MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: అట్టర్ ఫ్లాప్ అనుకున్న మూవీని ఛాలెంజ్ చేసి మరీ సంవత్సరం ఆడించిన చిరంజీవి.. తొలి రోజే అపశకునం

Chiranjeevi: అట్టర్ ఫ్లాప్ అనుకున్న మూవీని ఛాలెంజ్ చేసి మరీ సంవత్సరం ఆడించిన చిరంజీవి.. తొలి రోజే అపశకునం

చిరంజీవి నటించిన ఒక సూపర్ హిట్ మూవీ ప్రారంభోత్సవం రోజే అపశకునంతో మొదలైంది. దీనితో ఆ చిత్రం ఫ్లాప్ అని అంతా భావించారు. కానీ చిరంజీవి ఏమని ఛాలెంజ్ చేశారో ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 16 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో కొత్త దర్శకులని ప్రోత్సాహించారు. సినిమా విషయంలో చిరంజీవి ఇచ్చే సలహాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ దిగ్గజ దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. కమర్షియల్ మూవీ అయినా, కుటుంబ కథా చిత్రం అయినా, భక్తి చిత్రం అయినా, హారర్ మూవీ అయినా, ఎలాంటి జోనర్ చిత్రం అయినా సరే సూపర్ హిట్ చేయగల సత్తా ఉన్న అరుదైన దర్శకుడు కోడి రామకృష్ణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి సినిమాతో ఎంట్రీ
Image Credit : Asianet News

చిరంజీవి సినిమాతో ఎంట్రీ

కోడి రామకృష్ణ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చింది చిరంజీవి మూవీతోనే. చిరంజీవి, పూర్ణిమ, మాధవి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య చిత్రం అది. తొలి చిత్రం కావడంతో ప్రారంభోత్సవం రోజు తాను చాలా టెన్షన్ తో ఉన్నట్లు కోడి రామకృష్ణ తెలిపారు. నేను తెరకెక్కించబోయే ఫస్ట్ మూవీ ఇదే.. కాబట్టి ఫస్ట్ షాట్ చిరంజీవి గారిపైనే ఉండాలి అని అనుకున్నా.

35
చిరంజీవితో అనుకున్నారు కానీ
Image Credit : Asianet News

చిరంజీవితో అనుకున్నారు కానీ

కానీ చిరంజీవి గారు ప్రారంభోత్సవానికి రావడం కాస్త ఆలస్యం అయింది. అక్కడున్న వారంతా పూర్ణిమతో ఫస్ట్ షాట్ ఫినిష్ చేయమని బలవంతం చేశారు. నిర్మాత రాఘవ గారికి అన్నీ టైం ప్రకారం జరగాలి. లేకుంటే ఒప్పుకోరు. దీనితో తప్పని పరిస్థితుల్లో పూర్ణిమపై ఫస్ట్ షాట్ చిత్రీకరించా. అందరూ క్లాప్స్ కొట్టి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. నా ఫస్ట్ షాట్ కావడంతో నేను కూడా చాలా సంతోషించా. చిరంజీవి గారితో ఫస్ట్ షాట్ తీయలేదనే బాధ మనసులో ఉంది.

45
ఫస్ట్ షాట్ తోనే అపశకునం
Image Credit : Asianet News

ఫస్ట్ షాట్ తోనే అపశకునం

కెమెరా అసిస్టెంట్ ఒకరు నా దగ్గరకు పెరిగెట్టుకుంటూ వచ్చి సార్ కెమెరా బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు సార్ అన్నాడు. సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా నా వైపు చూశారు. అందరి ముఖాల్లో ఆశ్చర్యం. నేను మాత్రం.. నా లైఫ్ లో ఫస్ట్ షాట్ ఇలా అయింది ఏంటి అని బాధపడుతూ ఉన్నాను. అందరూ దీనిని అపశకునం లాగా భావించారు. కొత్త డైరెక్టర్, పైగా తొలి షాట్ ఇలా అయింది అంటే ఈ సినిమా ఫ్లాప్ అయినట్లే.. ఇంతకన్నా అపశకునం మరొకటి ఉండదు అని మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి.

55
ఛాలెంజ్ చేసిన మెగాస్టార్
Image Credit : Asianet News

ఛాలెంజ్ చేసిన మెగాస్టార్

అప్పుడే చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు. అందరూ సీరియస్ గా ఉండడం చూసి జరిగిన విషయం తెలుసుకున్నారు. రామకృష్ణ ఇలా రా.. ఏంటి నువ్వు చేసింది, ఫస్ట్ షాట్ నాపై తీస్తా అన్నావ్ కదా. పూర్ణిమపై తీశావ్ ఏంటి అంటూ హుషారుగా మాట్లాడుతూ సెట్ లో ఉన్న అట్మాస్పియర్ మార్చేశారు. తిరిగి అందరిలో ఉత్సాహం నింపారు. ఇప్పుడు ఫస్ట్ షాట్ నాపై చిత్రీకరించు.. ఈ మూవీ సంవత్సరం రోజులు ఆడకపోతే అప్పుడు అడుగు అని ఛాలెంజ్ చేశారు. ఆయన చెప్పినట్లుగానే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ఏడాది ఆడింది అని కోడి రామకృష్ణ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Recommended image2
Highest Multistarrer: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Recommended image3
Chiranjeevi Remuneration: ఫస్ట్ సినిమాకి చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Related Stories
Recommended image1
Tollywood: క్లైమాక్స్ లతో థియేటర్లు దద్దరిల్లేలా చేసిన టాప్ 5 మూవీస్.. ఆ ట్విస్ట్ లు లేకుంటే సినిమాలు ఫ్లాప్
Recommended image2
Kumbhakarna: కుంభకర్ణుడు అంత గొప్పవాడా, అయినా శ్రీరాముడు భయంకర యుద్ధం చేసి అతడిని ఎందుకు చంపాడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved