MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?

Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?

సుమంత్‌ మళ్లీ స్పీడ్‌ పెంచాడు. ఇప్పుడు ఆయన `మహేంద్రగిరి వారాహి` మూవీతో వచ్చారు. ఐశ్వర్య రాజేష్‌, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ మూవీ నేడు విడుదలైంది. మరి ఇది ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? సుమంత్‌కి హిట్‌ పడిందా అనేది చూద్దాం.

4 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 11 2026, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ
Image Credit : X/@rajashyamalae

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించారు. లవ్‌ స్టోరీస్‌, మాస్‌ సినిమాలతో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్‌లు లేవు. దీంతో కొంత బ్రేక్‌ తీసుకున్నారు. అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నారు. స్పీడ్‌ పెంచారు. వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఆ మధ్యనే `న్యూటన్స్ 3వ లా`తో అలరించిన ఆయన ఇప్పుడు `మహేంద్రగిరి వారాహి` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ఇందులో ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటించారు. సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్‌ రోల్‌ చేశారు. వెన్నెల కిశోర్‌, బ్రహ్మానందం, రాజీవ్‌ కనకాల, అలీ వంటి వారు ఇతర పాత్రల్లో మెరిశారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ పతాకాలపై కలిపు మధు, సురభి లక్ష్మణ్‌ రావు నిర్మించారు. అనూప్‌ రూమెన్స్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, ఆర్కే ప్రతాప్‌ సినిమాటోగ్రఫీ, జునైద్‌ సిద్ధిఖి ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 11)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? సుమంత్‌కి మరో హిట్‌ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మహేంద్రగిరి వారాహి మూవీ కథ
Image Credit : X/@rajashyamalae

మహేంద్రగిరి వారాహి మూవీ కథ

మహేంద్రగిరి రాజవంశాన్ని 200 ఏళ్లుగా వారాహి అమ్మవారి శాపం వెంటాడుతుంటుంది. ఆ కుటుంబంలో జన్మించిన ప్రతి మగాడు 33వ జన్మతిథి రోజు కన్నుమూస్తుంటారు. అది యాక్సిడెంట్‌గానే జరుగుతుంటుంది. అమ్మవారే స్వయంగా వచ్చి ప్రాణాలు తీస్తుంటుంది. అందుకు కారణం ఆ వంశంలో మహేంద్రవర్మ అనే రాజు.. మహేంద్రగిరి అమ్మవారి దేవాలయంలో ఉన్న అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడటమే. ఆ శాప విముక్తికోసం రాజవంశానికి చెందినవారు అనేక రకాల పూజలు చేస్తారు. కానీ ఫలితం ఉండదు. దీన్ని రాజేంద్ర వర్మ(సిద్ధు జొన్నలగడ్డ) సైతం ఎదురిస్తాడు. కానీ ఆ శాపానికి బలవుతాడు. అతని భార్య సుజాత(మాళవిక మోహనన్‌) అప్పటికే గర్భవతి. ఆమె కూడా కారు ప్రమాదంలో గాయపడుతుంది. కానీ ఆమె ఏమైందనేది సస్పెన్స్. ఇక ప్రస్తుతం రాజవంశంలో మగాళ్లు లేదు. కానీ కూతురు కొడుకు ఉంటాడు. అతను కూడా వీరి రక్తమే కావడంతో ఆ శాపం వారికి కూడా వర్తిస్తుంటుందంటారు. అయితే దాన్ని నరేంద్రవర్మ(వంశీ) పెద్దగా లెక్కచేయడు. దానికి విముక్తి ఉందని తన భార్య చెబుతుంది. కానీ అది కూడా విఫలమవుతుంది. అతను, అతనితోపాటు సిద్ధార్థ్‌(సుమంత్‌) అన్న రాజీవ్‌(కమల్‌ కామరాజు) కూడా అమ్మవారి శాపానికి బలవుతారు. ఇద్దరు ఒకే రోజు మహేంద్రగిరి వారాహి అమ్మవారి టెంపుల్‌కి వస్తారు. అందులో దున్నపోతు వారిద్దని పొడిచి చంపేస్తుంది. ఇదంతా అమ్మవారి శాపం వల్లే జరిగిందా? లేక దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అనుమానం సిద్ధార్థ్‌కి కలుగుతుంది. సిద్ధార్థ్‌ ఒక యూట్యూబర్‌. ఇలాంటి మూఢ నమ్మకాలను ఇన్వెస్టిగేట్‌ చేసి దొంగ బాబాలు, మాంత్రికుల బండారాలు బయటపెడుతుంటాడు. అయితే ఇప్పుడు తన అన్న రాజీవ్‌ మరణానికి కారణం ఏంటి? మహేంద్రగిరి రాజవంశంలో అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఈ క్రమంలో తనకు ఎదురైన అడ్డంకులేంటి? ఎలాంటి అనుభవాలు ఫేస్‌ చేశాడు? ఇందులో బ్రహ్మానందం, రాజీవ్‌ కనకాల, వెన్నెల కిశోర్‌ పాత్రలు ఏంటి? వారి పాత్రల్లో ఉన్న ట్విస్ట్ లేంటి? ఐశ్వర్యా రాజేష్‌ పాత్రేంటి? ఈ మొత్తానికి సిద్ధార్థ్‌ ఎలాంటి ముగింపు పలికారు అనేది మిగిలిన సినిమా.

