- Home
- Entertainment
- ప్రభాస్ 'కల్కి 2' లో సుమతి పాత్రకి ఎవరైతే బెస్ట్ ?.. అనుష్కకి పోటీగా మరో ముగ్గురు హీరోయిన్లు
ప్రభాస్ 'కల్కి 2' లో సుమతి పాత్రకి ఎవరైతే బెస్ట్ ?.. అనుష్కకి పోటీగా మరో ముగ్గురు హీరోయిన్లు
కల్కి చిత్రంలో దీపికా పదుకొణె సుమతి పాత్రలో నటించింది. కల్కికి జన్మనిచ్చే కీలక పాత్ర ఆమెది.దీపికా కల్కి 2 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఆమె ప్లేస్ లో అనుష్క శెట్టితో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

Anushka Shetty
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి చిత్రం గత ఏడాది విడుదలై పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయం సాధించింది. సైన్స్ ఫిక్షన్ కథకి మహాభారతం అంశాలని జోడించిన నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి చిత్రం 1100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రల్లో నటించారు.
వైజయంతి మూవీస్ తో దీపికాకి విభేదాలు
ఈ చిత్రానికి సీక్వెల్ గా కల్కి 2 కూడా అనౌన్స్ చేశారు. కల్కి మొదటి భాగంలో చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వాటికి సమాధానం కల్కి 2లో ఉంటుంది. కల్కి చిత్రంలో దీపికా పదుకొణె సుమతి పాత్రలో నటించింది. కల్కికి జన్మనిచ్చే కీలక పాత్ర ఆమెది. దీపికా మొదటి భాగంలో అద్భుతంగా నటించింది. అయితే నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, దీపికా పదుకొణె మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో దీపికాని కల్కి 2 నుంచి తప్పిస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది.
సుమతి పాత్రలో దీపికా
దీపికా పదుకొణె పెట్టిన డిమాండ్లు భరించడం కష్టం అని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీపికా పదుకొణెని అయితే సీక్వెల్ నుంచి తప్పించారు కానీ..ఆమె పాత్రని కొనసాగించడం ఇప్పుడు చిత్ర యూనిట్ కి పెద్ద సమస్యగా మారింది. సుమతి పాత్రలో ఒదిగిపోయే నటి కోసం కల్కి 2 చిత్ర యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
దీపికా ప్లేస్ లో అనుష్క శెట్టి
దీపికాకి ప్రత్యామ్నాయంగా కొందరి పేర్లని డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరిశీలిస్తున్నారు. అయితే అభిమానుల అంచనాలు మాత్రం వేరేగా ఉన్నాయి. ప్రభాస్ అభిమానులంతా కల్కి 2లో సుమతి పాత్ర కోసం అనుష్క శెట్టిని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్, అనుష్క కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వాళ్లిద్దరూ కలసి స్క్రీన్ పై కనిపిస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఉంది. ఇద్దరి మధ్య రాపో కూడా బావుంటుంది.
అనుష్కకి పోటీగా మరో ముగ్గురు
అనుష్క మాత్రమే కాదు సుమతి పాత్రకోసం మరికొందరి హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సుమతి పాత్రకి నయనతారకూడా బాగా సెట్ అవుతుందని అభిమానుల అభిప్రాయం. అదే విధంగా సమంత, అలియా భట్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.