MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Amritpal Singh: ఖ‌లిస్తానీ నేత‌ అమృత్ పాల్ సింగ్.. అతని అరెస్ట్ వెనుక టాప్-10 పాయింట్స్ ఇవే..

Amritpal Singh: ఖ‌లిస్తానీ నేత‌ అమృత్ పాల్ సింగ్.. అతని అరెస్ట్ వెనుక టాప్-10 పాయింట్స్ ఇవే..

Amritpal Singh: ఖ‌లిస్తానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ ను మోగాలోని గురుద్వారా నుంచి  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 36 రోజులుగా పరారీలో  ఉన్న అమృత్ పాల్ కోసం పంజాబ్ నుంచి నేపాల్ వరకు పోలీసులు గాలించారు. అయితే, చివ‌ర‌కు మోగా పోలీసుల ముందు లొంగిపోయాడు. అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు త‌ర‌లించారు. 

2 Min read
Mahesh Rajamoni
Published : Apr 23 2023, 06:38 PM IST| Updated : Apr 23 2023, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

1. అమృత్ పాల్ సింగ్ అరెస్ట్

వారిస్ పంజాబ్ దే సంస్థ నాయ‌కుడు, ఖ‌లిస్తానీ వేర్పాటువాద నేత కోసం నెల రోజుల పాటు సాగిన వేటకు తెరదించుతూ పరారీలో ఉన్న మతబోధకుడు అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు ఆదివారం (ఏప్రిల్ 23న‌) అరెస్టు చేశారు.

210

2. వేరు వేరు వేషాల్లో త‌ప్పించుకుంటూ పోలీసుల‌కు స‌వాల్..

అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసుల‌ వేట ప్రారంభమైనప్పటి నుంచి రెండుసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. అప్ప‌టినుంచి తప్పించుకుని తిరుగుతున్న క్ర‌మంలో చివ‌ర‌కు పంజాబ్ లోని మోగా జిల్లాలోని రోడ్ గ్రామంలో లొంగిపోయాడు. భారీ బందోభ‌స్తు మ‌ధ్య‌ అతడిని అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. 
 

310

3. అమృత్ పాల్ సింగ్ నేపథ్యం

1993లో అమృత్ సర్ లోని జల్లూపూర్ ఖేరా గ్రామంలో జన్మించిన అమృత్ పాల్ 12వ తరగతి వరకు చదువుకుని 2012లో దుబాయ్ లోని తన మేనమామ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పని చేసేందుకు భారత్ ను విడిచి వెళ్లాడు.
 

410

4. ఎలా వెలుగులోకి వ‌చ్చాడంటే.. 

30 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ ఆరు నెలల క్రితం నటుడు, ఉద్యమకారుడు దీప్ సిద్ధూ స్థాపించిన 'వారిస్ పంజాబ్ దే' అనే సంస్థకు అధిపతిగా నియమితులయ్యాడు.
 

510

5. దీప్ సిద్ధూ త‌ర్వాత‌.. 

2022 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సిద్ధూను 'ప్రభుత్వం' హత్య చేసిందని అమృత్ పాల్ సింగ్, ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అమృత్ పాల్ ఎప్పుడూ సిద్ధూను వ్యక్తిగతంగా కలవలేదనీ, అయితే వారి ఆన్ లైన్ ఇంటరాక్షన్స్ లో ఆయనను తీవ్రంగా ప్రభావితం చేశారని చెప్పారు.
 

610

6. అమృతధారి సిక్కు..

2022 సెప్టెంబర్ 25న అమృత్ పాల్ సింగ్ ఆనంద్ పూర్ సాహిబ్ లో అధికారిక సిక్కు బాప్తిస్మాన్ని పొంది 'అమృతధారి సిక్కు'గా మారారు.
 

710

7. భింద్రన్ వాలే 2.0 గా గుర్తింపు..

ఖలిస్థాన్ వేర్పాటువాది, ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే అనుచరుడిగా చెప్పుకునే ఆయన తన మద్దతుదారుల్లో 'భింద్రన్ వాలే 2.0'గా ప్రసిద్ధి చెందారు.
 

810

8. అమృత్ పాల్ సింగ్ హింసా చరిత్ర

ఫిబ్రవరిలో అమృత్ పాల్ సింగ్, అతని మద్దతుదారులు బారికేడ్లను బద్దలు కొట్టి అమృత్ సర్ నగర శివార్లలోని అజ్నాలా పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించి తన సహాయకుడిని విడుదల చేయాలని పోలీసులతో ఘర్షణకు దిగారు. 1984లో సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన ఇందిరాగాంధీకి పట్టిన గతే అమిత్ షాకు పడుతుందని అమృత్ పాల్ సింగ్ హెచ్చరించారు.

910

9. అమృత్ పాల్ సింగ్ పై ఆరోప‌ణ‌లు ఎమిటంటే..? 

వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, హత్యాయత్నం, పోలీసులపై దాడి, ప్రభుత్వ ఉద్యోగులు చట్టబద్ధంగా విధులు నిర్వర్తించడంలో అడ్డంకులు సృష్టించడం వంటి పలు క్రిమినల్ కేసుల కింద ఆయనపై, అతని అనుచరులపై కేసులు నమోదయ్యాయి.
 

1010

10. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏం చెబుతున్నాయంటే..?

అమృత్ పాల్ సింగ్ తన గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ద్వారా పాకిస్తాన్ నుంచి ఆయుధాలను తెప్పించుకుంటున్నాడని, పంజాబ్ ను మత ప్రాతిపదికన విభజించడానికి ప్రయత్నిస్తున్నాడని నిఘా సంస్థలు చెబుతున్నాయి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
రోజుకు రూ.25,000 ఆదాయమా..! ఇక్కడ బిజినెస్ చేస్తే లైఫ్ సెట్..!!
Recommended image2
బద్ధలైన ఇథియోపియా అగ్నిపర్వతం: భారత్ పై ఎఫెక్ట్ ఎందుకు? విమానయాన సంస్థలు అలర్ట్‌
Recommended image3
Now Playing
శబరిమల వెళ్లేవారు తప్పక తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు | Brain eating amoeba Kerala | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved