- Home
- Entertainment
- రాజమౌళి కంటే ముందే బాలయ్యతో 'బాహుబలి' లాంటి మూవీ ప్రారంభించిన డైరెక్టర్, జ్యోతిష్యుడు చెప్పినట్లే జరిగిందా ?
రాజమౌళి కంటే ముందే బాలయ్యతో 'బాహుబలి' లాంటి మూవీ ప్రారంభించిన డైరెక్టర్, జ్యోతిష్యుడు చెప్పినట్లే జరిగిందా ?
నందమూరి బాలకృష్ణ 24 ఏళ్ళ క్రితమే బాహుబలి లాంటి సినిమా ప్రారంభించారు. కానీ ఊహించని సంఘటనలతో ఆ చిత్రం ఆగిపోయింది. ఆ మూవీ విషయంలో జ్యోతిష్యుడు చెప్పినట్లే జరిగింది అని అంటుంటారు.

జానపద చిత్రాలకు పర్ఫెక్ట్ ఛాయిస్ బాలయ్య
నందమూరి బాలకృష్ణకు తన తండ్రి స్థాయిలో కాకున్నా పౌరాణిక చిత్రాల్లో, జానపద చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో జానపద, పౌరాణిక చిత్రాలకు బాగా సరిపోయే హీరో బాలయ్య అనే చెప్పాలి. బాలకృష్ణ భైరవ ద్వీపం చిత్రంతో అప్పట్లో అదరగొట్టారు. ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ హిస్టారికల్ మూవీలో నటించి చరిత్ర సృష్టించారు.
బాలయ్య విక్రమ సింహ భూపతి మూవీ
టాలీవుడ్ లో జానపద చిత్రాల హవా తగ్గుతున్న సమయంలో బాలయ్య చరిత్ర సృష్టించే స్థాయిలో ఒక భారీ చిత్రాన్ని ప్రారంభించారు. 2001లో ఆ చిత్రం ప్రారంభం అయింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాణంలో ఆ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటనే విక్రమ సింహ భూపతి. ఎస్ గోపాల్ రెడ్డి బాలయ్యకి పెద్ద అభిమాని. దీనితో ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దాదాపు 24 ఏళ్ళ క్రితమే టాలీవుడ్ షాక్ అయ్యే బడ్జెట్ లో విక్రమ సింహ భూపతి చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు.
బాహుబలి లాంటి కథ
సగ భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఈ చిత్రంలో బాలయ్య తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించాలి. తండ్రి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించే మహారాజు. కొడుకు యుద్ధ వీరుడిగా ఉంటారు. తండ్రిని ఆయన చుట్టూ ఉన్న వారే కుట్ర చేసి చంపేస్తారు. ఆయా తర్వాత వారిని అంతం చేసి కొడుకు ఆ రాజ్యానికి మహారాజు ఎలా అయ్యాడు అనేది కథ. చూస్తుంటే ఈ కథలో బాహుబలి ఛాయలు ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్లుగా రోజా, అంజలా ఝవేరి ఖరారు అయ్యారు.
జ్యోతిష్యుడు చెప్పినట్లే..
రామోజీ ఫిలిం సిటీ, రాజస్థాన్, అరకు లోయ లాంటి ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు పాటలు చిత్రీకరించారు. కానీ షూటింగ్ మధ్యలోనే బాలయ్యకి దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత గోపాల్ రెడ్డితో విభేదాలు మొదలయ్యాయట. దీనికి తోడు గోపాల్ రెడ్డికి ఓ జ్యోతిష్యుడు..అంతకు ముందే ఈ సినిమా ప్రారంభం అయితే నువ్వు తీవ్ర ఇబ్బందుల్లో పడతావు అని చెప్పారట. జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే బాలయ్యతో విభేదాలు మొదలయ్యాయి. దీనితో కొంతకాలం ఈ చిత్ర షూటింగ్ ఆపేశారు.
నిర్మాత మరణం
ఆ తర్వాత నిర్మాత గోపాల్ రెడ్డి అనారోగ్యానికి గురై మరణించారు. ఆయన విషయాల్లో జ్యోతిష్యుడు చెప్పినట్లే విషాదం జరిగింది. దీనితో విక్రమ సింహ భూపతి చిత్రం పూర్తిగా ఆగిపోయింది. లేకుంటే రాజమౌళి కంటే ముందుగానే బాహుబలి లాంటి సినిమాని కోడి రామకృష్ణ బాలయ్యతో పూర్తి చేసేవారు.