MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Godari Gattupaina Review: గోదారి గట్టుపైన మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమంత్‌ ప్రభాస్‌ ఈసారైనా హిట్‌ కొట్టాడా?

Godari Gattupaina Review: గోదారి గట్టుపైన మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమంత్‌ ప్రభాస్‌ ఈసారైనా హిట్‌ కొట్టాడా?

సుమంత్‌ ప్రభాస్‌, నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం `గోదారి గట్టుపైన`. లైలా కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

4 Min read
Author : Aithagoni Raju
Published : May 08 2026, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గోదారి గట్టుపైన మూవీ రివ్యూ
Image Credit : Asianet News

గోదారి గట్టుపైన మూవీ రివ్యూ

`మేమ్‌ ఫేమస్‌`తో దర్శకుడిగా, హీరోగా ఆకట్టుకున్న సుమంత్‌ ప్రభాస్‌ కొంత గ్యాప్‌తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చాడు. `గోదారి గట్టుపైన` అనే చిత్రంలో హీరోగా నటించాడు. సుభాష్‌ చంద్ర దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో జగపతిబాబు కీలక పాత్ర పోషించగా, ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ లైలా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. సుదర్శన్‌, కసిరెడ్డి, రాజీవ్‌ కనకాల, హర్షవర్థన్‌, దేవి ప్రసాద్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఏసియన్‌ సినిమాస్‌ సమర్పణలో రెడ్‌ పప్పెట్‌ మూవీ పతాకంపై అభినవ్‌ రావ్‌ నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(మే 8)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? సుమంత్‌ ప్రభాస్‌కి ఎట్టకేలకు హిట్‌ పడిందా? లైలా రీఎంట్రీ అదిరిపోయిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గోదారి గట్టుపైన మూవీ కథ
Image Credit : Asianet News

గోదారి గట్టుపైన మూవీ కథ

రాజు(సుమంత్‌ ప్రభాస్‌)కి చదువు పెద్దగా అబ్బదు. ఆటో నడిపిస్తూ, ఫ్రెండ్స్(సుదర్శన్‌, కసిరెడ్డి, రాఘవ్‌)లతో సరదాగా ఎంజాయ్‌ చేస్తుంటారు. ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తుంటాడు. తనకు చెల్లి కూడా ఉంటుంది. ఆమె చదువుకుంటుంది. ఓ రోజు రోడ్డుపై కోడి కోసం రాజు, ఫ్రెండ్‌ సుదర్శన్‌ గొడవ పడుతుంటే, ఓ అమ్మాయి వచ్చి చెంప చెల్లుమనిపిస్తుంది. పేరు మాయ(నిధి ప్రదీప్‌). వాళ్ల నాన్న శ్యామ్‌బాబు(జగపతిబాబు) చాలా స్టిక్ట్. బయటకు అలా కనిపిస్తాడు, కానీ కూతురుని ప్రేమతో ఏ లోటు లేకుండా పెంచుతాడు. మాయకి తొలి చూపులోనే పడిపోతాడు రాజు. తన ఫ్రెండ్స్ హెచ్చరించినా ఆమె వెంటపడతాడు. తీరా చూస్తే ఆమె తన చెల్లి ఫ్రెండ్‌ అని తెలుస్తుంది. దీంతో రోజూ ఆటోలో తీసుకెళ్తూ ఆమెని ఇంప్రెస్‌ చేస్తాడు. ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతుంటారు. అయితే మాయ రోజూ ఇంటికి లేట్‌ గా వస్తుండటంతో శ్యాంబాబుకి డౌట్‌ వస్తుంది. ఆయన భార్య ఝాన్సీ(లైలా)ని హెచ్చరిస్తుంటాడు. మాయ పుట్టిన రోజున చిన్నపాటి సర్‌ప్రైజ్‌ చేస్తాడు రాజు. ఆ నెక్ట్స్ డే రాజు పుట్టిన రోజు. దీంతో ఆర్థరాత్రి ఊహించిన ట్రీట్‌ ఇస్తుంది మాయ. వర్షం కురిసిన రాత్రి ఇద్దరు డీప్‌ లవ్‌లోకి వెళ్తారు. ముద్దులు కూడా పెట్టుకుంటారు. ఆటైమ్‌లో మాయ వాచ్‌ తెగిపోతుంది. దీంతో రాజుని కొట్టి వెళ్లిపోతుంది. ఇంకెప్పుడు తనని కలవొద్దు అని చెబుతుంది. మరి సడెన్‌గా మాయ అలా ఎందుకు ప్రవర్తించింది? ఆ వాచ్‌ వెనుక ఉన్న కథేంటి. రాజు మాయ మళ్లీ కలుసుకున్నారా? రాజు, మాయ ప్రేమ విషయం తెలిసి శ్యాంబాబు ఏం చేశాడు? చివరికి వీరి ప్రేమ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
Tollywood Couples: ఫ్లాప్ సినిమాలతో పరిచయం.. ప్రేమ పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా సూపర్ హిట్టైన జంటలు
Related image2
Sathi leelavathi Review: సతీ లీలావతి ఫస్ట్ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీలో హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
36
గోదారి గట్టుపైన మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

గోదారి గట్టుపైన మూవీ విశ్లేషణ

హీరో చాలా మంచివాడు, మంచి బుద్దులుండటం, వాళ్ల పేరెంట్స్ పద్ధతిగా పెంచడమనే కాన్సెప్ట్ తో ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం చాలా సినిమాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే అప్పుడన్నీ ఇలాంటి చిత్రాలే. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరో చాలా మంచివాడు, ఇతరులకు సాయం చేసే మనస్తత్వంతో పెరుగుతాడు. పేరెంట్స్ అతన్ని అలా పెంచుతారు. హీరోయిన్‌ ప్రేమలో పడటం, చివరికి ఆర్థికంగా తక్కువ వాడు కావడంతో తన కూతురు ఇబ్బంది పడుతుందని హీరోయిన్‌ తండ్రి హీరోకి వార్నింగ్‌ ఇవ్వడంతో, హీరో తన ప్రేమని త్యాగం చేయడం, చివరికి హీరో గొప్ప హృదయాన్ని తెలుసుకొని తన మనసు మార్చుకుని అతనికి తన కూతురుని ఇవ్వడమే ఈ మూవీ స్టోరీ.  జెన్‌ జీ జనరేషన్‌లో, యాక్షన్‌, క్రేజీ లవ్‌ స్టోరీస్‌, బోల్డ్ కంటెంట్‌, మంచి కామెడీ చిత్రాలు, థ్రిల్లర్స్ ఆదరణ పొందుతున్న ఇలాంటి తరుణంలో ఇలాంటి సినిమా అనేది ఔట్‌డేటెడ్‌ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అయితే కథగా పాతదే అయినా, స్క్రీన్‌ప్లే పరంగా కొంత ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సుదర్శన్‌తో, కసిరెడ్డి బ్యాచ్‌తో హీరో చేసే ఫన్‌ ఆకట్టుకుంటుంది. కొంత వరకు నవ్వులు పూయిస్తుంది. లవ్‌ స్టోరీ రొటీన్‌గానే ఉంటుంది. కానీ అక్కడక్కడ రొమాంటిక్‌ సన్నివేశాలు అలరిస్తాయి. హీరోయిన్‌ లుక్స్ బాగుంటాయి. ఆమెని చూపించిన తీరు బాగుంది. అలాగే హీరో మరదలి పాత్రతో కొంత ఫన్‌ వర్కౌట్‌ అయ్యింది. ఇవి తప్ప సినిమాలో ఆకట్టుకునే, ఎట్రాక్ట్ చేసే అంశాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. ఫస్టాఫ్‌తో అంతా అమ్మాయితో లవ్‌ స్టోరీ ప్రధానంగా సాగుతుంది. ఈ క్రమంలో హీరో బ్యాచ్‌తో కొన్ని కామెడీ సీన్లు అలరిస్తాయి. ఇంటర్వెల్‌లో లవ్‌ లోని ట్విస్ట్ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. కానీ మళ్లీ రొటీన్‌లోకి వెళ్లిపోతుంది. ఎంత సేపు అదే లవ్‌ ట్రాక్‌ అనేలా సాగుతుంది. క్లైమాక్స్ లో హీరోయిన్‌ తండ్రి  హడావుడి ఉంటుంది, కొంత ఎమోషనల్‌గా ఉంటుంది. కానీ అంతలోనే రెగ్యూలర్‌ ఎండింగ్‌ ఇచ్చారు. స్క్రీన్‌ పరంగా అక్కడక్కడ నవ్విస్తుంది. లవ్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. మిగిలినదంతా రొటీన్‌, ఓల్డ్ ఫార్మాట్‌ మూవీ అని చెప్పొచ్చు. కామెడీని ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు.లౌడ్‌ ఎక్కువైంది, కామెడీ తక్కువైంది. ఎమోషన్స్ సీన్లు కూడా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. జగపతిబాబు పాత్రకి చాలా ఎలివేషన్లు ఇచ్చారు, కానీ ఎక్కడా ఆయా సీన్లు చూపించలేదు. ఈ జెనరేషన్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమనే చెప్పొచ్చు. ఇందులో హైలైట్‌ ఏంటంటే `వర్షం` సినిమాకి సంబంధించిన థియేటర్ సీన్లు మాత్రమే.

