- Home
- National
- ప్రాస్టిట్యూట్ మీద మనసుపడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్.. ఏమైందంటే....
ప్రాస్టిట్యూట్ మీద మనసుపడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్.. ఏమైందంటే....
ప్రాస్టిట్యూట్ మీద మనసుపడ్డ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్...ఆమెను వృత్తి మానేసి తనతో వస్తే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆమె అలాగే చేసింది. ఆ తరువాత పోలీసులు ఓ పెద్ద వ్యభిచారముఠా గుట్టు రట్టు చేశారు.

ఢిల్లీ : నిజ జీవితాలే సినిమాలుగా తీస్తారా? లేక సినిమాల్లో జరిగినవి నిజ జీవితంలో జరుగుతాయా? ఈ ప్రశ్న కొన్ని సార్లు, కొన్ని సంఘటనలు విన్నప్పుడు కలుగుతుంది. ఎందుకంటే అచ్చం సినిమా లాంటి ఓ ఘటన.. నిజజీవితంలో జరిగింది కాబట్టి… నాయకుడు సినిమాలో కమల్ హాసన్.. వ్యభిచార గృహంలో ఉన్న శరణ్యను చూసి అక్కడ నుంచి తప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఇది పాత కథ..
తాజాగా ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి పేరుతో ఇలాంటి సినిమానే తెరకెక్కించాడు. వ్యభిచార గృహంలో ఉన్న జ్యోతిలక్ష్మి అనే అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించి.. అక్కడి నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది సినిమా. కాగా అచ్చంగా ఇలాంటి ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వ్యభిచార గృహంలో ఉన్న ఓ అమ్మాయిని చూసి మనసుపడ్డాడు. అక్కడ నుండి వచ్చేసి తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఇది నిజంగా జరిగిన కథ వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ కు చెందిన 18 మంది యువతులను కొందరు మానవ అక్రమ రవాణా ముఠా సభ్యులు ఉద్యోగాల పేరుతో మోసం చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు.
వీరందరిని ఢిల్లీలోని ఓ హోటల్లో పెట్టారు. వారి దగ్గర ఉన్న సర్టిఫికెట్లు, ఫోటోలు మిగతా కీలక పేపర్లన్నింటినీ తీసేసుకున్నారు.ఆ తర్వాత ఆ యువతులను బెదిరించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. ఒప్పుకోకుండా ఎదురు తిరిగిన వారిని తీవ్రంగా వేధించి బలవంతం చేశారు. వీరిలో 20 ఏళ్ల యువతి కూడా ఉంది.
ఆమెను జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. అక్కడ వీరిని చిత్రహింసలకు గురి చేసిన తర్వాత ఈమెతో పాటు మరికొంతమందిని కలిసి హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న.. వివిధ హోటళ్లకు పంపి వ్యభిచారం చేయిస్తున్నారు.
ఈ క్రమంలోనే దినేష్ అనే యువకుడు ఇటీవల ఆ హోటల్ కి వెళ్ళాడు. అక్కడ ఆ బంగ్లాదేశీ యువతిని చూసి ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆమెతో మాట్లాడాడు. ప్రాస్టిట్యూషన్ వదిలేసి తనతో పాటు వచ్చేయమని… తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని మంచి మనసుకు ఆమె కూడా ఒప్పుకుంది. అయితే అక్కడి నుంచి బయటపడడమే వారికి గగనంగా మారింది.
వారిద్దరూ కలిసి బయటికి వెళుతుండగా ముఠా సభ్యులు చూసి ఆమెను అడ్డుకున్నారు. యువకుడిని కొట్టి, బెదిరించారు. అక్కడి నుంచి తరిమేశారు. మల్లోసారి యువతి జోలికి వస్తే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. యువతిని వేరే ప్రాంతానికి తరలించారు.
indian marriage
అయితే ఆమె మీద మనసు పడ్డ దినేష్ ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని అనుకున్నాడు. స్నేహితుల సహాయంతో ఎలాగో ఆ యువతి నెంబర్ కనుక్కొని ఫోన్ చేశాడు.హర్యానాలోని బల్లభగడ్ ప్రాంతానికి రావాలని ఆ యువతికి చెప్పడంతో.. ఆమె ఎలాగో ఆ ముఠా బారి నుంచి తప్పించుకుని అక్కడికి చేరుకుంది. అక్కడి మొగుడిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత నేరుగా కోర్టుకు వెళ్లారు. తమకు భద్రత కల్పించాలంటూ కోరారు. వారిం కథ విన్న కోర్టు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు విషయంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరి కొంతమంది పరారయ్యారు. వారికోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.