MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Nani: ఇంటికి వచ్చిన స్టార్ హీరోయిన్ తో వంట చేయించిన నాని... కారణం ఏంటి? ఎవరా హీరోయిన్?

Nani: ఇంటికి వచ్చిన స్టార్ హీరోయిన్ తో వంట చేయించిన నాని... కారణం ఏంటి? ఎవరా హీరోయిన్?

Nani: రీసెంట్ గా ప్యారడైజ్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ పై దండయాత్ర చేశాడు నేచురల్ స్టార్ నాని. పక్కంటి కుర్రాడిలా అందరిలో కలిసిపోతారు నాని. హీరోయిన్లు కూడా నాని అంటే బాగా అభిమానిస్తారు. ఓ హీరోయిన్ ను ఇంటికి పిలిచి మరీ వంట చేయించాడట నాని.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 06 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెట్ లో అల్లరి చేయడం బాగా అలవాటు..
Image Credit : our own

సెట్ లో అల్లరి చేయడం బాగా అలవాటు..

సినిమా షూటింగ్‌లు, బిజీ షెడ్యూల్స్ మధ్య ఉండే నటీనటులు సెట్స్‌లోనే కాకుండా బయట కూడా ఎంతో ఆప్యాయంగా కలిసి ఉంటారు. ముఖ్యంగా హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న హీరో నాని.. తన హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉంటాడు. హీరోయిన్లు కూడా నానిని బాగా ఇష్టపడతారు. హద్దులు మీరకుండా.. సెట్ లో తోటి తారలతో బాగా అల్లరి చేస్తుంటాడు నాని. తనతో బాగా కనెక్ట్ అయిన హీరోయిన్లు అయితే.. నాని ఇంటికి కూడా వెళ్తుంటారట. ఆయన ఫ్యామిలీతో కలిసిపోతుంటారు కూడా. అలానే హీరోయిన్ కీర్తి సురేష్‌ కూడా ఓ సారి నాని ఇంటికి వెళ్లిందట. అక్కడ తనకు ఓ షాక్ ఇచ్చారట నాని.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నాని, కీర్తి సురేష్ బెస్ట్ ఫ్రెండ్స్..
Image Credit : Asianet News

నాని, కీర్తి సురేష్ బెస్ట్ ఫ్రెండ్స్..

నాని, కీర్తి సురేష్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. 'నేను లోకల్', 'దసరా' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఒకసారి నాని ఇంటికి వెళ్లిన కీర్తి సురేష్ అక్కడ చేసిన సందడి, ఆమెకు ఆ ఇంట్లో తగిలిన షాక్ గురించి.. రీసెంట్ గా ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో నాని, కీర్తి సురేష్ కలిసి వెల్లడించారు. బాగా ఆకలి అవుతుంది.. తిందామనుకుంటే.. కీర్తి చేతనే వంట చేయించారట నాని ఫ్యామిలీ.

34
ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు..
Image Credit : X

ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు..

ఒకరోజు కీర్తి సురేష్, నాని ఇంటికి అతిథిగా వెళ్లారు. "ఏం తింటావు?" అని నాని అడగ్గా, ఆమె చటుక్కున "దోస తింటాను" అని చెప్పారు. దానికి నాని కూడా "ఓకే, వెరీ గుడ్" అని చెప్పి, దోసల కోసం కీర్తితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎంతసేపైనా ప్లేట్‌లోకి దోసలు రాకపోవడంతో అక్కడ వింత పరిస్థితి ఏర్పడింది. డైనింగ్ టేబుల్ వద్ద నాని, కీర్తి సురేష్ అలానే కూర్చుని ఎదురుచూస్తున్నారు.కిచెన్‌లో అసలు ఏం జరిగింది?తీరా చూస్తే, ఇంట్లోని పనివాళ్లు, నాని భార్య అంజు (అంజనా) కిచెన్ లోపల నిలబడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అది చూసి నానికి, కీర్తి సురేష్ కు ఆశ్చర్యం వేసింది.

44
నానీ ఇంట్లో వంట చేసిన కీర్తి సురేష్..
Image Credit : Asianet News

నానీ ఇంట్లో వంట చేసిన కీర్తి సురేష్..

దోసలు వేయడానికి అక్కడ పిండి సిద్ధంగానే ఉంది, కానీ ఎవరూ ముందుకు వచ్చి దోస వేసి ఇవ్వడం లేదు! కిచెన్‌లోకి వెళ్లిన అంజు కూడా అక్కడి పరిస్థితి చూసి నవ్వు ఆపుకోలేకపోయారు.అందరూ నవ్వుకుంటూ ఉండేసరికి విషయమేంటో అర్థమైన కీర్తి సురేష్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా కిచెన్‌లోకి వెళ్లిపోయారు. ఎవరి కోసం ఎదురుచూడకుండా తానే స్వయంగా దోస పిండి తీసుకుని, పెనంపై దోస వేసుకుని, హాయిగా తిన్నారు.ఈ సరదా జ్ఞాపకాన్ని ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు నాని,కీర్తి సురేష్.

స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎలాంటి ఈగో లేకుండా నాని ఇంట్లో కిచెన్‌లోకి వెళ్లి సొంతంగా దోస వేసుకుని తిన్న కీర్తి సురేష్ నిరాడంబరతకు, వీరిద్దరి మధ్య ఉన్న నిజమైన స్నేహానికి నెటిజన్లు మురిసిపోతున్నారు. కొంత మంది మాత్రం నానీ ఇంట్లో వాళ్లకు దోశలు వేయడం రాదా అని విమర్శిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhairava Dweepam Review: బాలకృష్ణ జీవితంలో చేసిన అతి పెద్ద సాహసం, భైరవద్వీపం సక్సెస్ కు కారణాలు ఇవే..
Recommended image2
Premane Oorilo Movie Review: ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. కన్నడలో హిట్‌, మరి ఇక్కడ ?
Recommended image3
Anakapalli Movie Review: అనకాపల్లి మూవీ రివ్యూ.. విలన్‌ని హీరోయిన్‌ ప్రేమిస్తే, హీరో ఏం చేశాడు?
Related Stories
Recommended image1
Mohan Babu: రోడ్డున పడతాడని తెలిసినా.. మోహన్ బాబు చేసిన సాహసం, 7 ప్లాప్ ల తర్వాత బయటపడ్డ డైలాగ్ కింగ్..
Recommended image2
Bhairava Dweepam Review: బాలకృష్ణ జీవితంలో చేసిన అతి పెద్ద సాహసం, భైరవద్వీపం సక్సెస్ కు కారణాలు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved