ఆర్టికల్ 370పై వైఖరులు: కేసీఆర్, జగన్, బాబులకు చీలిక భయం
First Published Aug 8, 2019, 12:06 PM IST
హైదరాబాద్: పార్టీల చీలిక భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), వైఎస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఆర్టికల్ 370 రద్దుపై మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల పార్లమెంటు సభ్యుల్లో చీలిక రాకుండా చూసుకోవడానికి అలా చేశారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఎంపీలు చీలిపోతారనే భయం చుట్టుకుందని, దాంతో ఆర్టికల్ 370 రద్దుపై బిజెపికి అనుకూలంగా వ్యవహరించారని అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దును బలపరచడం ద్వారా వైఎస్ జగన్, కేసీఆర్, చంద్రబాబు తమ రాజకీయంగా తమకు లభించిన అవకాశాలను వదులుకున్నారని తెలుస్తోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?