MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Agnipariksha Final List: అగ్ని పరీక్ష టాప్ 15 లిస్ట్.. పదో సీజన్‌లోకి వెళ్లేది వీళ్లేనా ?

Agnipariksha Final List: అగ్ని పరీక్ష టాప్ 15 లిస్ట్.. పదో సీజన్‌లోకి వెళ్లేది వీళ్లేనా ?

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ప్రారంభానికి ముందు అగ్నిపరీక్ష స్టార్ట్ కానుంది. రేపటి నుంచి స్టార్ట్ కానున్న ఈ షోకి సంబంధించిన 15 మంది ఫైనల్‌ లిస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 14 2026, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అగ్నిపరీక్ష టాప్‌ కంటెస్టెంట్ల లిస్ట్ లీక్‌
Image Credit : youtube/@starmaa

అగ్నిపరీక్ష టాప్‌ కంటెస్టెంట్ల లిస్ట్ లీక్‌

బిగ్ బాస్ అగ్ని పరీక్ష రెండో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. మరోమ 24 గంటల్లో ఈ షో ప్రారంభం కానుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వేల సంఖ్యలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలించిన టీం.. చివరకు 70 మందిని అగ్ని పరీక్షకు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాకముందే ఇప్పుడు కొన్ని లీకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్నిపరీక్షకి వచ్చిన కంటెస్టెంట్లు ఎంత మంది? వీరిలో ఎంత మంది ఫైనల్‌ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయిగే అగ్నిపరీక్షకి ఎంపికైన వారి లిస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష టాప్‌ 15 లిస్ట్
Image Credit : youtube/@starmaa

బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష టాప్‌ 15 లిస్ట్

అగ్ని పరీక్ష ప్రసారం ప్రారంభం కాకముందే టాప్ 15 కంటెస్టెంట్లకు సంబంధించిన ఓ లిస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అగ్ని పరీక్షలో పాల్గొనే 70 మంది అగ్ని వారియర్స్ నుంచి టాస్కులు, వివిధ రౌండ్ల అనంతరం టాప్ 15 మందిని ముగ్గురు జడ్జీలు ఎంపిక చేస్తారని తెలుస్తోంది. జడ్జ్ లుగా నవదీప్‌, బిందు మాధవి, అభిజీత్‌లు వ్యవహరిస్తున్నారు. వీరు ఎంపిక చేసిన 15 మందిలో నుంచి చివరకు కొంతమందిని మాత్రమే బిగ్ బాస్ పదో సీజన్‌లోకి పంపించనున్నారని సమాచారం. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే తుది కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ చివరి దశలోనే జరుగుతుందని తెలుస్తోంది.

Related Articles

Related image1
Husharu Pittalu Review: హుషార్‌ పిట్టలు మూవీ రివ్యూ.. కుర్రాళ్లకి పండగే, కానీ అసలు ట్విస్ట్‌ ఏంటంటే?
Related image2
Vishwanath and Sons Review: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే?
35
అగ్నిపరీక్షలో టాప్‌లో ఉన్నది వీళ్లే
Image Credit : Asianet News

అగ్నిపరీక్షలో టాప్‌లో ఉన్నది వీళ్లే

ప్రస్తుతం వైరల్ అవుతున్న లీక్ ప్రకారం రాజకుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగి తుల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వలు టాప్ 15లో చోటు దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లిస్ట్‌పై అధికారికంగా బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో వైరల్ అవుతున్న సమాచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

45
ఆగస్ట్ 15 నుంచి అగ్నిపరీక్ష 2 ప్రారంభం
Image Credit : Asianet News

ఆగస్ట్ 15 నుంచి అగ్నిపరీక్ష 2 ప్రారంభం

ఇక ఈ టాప్ 15 నుంచి బిగ్ బాస్ పదో సీజన్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తుది కంటెస్టెంట్ల ఎంపిక పూర్తవుతుందని తెలుస్తోంది. అందుకే అగ్ని పరీక్ష2లో టాప్ 15లో నిలిచిన వారిలో ఎవరికీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. అగ్నిపరీక్ష స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 నుంచి స్టార్‌ మాస్‌లో, జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్ట్ 31 వరకు ఈ షో రన్ కానున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన షూటింగ్‌ ఆల్‌రెడీ పూర్తయ్యింది. రేపట్నుంచి కేవలం టీవీలో ప్రసారం చేస్తారు. అందుకే ఈ లిస్ట్ లీక్‌ అయ్యిందని సమాచారం. ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ సెప్టెంబర్‌ మొదటి ఆదివారం నుంచి స్టార్ట్ కానుంది. దీనికి నాగార్జున హోస్ట్ గా చేయనున్నారు.

55
బిగ్‌ బాస్‌ తెలుగు 10లోకి రాబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరేనా
Image Credit : our own

బిగ్‌ బాస్‌ తెలుగు 10లోకి రాబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరేనా

మరోవైపు బిగ్ బాస్ పదో సీజన్ కోసం పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే సంప్రదించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆటో రామ్ ప్రసాద్ దాదాపు కన్ఫామ్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ‘కుకు విత్ జాతిరత్నాలు’ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు, దీపిక రంగరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, ఆషిక, పల్లవి గౌడ, పల్లవి రామిశెట్టి, కావ్యశ్రీ వంటి పేర్లు కూడా బిగ్ బాస్ సీజన్ 10 జాబితాలో వినిపిస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Related Stories
Recommended image1
Husharu Pittalu Review: హుషార్‌ పిట్టలు మూవీ రివ్యూ.. కుర్రాళ్లకి పండగే, కానీ అసలు ట్విస్ట్‌ ఏంటంటే?
Recommended image2
Vishwanath and Sons Review: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved