విమాన ప్రయాణానికి ముందు ఈ జాగ్రత్తలు పాటించండి...లేదంటే చిక్కుల్లో పడతారు
మీరు విమాన ప్రయాణం చేయబోతున్నట్లయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రయాణ సమయంలో మీరు ఏ వస్తువులను తీసుకెళ్లవచ్చు, ఏవి తీసుకెళ్లకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మీరు చిక్కుల్లో పడతారు.
ఆ ప్రాంతాలకు వెళ్లకండి
మీరు తీవ్రవాదం ఎక్కువగా వుండే దేశాలకు తరచూ వెళుతున్నారా..? అయితే మీరు ఎలాంటి తప్పు చేయకున్నా సమస్యలు ఎదుర్కోవాల్సి వుంటుంది. ఇలా ఉగ్రవాద, అక్రమాాలకు అడ్డాగా మారిన దేశాలకు వెళ్లేవారిపై నిఘా ఎక్కువగా వుంటుంది.
పాకిస్థాన్, అప్ఘనిస్థాన్ వంటి ఉగ్రవాద, సిరియా, ఉక్రెయిన్ వంటి యుద్దవాతావరణం కలిగిన దేశాలకు తరచూ వెళ్లేవారు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ఆ దేశాలకు తరచూ వెళ్ళడం అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది. అందువల్లే విమానాశ్రయ సిబ్బంది వీరిని ప్రత్యేకంగా తనిఖీ చేపడతారు. ఇలా తమకు తెలియకుండానే అనుమానాస్పద వ్యక్తులుగా మారిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఖరీదైన వస్తువుల గురించి చెప్పండి
అమెరికాతో సహా చాలా దేశాలకు అధికమొత్తంలో డబ్బులు లేదా విలువైన వస్తువులు తీసుకెళ్లకూడదు. బాగా విలువైన వస్తువులను, విలాసవంతమైన గడియారాలు, నగలను తీసుకెళ్తుంటే ముందుగానే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించాలి. ఒకవేళ ఎలాంటి అనుమతి లేకుండా తీసుకెళ్ళే ప్రయత్నం చేసి భద్రతా సిబ్బందికి పట్టుబడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది.
ఇవి తీసుకెళ్తే చిక్కుల్లో పడతారు
ఏనుగు దంతాలు లేదా ఖడ్గమృగం కొమ్ముతో చేసిన వస్తువులను తీసుకెళ్లేవారు అన్ని అనుమతులు తీసుకోవాలి...అనుమతి పత్రాలును వెంటతీసుకెళ్లాలి. వాటిని తీసుకెళ్లేవారికి విమానాశ్రయ భద్రతా సిబ్బంది తప్పకుండా అడ్డుకుంటారు.. కఠినంగా విచారణ చేస్తారు. సరైన పత్రాలు చూపించకున్నా, సరైన సమాధానం చెప్పకున్నా భద్రతా సిబ్బంది విమానాశ్రయంలోని నిర్బంధించే అవకాశం వుంటుంది.
జంతువుల చర్మంతో చేసిన వస్తువులు
అమెరికాలో కుక్క లేదా పిల్లి బొచ్చు వ్యాపారం నిషేధించబడింది. 2000 సంవత్సరంలో తీసుకువచ్చిన, కుక్కలు, పిల్లల రక్షణ చట్టం కింద ఆ జంతువుల నుండి తయారైన వస్తువులను నిషేధించింది. అలాంటి ఉత్పత్తులతో పట్టుబడితే మీ వస్తువులను స్వాధీనం చేసుకోవడమే కాదు జరిమానా విధిస్తారు.
ఇంటి భోజనం కూడా చిక్కులు తేవచ్చు
విమాన ప్రయాణంలో మీరు ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్లలేరు... విమానాశ్రయ తనిఖీ సమయంలో మీ బ్యాగ్‌లో అలాంటిది ఏదైనా కనిపిస్తే మిమ్మల్ని నిర్బంధించవచ్చు. విచారణ పేరుతో మిమ్మల్ని అడ్డుకోవచ్చు. కొన్ని విమానాల్లో నూనె పదార్థాలు తీసుకెళ్ళడం నిషేదం... అలా తీసుకెళితే వాటిని స్వాధీనం చేసుకుని హెచ్చరిస్తారు.. జరిమానా కూడా విధిస్తారు.