46
గోదారి గట్టుపైన మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

గోదారి గట్టుపైన మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

రాజుగా సుమంత్‌ ప్రభాస్‌ బాగానే చేశాడు. కాకపోతే ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఇంకా బాగా చేయాల్సింది. చాలా సన్నివేశాల్లో అతన్ని సైడ్‌లో కవర్‌ చేశారు. కాకపోతే హీరోయిజం తాలుకూ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొన్ని ఓవర్‌గా అనిపిస్తాయి. ఆంధ్ర యాస తేలిపోయింది.  హీరోయిన్ మాయగా నిధి ప్రదీప్‌ కొత్తగా ఉంది. ఆకట్టుకుంటుంది. ఆమెకి ఫ్యూచర్‌ ఉంది. అలాగే హీరోకి మరదలుగా చేసిన అమ్మాయి మాత్రం బాగా గుర్తిండిపోతుంది. బాగా చేసింది. ఆమె హీరోయిన్‌ని డామినేట్‌ చేసింది. హీరోకి చెల్లిగా చేసిన అమ్మాయి కూడా ఆకట్టుకుంది. జగపతిబాబు తన పాత్రలో మెప్పించారు. కానీ తాను చేయాల్సిన పాత్ర కాదు అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక లైలా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకిది రాంగ్‌ ఛాయిస్‌. ఆమె ఇమేజ్‌కి, ఈ పాత్రలో ఊహించుకోలేం. ఆమె అభిమానులు మాత్రం కచ్చితంగా డిజప్పాయింట్‌ అవుతారు. రాజీవ్‌ కనకాల పాత్ర కూడా బలంగా లేదు. హర్షవర్థన్‌ పోలీస్‌గా మెప్పించాడు. హీరో ఫ్రెండ్స్ గా సుదర్శన్‌, కసిరెడ్డి, రాఘవ్‌ నవ్వించే ప్రయత్నం చేశారు.

56
టెక్నికల్‌గా గోదారి గట్టుపైన మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

టెక్నికల్‌గా గోదారి గట్టుపైన మూవీ ఎలా ఉందంటే?

నాగ వంశీ మ్యూజిక్ ఫర్వాలేదు. కొన్ని చోట్ల బీజీఎం ఆకట్టుకుంది. ఒక పాట అలరిస్తుంది. వర్షం మూవీలోని సాంగ్స్ ఊపు తెచ్చేలా ఉంటాయి. విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. కనువిందుగా ఉంది. ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు సుభాష్‌ చంద్ర ఎంచుకున్న కథే పాతది, కానీ తనదైన ట్రీట్‌మెంట్‌తో కొన్ని చోట్ల ఆకట్టుకున్నా, మొత్తంగా మాత్రం మెప్పించలేకపోయింది. డిజప్పాయింట్‌ చేసింది.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

 కొత్త సీసాలో చాలా పాత సారా. 

రేటింగ్‌: 2

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image2
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Recommended image3
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Tollywood Couples: ఫ్లాప్ సినిమాలతో పరిచయం.. ప్రేమ పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా సూపర్ హిట్టైన జంటలు
Recommended image2
Sathi leelavathi Review: సతీ లీలావతి ఫస్ట్ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీలో హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved