- Home
- National
- మంచు లక్ష్మికి అవమానం, విష్ణుని అడ్డంగా బుక్ చేసేసిన నటి హేమ.. అందరి జాతకాలు బయటపెడుతూ తీవ్ర వ్యాఖ్యలు
మంచు లక్ష్మికి అవమానం, విష్ణుని అడ్డంగా బుక్ చేసేసిన నటి హేమ.. అందరి జాతకాలు బయటపెడుతూ తీవ్ర వ్యాఖ్యలు
మంచు లక్ష్మికి జరిగిన అవమానంపై మా అసోసియేషన్ ఇంకా ఎందుకు స్పందించలేదు అని నటి హేమ ప్రశ్నించారు. మా ప్రెసిడెంట్ సోదరికే అవమానం జరిగింది. మంచు విష్ణు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటూ హేమ నిలదీసింది.

నటి హేమ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ నటి హేమ అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. గతేడాది నటి హేమ బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొని మాదక ద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆమె బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె మీడియాకి కొంత దూరంగా ఉంటున్నారు. తాజాగా నటి హేమ మా ప్రెసిడెంట్ మంచు విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
మంచు లక్ష్మి, జర్నలిస్ట్ వివాదం
మంచు లక్ష్మి నటించిన దక్ష అనే మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మంచు లక్ష్మిని కొన్ని అభ్యంతరకర ప్రశ్నలు అడిగారు. ఈ వయసులో ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి అంటూ ఆమెపై వస్తున్న విమర్శలని సదరు యాంకర్ గుర్తు చేశారు. మంచు లక్ష్మి ఆ జర్నలిస్ట్పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ సంఘటన పెద్ద వివాదమే అయ్యింది.
మహేష్ బాబుని అడగగలరా?
ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే మీకు ఎంత ధైర్యం, ఇదే ప్రశ్న మహేష్ బాబుని అడగగలరా అంటూ మంచు లక్ష్మి ఘాటుగా రియాక్ట్ అయింది. ఈ వివాదం మరింత పెద్దదిగా మారుతోంది. తాజాగా నటి హేమ స్పందిస్తూ ఇండస్ట్రీలో మహిళల్ని అవమానిస్తున్న వారందరిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
బాడీ షేమింగ్ చేస్తున్నారు
హేమ మాట్లాడుతూ.. మంచు లక్ష్మి గారిని అవమానించడం చూశాను. ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి ? ఈ వయసులో ఈ బట్టలు ఏంటి అని బాడీ షేమింగ్ చేస్తున్నారు. సుమగారు గతంలో స్టేజి మీద లేట్ అవుతోందని స్నాక్స్ ని భోజనాల్లాగా చేయకండి అని సరదాగా అన్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది అని ఆ జర్నలిస్ట్ సుమకి వార్నింగ్ ఇచ్చారు. మరి మీ జర్నలిస్టులు చేస్తున్నది ఏంటి ? మీరెందుకు ఇలాంటివి తగ్గించుకోరు అని హేమ సూటిగా ప్రశ్నించారు.
మంచు విష్ణు స్పందించాలి
మంచు లక్ష్మికి జరిగిన అవమానంపై మా అసోసియేషన్ ఇంకా ఎందుకు స్పందించడం లేదు. మంచు లక్ష్మి ఫిలిం ఛాంబర్ కి లెటర్ ఇచ్చారు కదా. దానిపై మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలి కదా అని హేమ ప్రశ్నించింది. మా ప్రెసిడెంట్ అయిన మంచు మంచు విష్ణు గారి సోదరికే ఇలా జరిగితే ఇక సామాన్య నటీనటుల పరిస్థితి ఏంటి ? దీనిపై మంచు విష్ణు కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో అర్థం కావడం లేదు అంటూ అతడిని ఈ వివాదంలో హేమ అడ్డంగా ఇరికించేశారు. ఆ రోజు నా గురించి సోషల్ మీడియాలో వార్త రాగానే మా అసోసియేషన్ వెంటనే చర్యలు తీసుకుంది కదా. ఇప్పుడు మీ సోదరికే అవమానం జరిగింది. దీనిపై మంచు విష్ణు స్పందించాలి అని హేమ డిమాండ్ చేశారు.