MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Sathi leelavathi Movie Review: సతీ లీలావతి మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీ ఎలా ఉందంటే?

Sathi leelavathi Movie Review: సతీ లీలావతి మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీ ఎలా ఉందంటే?

పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన మూవీ `సతీ లీలావతి`. దేవ్‌ మోహన్‌ ఆమెకి జోడీగా చేసిన ఈ చిత్రం నేడు విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : May 08 2026, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లావణ్య త్రిపాఠి సతీ లీలావతి మూవీ రివ్యూ
Image Credit : Asianet News

లావణ్య త్రిపాఠి సతీ లీలావతి మూవీ రివ్యూ

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన చిత్రం `సతీ లీలావతి`. దేవ్‌ మోహన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్‌ నిర్మాత. ఇందులో వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(మే 8న) విడుదలైంది. మరి  లావణ్య త్రిపాఠికి హిట్ పడిందా? సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
సతీ లీలావతి మూవీ కథ
Image Credit : Asianet News

సతీ లీలావతి మూవీ కథ

లీలా(లావణ్య త్రిపాఠి) పేరెంట్స్(వీకే నరేష్‌, పవిత్ర లోకేష్‌) చిన్నప్పట్నుంచి చీటికి మాటికి గొడవపడుతుంటారు. దీంతో లీలా ఒంటరిగా పెరగాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఓ తోడుని వెతుక్కుంటుంది. సేతు(దేవ్‌ మోహన్‌) అనాథశ్రమంలో పెరుగుతాడు. ఆయన్ని చూసి ఇష్టపడుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ప్రారంభంలో ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ తర్వాత ఆమె దర్శకురాలిగా బిజీ అవుతుంది. స్టార్‌ డైరెక్టర్‌ గా రాణిస్తుంది. దీంతో సేతుకి టైమ్‌ ఇవ్వలేకపోతుంది. ఆయన ఒంటరిగా బాధపడుతుంటాడు. తాను స్వతహాగా సైకియాట్రిస్ట్. కానీ తాను సైకియాట్రిస్ట్ కి చూపించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆయన నర్స్ నికోలా సెబాస్టియన్‌(మడోనా సెబాస్టియన్‌)ని చూసి ఫిదా అవుతాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. దీంతో లీలాకి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఆ విషయం చెప్పగానే లీలా రియాక్షన్‌ ఏంటి? ఇంట్లో బంధించి ఎందుకు కొట్టింది? నికోలాని చూసి లీలా రియాక్షన్‌ ఏంటి? లీలా ఇంట్లోకి వచ్చిన దొంగ(సప్తగిరి) ఏం చేశాడు? నిర్మాత(మొట్టా రాజేంద్రన్‌) లీలాని ఎందుకు కిడ్నాప్‌ చేయాలనుకుంటాడు? చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? ఎలాంటి ముగింపు పలికిందనేది  సినిమా.

Related Articles

Related image1
Godari Gattupaina Review: గోదారి గట్టుపైన మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమంత్‌ ప్రభాస్‌ ఈసారైనా హిట్‌ కొట్టాడా?
Related image2
Razor Movie Review: రేజర్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. రవిబాబు అన్నీ తానై చేసిన మూవీ ఎలా ఉందంటే?
36
సతీ లీలావతి మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

సతీ లీలావతి మూవీ ఎలా ఉందంటే?

సతీ లీలావతి మూవీ భార్యాభర్తల మధ్య గొడవ ప్రధానంగా చేసుకుని, దాని చుట్టూ కామెడీని అల్లుకుని రూపొందించిన చిత్రం. సందర్భాను సారంగా కామెడీని జనరేట్‌ చేయాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. భార్యాభర్తల గొడవలు ఇప్పుడు కామన్‌, ఒకరికొకరు టైమ్‌ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్లు వేరే వాళ్లకి కనెక్ట్ అవుతుంటారు. అది గొడవలకు దారితీస్తాయి. ఇందులో సరిగ్గా అదే జరిగింది. లావణ్య స్టార్‌ డైరెక్టర్‌ కావడంతో ఆమె బిజీగా ఉంటుంది. భర్తకి టైమ్‌ ఇవ్వలేకపోతుంది. దీంతో దేవ్‌.. మరో అమ్మాయికి కనెక్ట్ అవుతాడు. కానీ దాన్ని లావణ్య ఒప్పుకోదు. భర్తని నానా రకాలుగా హింసపెడుతుంది. ఆయా సన్నివేశాలను ఫన్నీగా మలిచాడు దర్శకుడు. అయితే ఆయా సీన్లు ఆశించని స్థాయిలో పండలేదు. కామెడీ కొన్ని చోట్ల ఫర్వాలేదు, కానీ మొత్తంగా వర్కౌట్‌ కాలేదు. కొన్ని సీన్లు మరీ క్రేజీగా ఉన్నాయి. సినిమా కథని ప్రారంభంలో ఎస్టాబ్లిష్‌ చేసిన తీరు బాగుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. హీరోయిన్‌ చిన్ననాటి సన్నివేశాలను వివరించిన తీరు, నరేష్‌, పవిత్ర లోకేష్‌ గొడవలు ఆసక్తికరంగా ఉంటాయి. హీరోహీరోయిన్లు ప్రేమలో పడే సీన్లు, ప్రారంభంలో ఉండే సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. మొట్టా రాజేంద్రన్‌ పాత్ర కూడా అలరిస్తుంది. ఇంటర్వెల్‌ వరకు ఇలా ఉత్కంఠ భరితంగా, కొంత క్రేజీగా సాగుతుంది. సెకండాఫ్‌లో ఫన్‌ కాస్త రాంగ్‌ రూట్‌లోకి వెళ్తుంది. లాయర్‌ వీటీవీ గణేషన్‌ ఎంట్రీ, ఆ తర్వాత దొంగగా సప్తగిరి ఎంట్రీ, సెబాస్టియన్‌ ఎంట్రీ దొంగలతో ఇద్దరు హీరోయిన్లు చేసే ఫైట్లు బాగున్నా, ఓవర్‌గా అనిపిస్తాయి. అనవసరమైన లౌడ్‌ నెస్‌, గందరగోళానికి దారితీస్తుంది. మొట్టా రాజేంద్ర లావణ్యని కిడ్నాప్‌ చేయడం, మళ్లీ వదిలేయడం, మళ్లీ కిడ్నాప్‌ చేయడం, ఈ క్రమంలో లావణ్య ఆడే డ్రామా నవ్వులు పూయించడం కష్టం చిరాకు ఎక్కువగా తెప్పించాయి. అయితే చాలా చోట్ల సహజమైన కామెడీని వర్కౌట్‌ చేసే ప్రయత్నం చేశారు. నరేష్‌ పాత్ర కూడా కొంత రిలీఫ్‌నిస్తుంది. కానీ ఆయన్ని సరిగ్గా వాడుకోలేదు. క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. గేమ్‌తో ముగించిన తీరు కూడా డిఫరెంట్‌గా ఉంది. ఓవరాల్‌గా మూవీ నవ్వులు తక్కువ గోల ఎక్కువ అనేట్టుగా సాగింది.

46
సతీ లీలావతి మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

సతీ లీలావతి మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

లీలాగా దర్శకురాలి పాత్రలో లావణ్య త్రిపాఠి ఇరగదీసింది. సినిమా మొత్తం తన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆమె కూడా అంతే బాగా చేసి మెప్పించింది. దర్శకురాలిగా, భార్యగా, లవర్‌గా, సైకో భార్యగా అదరగొట్టింది. యాక్షన్‌ సీన్లు కూడా అదిరిపోయేలా చేసింది. ఇందులో ఆమె నటిగా చాలా ఓపెన్‌ అయి చేసి మెప్పించింది. సేతుగా దేవ్‌ మోహన్‌ పాత్ర ఫర్వాలేదు. కానీ హీరోయిన్‌గా గొడవలో ఓడిపోయిన తీరు అసహజంగా ఉంది. నికోలా సెబాస్టియన్‌ పాత్రలో మడోనా సెబాస్టియన్‌ అందంతో కట్టిపడేసింది. యాక్షన్‌ పరంగా మెప్పించింది. మొట్టా రాజేంద్రన్‌ నిర్మాతగా నవ్వించాడు. మరోవైపు లావణ్య బావ పాత్రలో జాఫర్‌ పాత్ర అలరిస్తుంది. కొన్ని చోట్ల నవ్విస్తుంది. దొంగగా సప్తగిరి ఇరగదీశాడు. రెచ్చిపోయి చేశాడు. చాలా రోజుల తర్వాత పాత సప్తగిరి కనిపిస్తాడు. వీటీవీ గణేషన్‌ పాత్ర కొన్ని చోట్ల నవ్విస్తుంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.

56
సతీ లీలావతి టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

సతీ లీలావతి టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

టెక్నీకల్‌గా సతీ లీలావతి బాగుంది. బినేంద్ర మీనన్‌ విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. స్క్రీన్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. సతీష్‌ సూర్య ఎడిటింగ్‌ ఫర్వాలేదు. కాకపోతే కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం ఫర్వాలేదు. దర్శకుడు తాతినేని సత్య ఎంచుకున్న కథ ఫర్వాలేదు. దాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఫన్నీ సీన్లు అన్నీ వర్కౌట్‌ కాలేదు. కొంత వరకు మాత్రమే నవ్వించాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. నాగ మోహన్‌ చాలా రిచ్‌గా తీశారు. రాజీపడకుండా నిర్మించారు. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అయితే సినిమాలో ఫ్యామిలీకి సంబంధించి అంతర్లీనంగా అందించిన సందేశం బాగుంది. భార్యాభర్తలు ఎంత గొడవ పడ్డా, అది ఇంటికే పరిమితం కావాలి, కానీ విడిపోయే వరకు వెళ్లకూడదని చెప్పిన సందేశం బాగుంది.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

కొంత వరకు అలరించే సతీ లీలావతి. భార్యాభర్తలకు సంబంధించిన ఇచ్చిన సందేశం బాగుంది.

రేటింగ్‌: 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Razor Movie Review: రేజర్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. రవిబాబు అన్నీ తానై చేసిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Godari Gattupaina Review: గోదారి గట్టుపైన మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమంత్‌ ప్రభాస్‌ ఈసారైనా హిట్‌ కొట్టాడా?
Recommended image3
Gaayapadda Simham Movie Review: గాయపడ్డ సింహం రివ్యూ, తరుణ్ భాస్కర్ కు ట్రంప్ అంటే ఎందుకంత కోపం?
Related Stories
Recommended image1
Godari Gattupaina Review: గోదారి గట్టుపైన మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమంత్‌ ప్రభాస్‌ ఈసారైనా హిట్‌ కొట్టాడా?
Recommended image2
Razor Movie Review: రేజర్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. రవిబాబు అన్నీ తానై చేసిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved