2021లో ప్రధాని మోదీ.. మనసుకు హత్తుకునే 21 ఫొటోలతో..
2021 సంవత్సరం ముగియడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. ఒక్కసారి 2021 సింహావలోకనం చేసుకుంటే ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనేక మంచి పనులకు నాంది పలికారు. ఎంతోమంది చిన్నారులు, యువకుల హృదయాలు దోచుకున్నారు. దేశ, విదేశీ అతిధులతో సంభాషించారు. అలాంటి అరుదైన 21 మోదీ ఫొటోలు ఇవి..

21 Exclusive Photos of PM Modi from 2021
ప్రధాని మోదీ తన కార్యాలయంలో చిన్నారి స్నేహితులతో కలిసి, కాసేపు ముచ్చటించారు. వారి చూపించిన వాటిని ఆసక్తిగా గమనించి.. అడిగి తెలుసుకున్నారు.
21 Exclusive Photos of PM Modi from 2021
ప్రధాని మోదీ పశ్చిమ పర్యటనలో ఓ చిన్నారి మోదీని పలకరించింది. ఆమెతో మాట్లాడుతూ చిన్నారి చెప్పేదాన్ని ఒంగి.. చెవొగ్గి వింటూ..
21 Exclusive Photos of PM Modi from 2021
వారణాసికి.. ప్రధాని మోదీకి విడదీయరాని అనుబంధం. మోదీ ప్రధాని అయ్యాక అక్కడ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఓ సందర్భంలో వారణాసిలో దివ్యాంగులతో ప్రధాని మోదీ..
21 Exclusive Photos of PM Modi from 2021
లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతో ప్రధాని మోదీ సంభాషించారు
21 Exclusive Photos of PM Modi from 2021
ప్రధాని మోదీ నివాసంలో అర్థరాత్రి జరిగిన ఓ సమావేశానికి అధ్యక్షత వహించి.. సమావేశం ఆసాంతం ఆసక్తిగా నడిపించిన సందర్భంలో...
21 Exclusive Photos of PM Modi from 2021
ప్రధానిగా మోదీ రూటే సపరేటు. ఏ విషయమైనా సరే పక్కాగా దాని గురించి అవగాహన కల్పించుకుంటారు. అలా ఓ మంత్రి మండలి సమావేశంలో నోట్స్ తీసుకుంటున్న ప్రధాని మోదీ
21 Exclusive Photos of PM Modi from 2021
సుష్మా స్వరాజ్ భవన్‌లో తన మంత్రి మండలితో కలిసి ‘చింతన్ సత్ర’లో చివరి వరుసలో కూర్చుని శ్రద్ధగా వింటున్న ప్రధాని మోదీ.
21 Exclusive Photos of PM Modi from 2021
మోదీ ప్రత్యేకత ఏంటంటే.. తన చుట్టూ ఉన్నవారిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపడం.. అలా ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ
21 Exclusive Photos of PM Modi from 2021
ప్రధాని మోదీని ఆశీర్వదిస్తున్న మణినగర్ శ్రీ స్వామినారాయణ గాడి సంస్థాన్ ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ జితేంద్రియప్రియదాస్‌జీ స్వామీజీ మహరాజ్
21 Exclusive Photos of PM Modi from 2021
వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ. వారణాసి అంటే మోడీకి ఎంతో ఇష్టమైన ప్రదేశం.. అక్కడి అణువణువులోనూ కొత్త ఉత్సాహాన్నిచ్చే ఆధ్యాత్మికత ఏదో ఉంటుంది.
21 Exclusive Photos of PM Modi from 2021
పద్మశ్రీ అవార్డుల బహూకరణ సందర్బంగా.. రాష్ట్రపతి భవన్‌లో పద్మశ్రీ తులసి గౌడతో చేతులు పట్టుకుని కాసేపు ముచ్చటించిన ప్రధాని మోదీ
21 Exclusive Photos of PM Modi from 2021
వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ.. వారణాసికి కొత్త హంగులు ఏర్పాటు చేయడంలో.. ప్రపంచంలోనే పవిత్రమైన ఆద్యాత్మిక ప్రదేశంగా తీర్చి దిద్దడంలో ముందున్నారు మోడీ
21 Exclusive Photos of PM Modi from 2021
కోయంబత్తూరులో 105 ఏళ్ల రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పాపమ్మాళ్ జీ నుంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ
21 Exclusive Photos of PM Modi from 2021
విక్టోరియా మెమోరియల్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ‘పరాక్రమ్ దివస్’ వేడుకల్లో ప్రధాని మోదీ
21 Exclusive Photos of PM Modi from 2021
నియంత్రణ రేఖ, రాజౌరి సరిహద్దు పోస్ట్‌లోని నౌషేరా వద్ద తన దీపావళి పర్యటనలో సాయుధ దళాల సభ్యులతో ప్రధాని మోదీ
21 Exclusive Photos of PM Modi from 2021
వాటికన్ సిటీలో ప్రధాని మోదీకి పోప్ ఫ్రాన్సిస్ స్వాగతం..అలాగే లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ సందర్భంగా మహిళా హాకీ జట్టు సభ్యులతో ప్రధాని మోదీ దిగిన ఫొటో కూడా వైరల్ అయ్యింది
21 Exclusive Photos of PM Modi from 2021
PE/VC పరిశ్రమకు చెందిన CEOలతో PM సమావేశం. నిల్చునే వారితో హాయిగా కబుర్లు చెబుతున్నట్టుగా మొత్తం సమావేశాన్ని నడిపించారు మోడీ
21 Exclusive Photos of PM Modi from 2021
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ప్రజల శుభాకాంక్షలు...హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు
21 Exclusive Photos of PM Modi from 2021
కాన్పూర్‌లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ పరస్పర చర్చ సందర్భంగా మనస్సుకు హత్తుకునే సందర్భం
21 Exclusive Photos of PM Modi from 2021
ప్రయాగ్‌రాజ్‌లో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ పరస్పర చర్చ సందర్భంగా ఒక అందమైన క్షణం