36
మహేంద్రగిరి వారాహి మూవీ విశ్లేషణ
Image Credit : X/@rajashyamalae

మహేంద్రగిరి వారాహి మూవీ విశ్లేషణ

ఒక కుటుంబంలో అమ్మవారి శాపం, దేవుడి శాపం కథతో `మురారి` సినిమా వచ్చింది. అది పెద్ద హిట్‌. మళ్లీ అలాంటి కథతోనే ఇప్పుడు `మహేంద్రగిరి వారాహి` మూవీని రూపొందించారు. శాపం ఉందనేది ముందే తెలిసిపోతుంది. దాన్ని ఆ రాజవంశానికి చెందిన వాళ్లు ఎలా ఫేస్‌ చేశారు? దాన్నుంచి బయటపడ్డారా? బలయ్యారా? అనేదే కథ. దాన్ని ట్విస్ట్ లతో నడిపించడం విశేషం. ఇక సినిమా ప్రారంభంలో శాపానికి సంబంధించిన బ్యాక్‌ స్టోరీని వివరిస్తారు. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లోకి వచ్చాక ఆ ఎమోషన్‌ గానీ, ఆ పెయిన్‌గానీ సినిమాలో క్యారీ కాదు. కథ బాగున్నా, దాన్ని కన్విన్సింగ్‌గా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. హీరో సుమంత్ యూట్యూబ్‌ ఛానెల్‌ రన్‌ చేయడం, దానికోసం ఆయన మూఢవిశ్వాసాలను వ్యాప్తి చేసే వారిని పట్టించడం వంటి సీన్లు టైమ్‌ పాస్‌ గా ఉన్నాయి. ఓ వైపు సిద్ధార్థ్‌ కోణంలో, ఇంకోవైపు మహేంద్రగిరి రాజవంశంలో జరిగే సన్నివేశాలతో నడిపించారు. ఆయా సీన్లు ఇంట్రెస్టింగ్‌గా నడుస్తాయి. కానీ ప్రమాదాలు, ఆ వంశంలోని వారు చనిపోవడం, కొంత మిస్టరీయస్‌ అంశాలు ఆకట్టుకుంటాయి. థ్రిల్లర్‌ ఎపిసోడ్‌ ఎంగేజ్‌ చేస్తాయి. అమ్మవారికి సంబంధించిన సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. వారాహి టెంపుల్‌లో చోటు చేసుకున్న రెండు మరణాలతో కథ వేడెక్కుతుంది. సెకండాఫ్‌ లో హీరో ఇన్వెస్టిగేషన్‌ కొంత ఆసక్తికరంగా సాగుతుంది. ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. అదే సమయంలో అది కొంత రాంగ్‌ ఛాయిస్‌అనిపిస్తుంది. కామెడియన్ల పాత్రల్లోని ట్విస్ట్ ని ఆడియెన్స్ ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. కథ బ్యాక్‌ డ్రాప్‌ని అంతే బలంగా చెప్పడంలో, అంతే ఎమోషనల్‌గా, నాటకీయంగా ఆవిష్కరించడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. అయితే దేవతకి సంబంధించిన సీన్లలోనూ హై మూమెంట్స్ ఆకట్టుకుంటాయి.

46
మహేంద్రగిరి వారాహి మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : X/@rajashyamalae

మహేంద్రగిరి వారాహి మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

సిద్ధార్థ్‌ పాత్రలో సుమంత్‌ ఫర్వాలేదనిపించాడు. ప్రారంభంలో ఆయన పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. సెకండాఫ్‌లో బాగుంది. సుమంత్‌ కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌ ఆసక్తికర సాగింది. ఇక రాజేంద్ర వర్మగా సిద్ధు జొన్నలగడ్డ కాసేపు కనిపించి మెప్పించాడు. కానీ ఆయన పాత్ర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. అలాగే ఐశ్వర్యా రాజేష్‌ పాత్ర కాసేపు సర్‌ప్రైజ్‌ చేస్తుంది. చివర్లో ఆమె పాత్ర వాహ్‌ అనిపిస్తుంది. నరేంద్ర వర్మగా వంశీ మెప్పించే ప్రయత్నం చేశాడు. కమల్‌ కామరాజు పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. మరోవైపు పూజారిగా బ్రహ్మానందం కనిపించాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ షాకిస్తుంది. అలాగే రాజీవ్‌ కనకాల పాత్రలోని ట్విస్ట్ ఊహించేలా ఉంటుంది. దీనికితోడు వెన్నెల కిశోర్‌ పాత్ర కొంత ఎంటర్‌ టైన్‌ చేసింది.

56
మహేంద్రగిరి వారాహి మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : X/@rajashyamalae

మహేంద్రగిరి వారాహి మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమాకి అనూప్‌ రూబెన్స్ మ్యూజిక్‌ అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతం కొంత వరకు ఓకే. కానీ ఎలివేట్‌ చేయాల్సిన సీన్లలోనూ నార్మల్‌గానే ఆర్‌ఆర్‌ ఉండటం, అది కూడా రొటీన్‌గానే ఉంది. ఇదే సినిమాకి పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. దీంతో చాలా సీన్లు తేలిపోయాయి. ముఖ్యంగా దేవుడికి సంబంధించిన సీన్లు చప్పగా సాగాయి. ఆర్కే ప్రతాప్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్ పరంగా ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్‌ పరంగా కొంత వర్క్ చేయాల్సింది. దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి ఎంచుకున్న కథ పాతదే దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించాడు. సినిమా లుక్‌ గ్రాండియర్‌గా ఉంది. కానీ ఆ స్థాయి సీన్లు లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. సస్పెన్స్ అంశాలు ఫర్వాలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంది. దాన్ని అంతా సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ విషయంలో దర్శకుడి ఆలోచన వేరే లెవల్‌ అని చెప్పొచ్చు.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

దేవుడికి సంబంధించిన కథలతో చాలా సినిమాలు వస్తున్నాయి. చాలా వరకు ఆకట్టుకుంటున్నాయి. ఇది కూడా ఆ కోవకి చెందిన మూవీనే. అయితే అందులో ట్విస్ట్ లు, టర్న్ లతో నడిపించిన తీరు బాగుంది. ఇలాంటి డివైన్‌ మూవీస్‌ ఇష్టపడేవారికిది నచ్చే చిత్రమవుతుంది.

రేటింగ్‌: 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image2
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image3
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Epic Movie Review: ఎపిక్‌ మూవీ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved