MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...

Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...

Krishna Kurukshetram Review: ఎన్టీఆర్ కు వీరాభిమాని సూపర్ స్టార్ కృష్ణ, కానీ ఒక సందర్భంలో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వివాదాలు చెలరేగాయి. ఈక్రమంలో ఎన్టీఆర్ కు పోటీగా కృష్ణ కొన్ని సినిమాలు తెరకెక్కించారు. అందులో ఒకటి కురుక్షేత్రం. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 05 2026, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కురుక్షేత్రం రివ్యూ..
Image Credit : Asianet News

కురుక్షేత్రం రివ్యూ..

ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో పౌరాణిక సినిమాలకు ప్రత్యేక స్థానం ఉండేది. అలాంటి కాలంలోనే 1977 జనవరి 14న విడుదలైన కురుక్షేత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో కృష్ణ అర్జునుడిగా నటించగా, శోభన్‌బాబు శ్రీకృష్ణుడిగా, కృష్ణంరాజు కర్ణుడిగా కనిపించారు. భారీ తారాగణం, అద్భుతమైన సెట్లు, యుద్ధ సన్నివేశాలతో ఈ సినిమా అప్పట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కురుక్షేత్రం కథ విషయానికి వస్తే..
Image Credit : Asianet News

కురుక్షేత్రం కథ విషయానికి వస్తే..

మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. మహాభారత కథలోని సుభద్రాపరిణయం, రాజసూయం, మాయాజూదం, కౌరవపాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ధర్మాధర్మాల పోరాటాన్ని, శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వాన్ని, అర్జునుడి సందిగ్ధతను, కర్ణుడి విషాద జీవితాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. మహాభారతంలోని ప్రధాన ఘట్టాలను రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఈసినిమాలో భారీ తారాగణం కనిపించింది. అద్భుతమైన సెట్ వర్క్ తో పాటు.. భారీగా బడ్జెట్ ను కూడా కేటాయించారు సూపర్ స్టార్ కృష్ణ.

Related Articles

Related image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Related image2
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
37
సినిమా ఎలా ఉంది..? నటినటుల వివరాలు..
Image Credit : Asianet News

సినిమా ఎలా ఉంది..? నటినటుల వివరాలు..

పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో కమలాకర కామేశ్వరరావుకు ఉన్న అనుభవం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాలు, రాజభవనాల సెట్లు, వేషధారణలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందపడిందీ చిత్రం. కురక్షేత్ర సన్నివేశాల చిత్రీకరణ రాజస్ధాన్, అంబాలలో జరిగింది. ఎంతో ఖర్చు పెట్టి.. అంత మంది ఆర్టిస్టులను అక్కడికి తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఈసినిమా కోసం కృష్ణ చాలా కష్టపడ్డారు.

ఎవరు ఏ పాత్ర చేశారు? ఎలా నటించారు

ఇక పాత్రల విషయానికి వస్తే.. అర్జునుడి పాత్రలో కృష్ణ చక్కగా ఒదిగిపోయారు అద్భుతమైన నటన చూపించారు. కానీ మాస్ హీరోగా కృష్ణకు ఉన్న ఇమేజ్..ఈ మైథాలాజికల్ పాత్రకు పెద్దగా సెట్ అవ్వలేదని చెప్పవచ్చు. శోభన్‌బాబు శ్రీకృష్ణుడిగా ప్రశాంతమైన నటనతో ఆకట్టుకుంటారు. కర్ణుడి పాత్రలో కృష్ణంరాజు భావోద్వేగాలను బాగా పలికించారు. కైకాల సత్యనారాయణ, గుమ్మడి, జమున, విజయనిర్మల, అంజలీదేవి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

47
సాంకేతికంగా
Image Credit : Asianet News

సాంకేతికంగా

సాలూరి రాజేశ్వరరావు సంగీతం సినిమాకు బలం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా పౌరాణిక వాతావరణాన్ని తీసుకొచ్చింది. పి.ఎల్. రాయ్ ఛాయాగ్రహణం, భారీ సెట్లు, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ అప్పటి సాంకేతిక ప్రమాణాలకు చాలా గొప్పగా నిలిచాయి. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పౌరాణికాలు తీయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. కుటుంబ కథా చిత్రాలను అయితే ఇంకా అద్బుతంగా చెక్కుతారు కమలాకరుడు.

57
కురుక్షేత్రం సినిమా ప్రత్యేకతలు
Image Credit : Asianet News

కురుక్షేత్రం సినిమా ప్రత్యేకతలు

ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ సినిమాకు పోటీగా కృష్ణ ఈసినిమాను తెరకెక్కించారు.

మహాభారత యుద్ధాన్ని ప్రధానంగా చూపించిన అరుదైన తెలుగు పౌరాణిక చిత్రం.

ఒకే సినిమాలో కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి అగ్రనటులు కలిసి నటించడం.

భారీ సెట్లు, వందలాది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు చాలా స్పెషల్.

తెలుగులో పెద్దగా నడవకపోయినా.. హిందీలో డబ్ చేస్తే భారీ స్థాయిలో హిట్ కొట్టింది కురుక్షేత్రం సినిమా..

67
ఎన్టీఆర్ – కృష్ణ మధ్య వివాదానికి కారణం అయిన సినిమా?
Image Credit : Asianet News

ఎన్టీఆర్ – కృష్ణ మధ్య వివాదానికి కారణం అయిన సినిమా?

1977లో ఎన్టీఆర్ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి నటించిన దాన వీర శూర కర్ణ కూడా అదే సమయంలో విడుదలకు సిద్ధమైంది. మరోవైపు కృష్ణ కురుక్షేత్రం చిత్రాన్ని తీసుకువచ్చారు. రెండు సినిమాలు మహాభారత నేపథ్యంతో ఉండటంతో సహజంగానే భారీ పోటీ నెలకొంది. 

పలు ఇంటర్వ్యూలలో కృష్ణ, చలపతిరావు లాంటి నటులు చెప్పిన వివరాల ప్రకారం. ఎన్టీఆర్ కృష్ణను పిలిచి కురుక్షేత్రం సినిమా ఆపమనికొరారు. అప్పటికే దానవీర శూర కర్ణ సినిమా చాలా వరకు పని జరుగుతుంది. ఈసమయంలో రెండు సినిమాలు ఒకే కాన్సెప్ట్ తో చేయడం ఎందుకు బ్రదర్ అని కృష్ణతో అన్నారట ఎన్టీఆర్.

కానీ కృష్ణ మాత్రం సినిమా చేయాల్సిందే అని పట్టుపట్టారని సమాచారం. ఎన్టీఆర్ పౌరాణికాలలో దిట్ట.. ఆయనను ఎలాగానే ఈ విషయంలో ఓడించాలన్న పట్టుదలతో కృష్ణ ఈ సినిమా చేశారని ఇండస్ట్రీలో టాక్. ఈసినిమా రిలీజ్ విషయంలో కూడా వివాదం జరిగినట్టు సమాచారం. 

సినీ వర్గాల్లో అప్పట్లో ప్రచారమైన సమాచారం ప్రకారం, మొదట విడుదల తేదీల విషయంలో చర్చలు జరిగినా చివరికి రెండు సినిమాలు చాలా తక్కువ వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఏ సినిమా పెద్దది అనే చర్చలు జరిగాయి. ఈ పోటీ కారణంగా ఎన్టీఆర్, కృష్ణ అభిమానుల మధ్య కూడా గొడవలు చోటుచేసుకున్నాయి. అయితే ఇద్దరు హీరోలు బహిరంగంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోకపోయినా.. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న మాట మాత్రం నిజం.

77
ఎన్టీఆర్ – కృష్ణ పోటీలో గెలిచిందెవరు?
Image Credit : Asianet News

ఎన్టీఆర్ – కృష్ణ పోటీలో గెలిచిందెవరు?

ఈ పోటీలో దాన వీర శూర కర్ణ భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్ గా నిలవగా, కురుక్షేత్రం ఆశించిన స్థాయిలో తెలుగు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ, దాని సాంకేతిక విలువలు, భారీ నిర్మాణం, నటీనటుల ప్రదర్శనల కారణంగా ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈసినిమా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే భారీ విజయాన్ని అందుకుంది.

ఫైనల్‌గా

కురుక్షేత్రం కేవలం పౌరాణిక సినిమా మాత్రమే కాదు. భారీ తారాగణం, అద్భుతమైన నిర్మాణ విలువలు, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణతో పోటీలో వెనుకబడినా, తెలుగు పౌరాణిక చిత్రాల చరిత్రలో ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ ఉంటుంది. ఈమూవీని చూడాలనుకుంటే యూట్యూబ్ లో అందుబాటుల ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
కృష్ణ ఘట్టమనేని
నందమూరి బాలకృష్ణ
కృష్ణంరాజు
శోభన్ బాబు
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image2
Sahaa Movie Review: సహ మూవీ రివ్యూ.. హీరోయిన్‌ గుండు కొట్టించుకోవాలా? వద్దా?
Recommended image3
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Recommended image2
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved