రయారిటీ, ప్రెస్టీజ్, ప్రైమ్ అకౌంట్లలో కొన్ని రిటర్న్ ట్రాన్సాక్షన్ల ఛార్జీలను రూ.50 నుంచి రూ.500కి పెంచారు.

అలాగే బర్గండీ, ప్రయారిటీ, ప్రెస్టీజ్, ప్రైమ్ ఎన్ఆర్ఐ, ఈజీ ఎన్ఆర్ఐ అకౌంట్లకు ఇచ్చే ఎడ్జ్ రివార్డ్ పాయింట్లను కూడా నిలిపివేస్తున్నారు. ప్రీమియం అకౌంట్లకు టోటల్ రిలేషన్ షిప్ వాల్యూ కండిషన్‌ను 75 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. కాబట్టి కస్టమర్లు డిసెంబర్ 1 కంటే ముందే ఈ కొత్త ఛార్జీల వివరాలు తెలుసుకోవడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Shakuntala Railways: దేశంలో ప్రైవేట్ యాజ‌మాన్యంలో న‌డిచే ఏకైక‌ రైల్వే లైన్ ఇదే
Recommended image2
రూ.675 కోట్లతో దేశంలోనే తొలి ప‌బ్లిక్ రోప్‌వే.. 45 నిమిషాల ప్రయాణం, ఇక 15 నిమిషాల్లోనే
Recommended image3
తెలంగాణలో వింత ఆచారం.. దీపావళి రోజున సమాధుల వద్ద వేడుక, ఎక్కడో తెలుసా.?
Related Stories
Recommended image1
First Bank: మనదేశంలో మొట్టమొదటి బ్యాంక్ ఏది? ఇప్పటికీ అది పనిచేస్తోందా?
Recommended image2
Bank Rules : మీ ప్రమేయం లేకుండానే అకౌంట్లోంచి డబ్బులు కట్ అయ్యాయా? ఈ మనీ తిరిగి ఎలా పొందాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved