21 ఏళ్లకే మేయర్,దేశంలోనే రికార్డు: తిరువనంతపురం మేయర్ గా ఆర్య రాజేంద్రన్
First Published Dec 25, 2020, 5:26 PM IST
కేరళ రాష్ట్రంలో సీపీఎం నాయకత్వం మరో నిర్ణయం తీసుకొంది. 21 ఏళ్ల వయస్సున్న ఆర్య రాజేంద్రన్ ను తిరువనంతపురం కార్పోరేషన్ కు మేయర్ గా నియమించనుంది.

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ ఫ్రంట్ అధిక స్థానాలను కైవసం చేసుకొంది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో 21 ఏళ్ల వయస్సున్న ఆర్య రాజేంద్రన్ ను మేయర్ పదవికి సీపీఎం ఎంపిక చేసింది.

ఆర్య రాజేంద్రన్ మేయర్ గా బాధ్యతలు స్వీకరిస్తే దేశంలో అత్యంత చిన్న వయస్సులోనే మేయర్ గా బాధ్యతలు స్వీకరించినట్టుగా ఆర్య రాజేంద్రన్ రికార్డు సృష్టించనున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?