MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • M4M Movie Review: ఎం4ఎం మూవీ రివ్యూ, రేటింగ్‌.. జో శర్మ, మోహన్‌ వడ్లపట్ల సినిమా ఎలా ఉందంటే?

M4M Movie Review: ఎం4ఎం మూవీ రివ్యూ, రేటింగ్‌.. జో శర్మ, మోహన్‌ వడ్లపట్ల సినిమా ఎలా ఉందంటే?

M4M Movie Review: మర్డర్‌ మిస్టరీ, క్రైమ్‌ బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. ఈ శుక్రవారం ఇదే కథాంశంతో `ఎం4ఎం` అనే చిత్రం వచ్చింది. మరి ఇది ఎలా ఉందంటే? 

3 Min read
Author : Aithagoni Raju
Published : May 08 2026, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎం4ఎం మూవీ రివ్యూ
Image Credit : Asianet News

ఎం4ఎం మూవీ రివ్యూ

ప్రముఖ పాపులర్‌ నిర్మాత, దర్శకుడు మోహన్‌ వడ్లపట్ల రూపొందించిన చిత్రం `ఎం4ఎం`(మోటివ్‌ ఫర్‌ మర్డర్‌). జో శర్మ, సంబీత్‌ ఆచార్య, శుభలేఖ సుధాకర్‌, ఎంఆర్‌సీ వడ్లపట్ల, రాజేష్‌ మాత్రే, గీతా భాస్కర్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్‌ మీడియా క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో మోహన్‌ వడ్లపట్ల రూపొందించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(మే 8)న విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎం4ఎం మూవీ స్టోరీ
Image Credit : Asianet News

ఎం4ఎం మూవీ స్టోరీ

సిటీలో స్టార్‌ హీరో రంజిత్‌(కృష్ణ తేజ) హత్యకు గురవుతాడు. అతను బట్టలు లేకుండా ఒక పెయింటింగ్‌ ఆకారంలో కూర్చుంటాడు. ఈ హత్యతో సిటీ ఒక్కసారిగా కలవరానికి గురవుతుంది. ఈ కేసుని ఏసీపీ కృష్ణ(సంబీత్‌ ఆచార్య) ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. అతని భార్య రాధ(జో శర్మ) లెజిట్ న్యూస్‌ పేపర్‌లో క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్ గా పనిచేస్తుంటుంది. కృష్ణకి ఈ కేసు విషయంలో సపోర్ట్ చేస్తుంటుంది. వీరిద్దరు కలిసి విచారించే క్రమంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. పాపులర్‌ అయిన వ్యక్తులు వరుసగా హత్యకు గురవుతుంటారు. అందరిని విభిన్నమైన పెయింటింగ్‌ ఆకారాల్లో కూర్చోబెడుతుంటాడు హంతకుడు. ప్రారంభంలో చెప్పకుండా హత్య చేసిన హంతకుడు ఆ తర్వాత చెప్పి చేస్తుంటాడు. అయినా అతన్ని పట్టుకోలేకపోతారు పోలీసులు. ఈ క్రమంలో సిటీ కమిషనర్‌ ని కూడా చంపేస్తారు. దీంతో ఈ కేసుని మరింత సీరియస్‌గా తీసుకుంటారు. మరి ఇంతకి హంతకుడు ఎవరు? చంపేసి ఎందుకు పెయింటింగ్‌ రూపంలో బాడీని కూర్చోబెడుతున్నాడు? అతని మోటివ్‌ ఏంటి? పోలీసులు విచారణలో తెలిసి షాకింగ్‌ విషయాలేంటి? ఈ మిస్టరీ ఎలా వీడిందనేది మిగిలిన సినిమా.

34
ఎం4ఎం మూవీ ఎలా ఉందంటే
Image Credit : Asianet News

ఎం4ఎం మూవీ ఎలా ఉందంటే

క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలన్నీ ఒకేలా ఉంటాయి. వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దాన్ని పోలీసులు విచారిస్తుంటారు. ఒక కేసు విచారించే క్రమంలో మరిన్ని హత్యలు జరుగుతుంటాయి. దీంతో అది పోలీసులకు తలనొప్పిగా మారుతంది. వరుసగా సస్పెన్స్ అంశాలు, ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారంగా సాగుతుంది. ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. అయితే తీసుకున్న పాయింట్‌ ఇందులో కొత్తగా ఉంది. పెయింటింగ్‌ తరహాలో ఒక వ్యక్తి ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతనికి ఉన్న సమస్య ఏంటి? సైకలాజికల్‌గా ఎలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు ఇలాంటి హత్యలకు పాల్పడుతుంటారనేది ఇందులో చూపించారు. అదే ఈ సినిమా స్పెషాలిటి. దర్శకుడు మోహన్‌ వడ్లపట్ల ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది.  అదే సమయంలో హంతకులు ఎవరనే సస్పెన్స్ ఇందులో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే ఇప్పుడు సినిమాని ఆడియెన్స్ చూసే కోణం మారింది. వాళ్లు చాలా ఫాస్ట్ అయ్యారు. డిటెయిలింగ్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో దర్శకుడు వెనకబడినట్టు అనిపిస్తుంది. ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇస్తూ సినిమాని నడిపించిన తీరు బాగుంది. సెకండాఫ్‌లో వాటిని రివీల్‌ చేసి, ఫైనల్‌గా ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎలాంటి మనస్థత్వం ఉన్న వాళ్లు ఇలా తయారవుతారనేది చెప్పిన తీరు బాగుంది. ఆలోచింప చేసేలా ఉంటుంది. కాకపోతే సినిమా స్లోగా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్‌ కూడా అలానే ఉంటుంది. చాలా సన్నివేశాలు ఊహించేలా ఉంటాయి. ఎంత సేపు అక్కడక్కడే కథ తిరిగినట్టుగా ఉంటుంది. కాకపోతే హంతకుడు ఎవరనే విషయంలో ఆడియెన్స్ దృష్టిని డైవర్ట్ చేసి ఎంగేజ్‌ చేసే విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు.

44
ఎవరు ఎలా చేశారు? రేటింగ్‌
Image Credit : Asianet News

ఎవరు ఎలా చేశారు? రేటింగ్‌

నటీనటులు

లేడీ జర్నలిస్ట్ గా జో శర్మ అదరగొట్టింది. ఆమెనే సినిమాకి మెయిన్‌ లీడ్‌ అనేలా చేసింది. లుక్‌ పరంగానూ ఆకట్టుకుంది. ఏసీపీ కృష్ణగా సంబీత్‌ ఆచార్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో రంజిత్‌గా కృష్ణ తేజకి మంచి పాత్ర పడింది. కాకపోతే నిడివి లేదు. శుభలేఖ సుధాకర్‌ ఫర్వాలేదనిపించారు. ధాస్యం గీతా భాస్కర్‌ పాత్ర సర్‌ప్రైజ్‌ చేస్తుంది. మిగిలిన ఆర్టిస్టు లు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.

టెక్నీకల్‌గా చూస్తే.. సంతోష్‌ షణ్మోని అందించిన విజువల్స్ బాగున్నాయి. వసంత్‌ అందించిన మ్యూజిక్‌ బాగుంది. బీజీఎం కొత్తగా, ఆకట్టుకునేలా ఉంది.  ఎడిటింగ్‌ పరంగా ఇంకా స్పీడ్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. 

ఫైనల్‌గా:  ట్విస్ట్ లు, సస్పెన్స్ తో కొంత వరకు ఎంగేజ్‌ చేసే ఎం4ఎం.

రేటింగ్‌: 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani: ఇంటికి వచ్చిన స్టార్ హీరోయిన్ తో వంట చేయించిన నాని... కారణం ఏంటి? ఎవరా హీరోయిన్?
Recommended image2
Bhairava Dweepam Review: బాలకృష్ణ జీవితంలో చేసిన అతి పెద్ద సాహసం, భైరవద్వీపం సక్సెస్ కు కారణాలు ఇవే..
Recommended image3
Premane Oorilo Movie Review: ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. కన్నడలో హిట్‌, మరి ఇక్కడ ?
Related Stories
Recommended image1
Sathi leelavathi Movie Review: సతీ లీలావతి మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Razor Movie Review: రేజర్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. రవిబాబు అన్నీ తానై చేసిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved