MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Nagabandham Review: `నాగబంధం` మూవీ రివ్యూ, రేటింగ్.. విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా మూవీ బాబోయ్‌ టార్చర్‌

Nagabandham Review: `నాగబంధం` మూవీ రివ్యూ, రేటింగ్.. విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా మూవీ బాబోయ్‌ టార్చర్‌

Nagabandham Review: ఈ వారం టాలీవుడ్‌లో వస్తోన్న క్రేజీ చిత్రాల్లో నాగబంధం ఒకటి. అభిషేక్‌ నామా దర్శకత్వం వహించిన ఈ ఎపిక్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

4 Min read
Author : Aithagoni Raju
Published : Jul 03 2026, 04:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
నాగబంధం మూవీ రివ్యూ
Image Credit : X/@nikstudiosindia

నాగబంధం మూవీ రివ్యూ

`పెదకాపు` ఫేమ్‌ విరాట్‌ కర్ణ హీరోగా, నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం `నాగబంధం`. ఈ మూవీకి ప్రముఖ నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహించారు. నిక్‌ స్టూడియోస్‌, అభిషేక్‌ పిక్చర్స్ పతాకాలపై  కిశోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో జగపతిబాబు, మహేష్‌ మంజ్రేకర్‌, రిషభ్‌ సావ్నీ, రామచంద్రరాజు, అనసూయ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. నేడు శుక్రవారం(జులై 3న) సినిమా విడుదలైంది.  భారీ స్కేల్‌లో ఎపిక్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి ప్రమోషన్స్ తో హైప్‌ క్రియేట్‌ చేశారు. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా? హడావుడి చేసిన స్థాయిలో సినిమా ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నాగబంధం మూవీ కథ
Image Credit : X/@nikstudiosindia

నాగబంధం మూవీ కథ

మరణాన్ని జయించే శక్తి కోసం మనిషి తపించే కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అదే సమయంలో ఈ సృష్టిని శాసించాలనే కథలతోనూ సినిమాలు వస్తున్నాయి.  ఈ సృష్టించిన శాసించే శక్తి కోసం, ఆ శక్తి ఉన్న బ్రహ్మకమలం కోసం చేసే పోరాటమే ఈ సినిమా.1962 సమయంలో ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతిబాబు) ఎన్నో కొత్త విషయాలు కనిపెడతారు. అదే సమయంలో ఆయనకు అంతుచిక్కని విషయాలు కూడా ఉంటాయి. అందులో ఒకటి నాగబంధం రహస్యం. ఇలాంటి సమయంలో తన అల్లుడు ఎవరికీ అంతుచిక్కని నాగబంధానికి సంబంధించిన పుస్తకాన్ని తీసుకొస్తాడు. ఇదే విషయంపై పీఎంని కలవాలనుకుంటారు. అయితే ఆ పుస్తకం ద్వారా బ్రహ్మకమలం ఎక్కడుందో కనిపెడతారు. అది రంగనాథస్వామి దేవాలయంలో విష్ణువు వద్ద ఉంటుంది. దాన్ని దొంగిలించేందుకు కుట్రలు చేస్తారు. ఎట్టకేలకు దొంగిలిస్తాడు. ఇందులో ప్రభాకర్‌ పాత్ర కూడా ఉంటుంది. మరోవైపు రుద్ర(విరాట్ కర్ణ)కి చెల్లి అంటే ప్రాణం. ఆమె పెళ్లి విషయంలో మేనత్త(అనసూయ) కుటుంబం సమస్య చేస్తారు. కానీ చివరికి ఓకే చెబుతారు. కానీ కొడుకు మాత్రం ఊరుకోడు. సరిగ్గా పెళ్లిరోజు విధ్వంసం సృష్టిస్తాడు. అందుకు విలన్ అయిన అలీ(రిషబ్‌ సహానీ)తో చేతులు కలుపుతాడు. అతను బ్రహ్మకమలం కోసం వస్తాడు. పెళ్లిలో రుద్ర చెల్లితోపాటు అమ్మని, మరదల్ని, అత్తని చంపేస్తాడు. ఎంతో మందిని ఊచకోత కోస్తాడు. అక్కడి నుంచి బ్రహ్మకమలం తీసుకొని వెళ్తాడు. వారితోపాటు ప్రభాకర్‌ కూడా ఉంటాడు. ఈ సందర్భంగా తాను ప్రేమించిన పార్వతి(నభా నటేష్‌)   మోసం చేస్తుంది, వెన్నుపోటు పొడుతుంది. మరి బ్రహ్మకమలంతో నాగబంధం విడుదల జరిగిందా? సంపద కాజేయాలని, తానే అత్యంత శక్తివంతుడిని కావాలనే విలన్‌ కోరిక నెరవేరిందా? దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, ఈ కథకి, అనంత పద్మ నాభ స్వామి టెంపుల్‌కి ఉన్న సంబంధం ఏంటనేది సినిమా.

