కుంభమేళా నుండి మీ ఇంటికి తీసుకెళ్లాల్సిన 5 వస్తువులివే ... వీటితో ఏం చేయాలంటే..
శతాబ్ద కాలం తర్వాత వచ్చిన ప్రమాగరాజ్ మహాకుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేయాలని అనుకుంటున్నారా? అయితే అక్కడినుండి మీరు ఇంటికి తీసుకెళ్లాల్సిన వస్తువులు కొన్ని వున్నాయి... అవేంటో చూద్దాం.

మట్టి
మీరు మహాకుంభ్‌కి వెళితే గంగానది ఒడ్డు నుండి పవిత్రమైన మట్టిని తీసుకురండి. ఈ మట్టిని ఇంట్లో తులసి మొక్కలో లేదా ఎర్రటి రంగు సంచిలో కట్టి పూజ గదిలో ఉంచవచ్చు.
రుద్రాక్ష లేదా తులసి మాల
మహాకుంభ్‌కి వెళితే తప్పకుండా రుద్రాక్ష లేదా తులసి మాలను తీసుకురండి. హిందూ మతంలో ఈ మాల చాలా పవిత్రమైనదిగా భావిస్తారు, ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మీరు తులసి, రుద్రాక్ష మాల ధరిస్తే, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
తులసి ఆకులు
త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత మీరు హనుమాన్ ఆలయానికి వెళితే అక్కడ పండితులు మీకు తులసి ఆకులు ఇస్తారు. ఈ తులసి ఆకులను ఇంటికి తీసుకురండి. వీటిని ఎర్రటి వస్త్రంలో కట్టి డబ్బు పెట్టెలో ఉంచడం శుభప్రదం.
శివలింగం, పూజా సామాగ్రి
మహాకుంభ్ మేళా నుండి మీ ఇంటికి శివలింగం లేదా ఏదైనా ధార్మిక గ్రంథం, పూజా సామాగ్రిని తీసుకురావడం చాలా శుభప్రదం.
పవిత్ర నదుల జలం
త్రివేణి సంగమం నుండి పవిత్ర నది జలన్ని బాటిల్ లేదా కూజాలో నింపి ఇంటికి తీసుకురండి. ఈ జలన్ని ఇంటి చుట్టూ చల్లితే, ఇంట్లో సుఖ శాంతులు, శ్రేయస్సు వస్తాయి. ప్రతికూల శక్తి దూరమవుతుంది.