Related Articles

Related image1
Soundarya: రెండు లక్షలకు కక్కుర్తి పడి ప్రాణాలు పోగొట్టుకుంది.. సౌందర్య గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన దర్శకుడు
Related image2
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
37
నాగబంధం మూవీ ఎలా ఉందంటే?
Image Credit : X/@nikstudiosindia

నాగబంధం మూవీ ఎలా ఉందంటే?

దేవుడికి సంబంధించిన శక్తులు, గ్రంథాలు,  తెలియని అంశాలను అన్వేషణ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కార్తికేయ లాంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. అదే సమయంలో దేవుడికి సంబంధించిన శక్తుల ప్రధానంగా తెరకెక్కిన `హనుమాన్‌`, `మిరాయ్‌` సినిమాలు కూడా బ్లాక్‌ బస్టర్ గా నిలిచాయి. అయితే ఇటీవల సనాతన ధర్మం, హిందుత్వం అంటూ దేవుడిని నమ్ముకొని చాలా సినిమాలు వస్తున్నాయి. ప్రజల్లో దేవుడిపై ఉన్న నమ్మకాన్ని,సెంటిమెంట్‌ని క్యాష్‌ చేసుకోవాలని మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. బోల్తా పడుతున్నారు. సహజత్వంగా కథలో  అలాంటి దైవత్వానికి సంబంధించిన అంశాలు ఉంటే ఓకే, కానీ కావాలని చాలా వరకు ఇరికిస్తున్నారు. అదే తేడా కొడుతుంది. సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌గా మారుతున్నాయి. ఇప్పుడు వచ్చిన `నాగబంధం` పరిస్థితి కూడా ఇదే అని చెప్పొచ్చు. నాగబంధం ఇడిపించడం అనే పాయింట్‌ మీద ఈ మూవీ కథ సాగుతుంది. ఈ కథలోకి హీరో ఎలా వచ్చాడు? ఎలా బ్రహ్మకమలానికి రక్షణగా నిలిచాడనేది సినిమా. ప్రారంభం నుంచి కథ విషయంలో ఒక క్లారిటీ లేదు. కథని నడిపించే ఒక థ్రెడ్‌ లేదు. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్లినట్టుగా ఉంటుంది. ఏదైనా సినిమాకి ఎమోషన్స్ చాలా ముఖ్యం. ఆ ఎమోషన్స్ క్యారీ అయితేనే డ్రామా పండుతుంది. యాక్షన్‌ అయినా ఆకట్టుకుంటుంది. ఇందులో ఎమోషన్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. పైగా సీన్ బై సీన్‌ ఎలివేషన్‌ స్థాయిలో ఉంటాయి. కట్‌ కట్‌ కట్‌ అనేలా ఒకదాని తర్వాత మరో సీన్‌ వస్తుంటాయి, పోతుంటాయి, ఎందుకు వచ్చాయో, ఎందుకు పోయాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. పెళ్లి విషయంలో హీరో ఫ్యామిలీ, మేనత్త ఫ్యామిలీ మధ్య గొడవలు, విలన్‌ అదే సమయంలో బ్రహ్మకమలం కోసం ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయడం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. బాధగా అనిపిస్తుంది. ఆయా సీన్లో చంపేయాల్సిన పనిలేదు.  అవి టూ మచ్‌ అనిపిస్తుంది. 

47
విజువల్స్, పాటలు హైలైట్‌.. కానీ అదంతా మైనస్సే
Image Credit : X/@nikstudiosindia

విజువల్స్, పాటలు హైలైట్‌.. కానీ అదంతా మైనస్సే

ఫస్టాఫ్‌లో కథగా పెద్దగా లేదు, కానీ విజువల్స్ బాగున్నాయి. పాటలు అదిరిపోయాయి. చాలా గ్రాండియర్‌గా ఉంది. ఇంటర్వెల్‌ సస్పెన్స్, ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్‌పై అంచనాలు పెంచుతుంది. కానీ సెకండాఫ్‌ మరీ స్లోగా ఉంటుంది.  అరుపుల మధ్య సాగుతుంది. చిన్న పిల్లలు, ఆడవాళ్లు అనే సెంటిమెంట్‌ని బాగానే దట్టించారు, కానీ అవి ఆకట్టుకునేలా, ఎమోషనల్‌గా లేవు. సెకండాఫ్‌ రివేంజ్‌ కోసం వెళ్తాడు హీరో. బ్రహ్మకమలం కనిపెట్టే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో హీరో ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుంది. అది ఎప్పుడు జరిగిందో క్లారిటీ లేదు. ఇక క్లైమాక్స్ యాక్షన్‌ ఎపిసోడ్‌ అరగంటకు పైగానే ఉంటుంది. దాని చుట్టూనేకథని నడించాడు. ఫ్లాష్‌ బ్యాక్‌, ప్రజెంట్‌ సీన్లు మిక్స్ అయి వస్తుంటాయి. అవి ఆడియెన్స్ కి ఏమాత్రం కనెక్ట్ కాలేదు. ఇక యాక్షన్‌ సీన్లలో అరుపులతో హోరెత్తించారు. విసుగు తెప్పించారు. క్లైమాక్స్ మాత్రం టార్చర్‌ అని చెప్పొచ్చు. అందులోనే హిందుత్వం, సనాతన ధర్మం అంటూ మరింతగా టార్చర్‌ చేశారు. ఫైనల్‌గా విజువల్ బాగున్నా ఎమోషన్స్, ఒక లక్ష్యం లేని మూవీగా ఇది నిలుస్తుంది. 

57
నాగబంధంలో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : X/@nikstudiosindia

నాగబంధంలో నటీనటులు ఎలా చేశారంటే?

రుద్రగా విరాట్‌ కర్ణ నటన బాగుంది. ఆయన అదరగొట్టాడు. సాధువుగా, కామన్‌ మ్యాన్‌గా మెప్పించాడు. యాక్షన్‌ సీన్లలో బాగా చేశాడు. హీరోగా ఆయన్ని మరో మెట్టు ఎక్కించే మూవీ అవుతుంది. కాకపోతే సినిమా స్థాయికి ఆయన ఇమేజ్‌ సరిపోలేదు.  ఇక పార్వతిగా నభా నటేష్‌ అదరగొట్టింది. ద్విపాత్రాభినయం చేసి మెప్పించింది. ఆమె పాత్రలోని ట్విస్ట్ బాగుంది. ఆర్కియాలజిస్ట్ గా జగపతిబాబు పాత్ర బాగుంది. ఆయన పాత్రలోని ట్విస్ట్ కూడా మెప్పించింది. బైరాగీగా గరుడ రామ్‌ అదరగొట్టాడు.  ఐశ్వర్య మీనన్‌, అనసూయ, మురళీ శర్మ వంటి వారు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విలన్‌గా రిషబ్‌ అదరగొట్టాడు.

67
నాగబంధం టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : X/@nikstudiosindia

నాగబంధం టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమాకి మ్యూజిక్‌ ప్లస్‌గా నిలుస్తుంది. జునైడ్‌ కుమార్‌, అభిషిక్త్, కొత్తపల్లి అందించిన పాటలు, బీజీఎం అదిరిపోయింది. సినిమాకి హైలైట్‌గా నిలిచింది. సౌందర్‌రాజన్‌ కెమెరా వర్క్ అదిరిపోయింది. విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. వీఎఫ్‌ఎక్స్ కూడా బాగున్నాయి. కొన్ని చోట్లు తేలిపోయాయి. అశోక్‌ కోరలత్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా బాగుంది. సినిమా గ్రాండియర్‌ గా ఉంది. దర్శకుడు అభిషేక్‌ నామా ఎంచుకున్న కథలో క్లారిటీ మిస్‌ అయ్యింది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు. స్క్రీన్‌ ప్లే పరంగానూ మిస్టేక్స్ ఉన్నాయి. ఒక సీన్‌కి, మరో సీన్‌కి సంబంధం లేదు, సింక్‌ అయ్యేలా లేవు. విజువల్స్ పరంగా గ్రాండియర్‌గా తెరకెక్కించారు. బడ్జెట్‌ పరంగా రాజీ లేదు.  కానీ మిగిలిన విషయంలో విఫలమయ్యారు. 

77
ఫైనల్‌గా
Image Credit : X/@nikstudiosindia

ఫైనల్‌గా

విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా, కథగా, సినిమా పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేని సినిమా. ఒక రకంగా ఇది ఆడియెన్స్ పై నాగబంధం ప్రయోగమని చెప్పొచ్చు.   

రేటింగ్‌ : 2

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
Recommended image2
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
Malliswari Movie Review: చైనాలో 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా, తనకంటే 2 ఏళ్లు పెద్దదైన హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్..
Related Stories
Recommended image1
Soundarya: రెండు లక్షలకు కక్కుర్తి పడి ప్రాణాలు పోగొట్టుకుంది.. సౌందర్య గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన దర్శకుడు
Recommended image2
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved