MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Jana Nayagan Review: జన నాయకుడు మూవీ రివ్యూ.. విజయ్‌ చివరి మూవీ, అభిమానులకు పండగేనా?

Jana Nayagan Review: జన నాయకుడు మూవీ రివ్యూ.. విజయ్‌ చివరి మూవీ, అభిమానులకు పండగేనా?

Jana Nayakudu Review: దళపతి విజయ్‌ నటించిన చివరి మూవీ `జన నాయకుడు`. సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సిన ఈ మూవీ ఇప్పుడు రిలీజ్‌ అయ్యింది. మరి సినిమా ఎలా ఉంది? ఆకట్టుకుందా? లేదా?

5 Min read
Author : Aithagoni Raju
Published : Jul 23 2026, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
జన నాయకుడు మూవీ రివ్యూ
Image Credit : Asianet News

జన నాయకుడు మూవీ రివ్యూ

తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌ నటించిన చివరి మూవీ `జన నాయకుడు`(జన నాయగన్‌). ఆయన సీఎం కావడానికి ముందు ఈ మూవీలో నటించారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లారు. తమిళనాడుకు సీఎం అయ్యారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్‌ ఇబ్బందులతో ఆగిపోయింది.  ఎట్టకేలకు ఇప్పుడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ గురువారం(జులై 23)న విడుదలైంది. ఈ మూవీకి హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించగా, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు కీలక పాత్ర పోషించింది.  వీరితోపాటు బాబీ డియోల్‌, ప్రియమణి, ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇది తెలుగులో వచ్చిన బాలయ్య `భగవంత్‌ కేసరి` కి రీమేక్‌. మరి విజయ్‌ చివరి మూవీ ఎలా ఉంది? అభిమానులను ఆకట్టుకుందా? తెలుగు సినిమాకి మించి ఉందా? ఇందులో కాంట్రవర్సీ ఎలిమెంట్లు ఏంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జన నాయకుడు కథ
Image Credit : Asianet News

జన నాయకుడు కథ

దళపతి వెట్రి కొండన్‌(విజయ్‌) పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ అధికారి. విలన్లు అతన్ని ఓ కేసులో ఇరికించి జైల్లో పెడతారు. జైల్లో జైలర్‌(గౌతమ్‌ మీనన్‌)కి దళపతి దగ్గరవుతాడు. అయితే దళపతిని వాళ్ల అమ్మ చివరి చూపుకు తీసుకెళ్లినందుకు జైలర్‌ సస్పెండ్‌ అవుతాడు. ఆయన వెళ్తూ వెళ్తూ దళపతి విడుదలయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ జైలర్‌ వద్దకే వెళ్తాడు దళపతి. ఆయనకు విజ్జి(మమితా బైజు) కూతురు ఉంటుంది. జైలర్‌ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విజ్జి ఒంటరవుతుంది. ఆమె బాగోగులు దళపతి చూస్తాడు. ఆమెతోనే ఉంటాడు. వాళ్ల అమ్మ కోరిక మేరకు విజ్జిని ఆర్మీ ఆఫీసర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటాడు  మరోవైపు దేశంలో, తమిళనాడు రాష్ట్రంలో అల్లకల్లోలానికి అంతర్జాతీయ క్రిమినల్‌ జాన్‌ హెమ్లర్‌(బాబీ డియోల్‌) ప్లాన్‌ చేస్తాడు. అందుకు స్థానిక రాజకీయ నాయకుడు రోజా రంగస్వామి సపోర్ట్ చేస్తుంటాడు. రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. మత ఘర్షణలకు ప్లాన్‌ చేస్తారు. మరి దాన్ని దళపతి ఎలా అడ్డుకున్నాడు? తన జాబ్‌ పోవడానికి కారణం ఎవరు? డిప్యూటీ కమిషనర్‌ అయిన అమ్రిష్‌ పూజారి(బాబీ డియోల్‌) జాన్‌ హెమ్లర్‌లా ఎలా మారాడు? విజ్జి టాయ్‌ని చూసి ఎందుకు భయపడుతుంది? తన అమ్మ ఎలా చనిపోయింది? టాయ్స్ కి, గన్స్ స్మగ్లింగ్‌కి ఉన్న లింకేంటి? ఇందులో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి విజయ్‌ చూపించిన అంశాలేంటి? అనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Jana Nayagan Team Salary: 'జన నాయగన్' స్టార్ల రెమ్యూనరేషన్‌... విజయ్‌ కి హైయ్యెస్ట్, మిగిలిన వారికి ఎంతంటే?
Related image2
Chennai LoveStory Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ ఫస్ట్ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం హ్యాట్రిక్‌ కొట్టాడా?
37
జన నాయకుడు మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

జన నాయకుడు మూవీ విశ్లేషణ

ఇది తెలుగులో వచ్చిన `భగవంత్‌ కేసరి`కి రీమేక్‌ అని సినిమా చూశాక స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సినిమాని కమర్షియల్‌ యాంగిల్‌లో నడిపించారు. పొలిటీషన్లని కార్పొరేట్‌ ఎలా నడిపిస్తున్నారనేది జనరల్‌ కమర్షియల్‌ యాంగిల్‌లో చూపించారు. కానీ `జన నాయగన్‌`లో మాత్రం తమిళనాడు రాజకీయాలను అద్దం పట్టేలా తెరకెక్కించారు. రాజకీయ నాయకులు చేసే స్కామ్‌లు, అక్కడి డర్టీ పాలిటిక్స్ ని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. వారిపై విజయ్‌ విమర్శలు చేయడం, వారి ఆటకట్టడి చేసేలా కొన్ని సీన్లు పెట్టారు. బహుశా ఈ సినిమా సెన్సార్‌ కాకపోవడానికి అదే కారణమని అర్థమవుతుంది. అయితే సినిమా ఫస్టాఫ్‌ మొత్తం బాలయ్య సినిమానే తలపిస్తుంది. బాబీ డియోల్‌ పాత్ర బ్యాక్‌ డ్రాప్‌ మాత్రం కొత్తగా ఉంటుంది. అతన్ని అంతర్జాతీయ స్మగ్లర్‌గా చూపించారు. అదే ఇందులో కొత్తగా ఉంటుంది. విజయ్‌ పాత్ర, ఆయన జర్నీ మొత్తం తెలుగు మూవీని తలపిస్తుంది. ఫస్టాఫ్‌ మొత్తం మళ్లీ భగవంత్‌ కేసరినే చూసినట్టు ఉంటుంది. కాకపోతే విజయ్‌ మార్క్ తో సాగుతుంది. ఆయన స్టయిల్‌, ఎలివేషన్లతో రన్‌ అవుతుంది. జైల్లో ఫైట్‌, జైలర్‌ ఫ్యామిలీకి హీరో దగ్గరగా కావడం, ఆయన చనిపోవడం, చిన్నారి బాధ్యతలు  తీసుకోవడం, ఆమెని ఆర్మీకి ట్రైన్‌ చేయడం వంటివి సేమ్‌ ఉంటాయి. అందులో కాజల్‌, ఇందులో పూజా హెగ్డే ఉంటుంది. ఆమె జర్నలిస్ట్ గా కనిపిస్తుంది.  ఇందులో విలన్‌ బాబీ డియోల్‌ని ఓ పోలీస్‌ అధికారిగా చూపించి, అతనికి అవమానం జరగడంతో డిప్రెషనల్‌లోకి వెళ్లి, అనంతరం క్రిమినల్‌గా మారడం, అలా అంతర్జాతీయ క్రిమినల్‌గా ఎదగడం చూపించారు. హీరో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కూడా సేమ్‌ ఉంటుంది. కాకపోతే పొలిటికల్‌ అంశాలను మాత్రం తమిళనాడు రాజకీయాలకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో జైల్‌ సీన్‌ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లకు దగ్గరగా ఉండటం విశేషం. ప్రజలకు సేవ చేయాలని వచ్చిన స్కామ్‌లు చేస్తున్నారని, జనాలను దోచుకుంటున్నారనేది విజయ్‌ ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. తన మార్క్ మొత్తం సెకండాఫ్‌లో ఉంటుంది. ఇక క్లైమాక్స్ ని మాత్రం వేరే లెవల్‌లో చూపించారు. రోబోలు, డ్రోన్లతో ఫైట్‌ని పెట్టి బాగా హడావుడి చేశారు.

47
జన నాయకుడులో హైలైట్స్, మైనస్‌ లు
Image Credit : Asianet News

జన నాయకుడులో హైలైట్స్, మైనస్‌ లు

సినిమాగా చూసినప్పుడు చాలా వరకు మన తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కదు. ఆల్‌రెడీ భగవంత్‌ కేసరి చూడటంతో ఈ మూవీలోని సీన్లు తేలిపోయినట్టు ఉంటాయి. బాలయ్య స్థానంలో విజయ్‌ని ఊహించుకోలేకపోతాం. తెలుగు సినిమానే బెటర్‌ ఫీలింగ్‌ ఉంటుంది. ఫస్టాఫ్‌ అంతా సాగదీసినట్టుగా, అనిపిస్తుంది. కానీ విజయ్‌ అభిమానులకు మాత్రం ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు.ఆయన మార్క్ స్టయిల్‌, మ్యానరిజమ్స్ అన్నీ ఇందులో గట్టిగా పెట్టారు. ఎలివేషన్లు అదిరిపోయాయి. అవి అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. విజయ్‌ మార్క్ డైలాగ్‌ డెలివరీ కూడా ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మమితా బైజుతో వచ్చే ఎమోషనల్‌ సీన్లు బాగున్నాయి. వీరి మధ్య బాండింగ్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. చిన్నారి విషయంలో గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ కూడా బాగుంది. సెకండాఫ్‌ లో మాత్రం విజయ్‌ అభిమానులే, ఆయన టీవీకే పార్టీ అభిమానులు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ మూవీ మన కంటే తమిళనాడు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కమర్షియల్‌ యాంగిల్‌లో కొంత ఫన్‌, కొంత ఎమోషన్స్, లవ్‌ ట్రాక్‌, పాటలు, డాన్సులు పెట్టారు. క్లైమాక్స్ ఫైట్‌ని భారీగా తీశారు. కాకపోతే అంత అవసరం లేదనిపిస్తుంది. విలన్‌ బ్యాక్‌ డ్రాప్‌  ట్రాక్‌ కూడా ఓవర్‌గా అనిపిస్తుంది. సినిమాకి సెట్‌ కాలేదు. ఎండింగ్‌లో టైటిల్‌ కార్డ్స్ లో విజయ్‌ గత సినిమాలను గుర్తు చేస్తూ వేసిన వీడియో అభిమానులను ఎమోషనల్‌కి గుర్తు చేస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఇది విజయ్‌ అభిమానులకు ఒక సెలబ్రేషన్‌ ఫిల్మ్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

57
జన నాయకుడులో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

జన నాయకుడులో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

ఇందులో విజయ్‌ తన పార్టీ పేరు వచ్చేలా `దళపతి వెట్రి కొండన్‌(టీవీకే) అని పేరు పెట్టుకోవడం విశేషం. పోలీస్‌ అధికారిగా, ఒక అమ్మాయికి ఫాదర్‌గా విజయ్‌ బాగా చేశాడు. తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌తో దుమ్మురేపారు. పాటలు, డాన్సులతో అభిమానుల చేత డాన్సులు చేయించారు. అదే సమయంలో మాస్‌ డైలాగ్‌లు, పొలిటికల్‌ డైలాగ్‌లతో వారికి ఫుల్‌ మీల్స్ పెట్టారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఉన్నంతలో మెప్పించింది. కానీ తన పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. విజయ్‌ కూతురుగా మమితా బైజు కనిపిస్తుంది. తెలుగులో శ్రీలీల నటించింది. కాకపోతే శ్రీలీల ముందు మమితా తేలిపోయింది. జైలర్‌గా గౌతమ్‌ మీనన్‌ ఉన్న కాసేపు ఆకట్టుకున్నారు. విలన్‌ గా బాబీ డియోల్‌ ఇరగదీశాడు. ఆయనకు ఎలివేషన్లు అదిరిపోయాయి. ఓ దశలో హీరోకి మించిన ఎలివేషన్‌ ఉన్నట్టుగా ఉంటుంది. తనదైన విలనిజంతో మెప్పించాడు బాబీ డియోల్‌. రాజకీయ నాయకుడు రోజా రంగస్వామిగా ప్రకాష్‌ రాజ్‌ ఒదిగిపోయాడు. అంతే బాగా చేసి మెప్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రియమణి కనిపించింది. కనిపించిన కాసేపే అయినా ఆకట్టుకుంది. ఆమె పాత్రలోని ట్విస్ట్ ఓకే అనిపిస్తుంది. సునీల్‌ పాత్రలోని రెండు షేడ్స్ ఆకట్టుకుంటాయి. ఆయన కూడా మెప్పించారు. మిగిలిన పాత్రధారులు ఫర్వాలేదనిపించారని చెప్పొచ్చు.

67
టెక్నీకల్‌గా జన నాయకుడు ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

టెక్నీకల్‌గా జన నాయకుడు ఎలా ఉందంటే?

సినిమాకి అనిరుథ్‌ సంగీతం అందించారు. పాటలు ఆకట్టుకున్నాయి. బీజీఎం కూడా బాగుంది. అభిమానులకు ఏం కావాలో, తన మ్యూజిక్‌ ద్వారా ఇచ్చాడు అనిరుథ్‌. అయితే పాటలు తెలుగు పాటలను బీట్‌ చేయలేకపోయాయి. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సత్యన్‌ సూర్యన్‌ కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రదీప్‌ ఈ రాఘవ్‌ ఎడిటింగ్‌ కూడా నీట్‌గా ఉంది. పర్‌ఫెక్ట్ గా అన్ని అంశాలను జోడించారు. సినిమాని నీట్‌గా తీసుకెళ్లారు. కేవీన్‌ ప్రొడక్షన్‌ సినిమాని రాజీ లేకుండా నిర్మించారు. భారీగా ఖర్చు చేశారు. వారి ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అదే సమయలో నిర్మాత ప్యాషన్‌ కూడా కనిపిస్తుంది. విజయ్‌కి మంచి ట్రీట్‌లా ఉండేలా ఈ మూవీని ఆయన నిర్మించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ సినిమాకి పెద్ద అసెట్‌గా నిలుస్తాయి. దర్శకుడు హెచ్‌ వినోద్‌.. ఈ సినిమాని విజయ్‌కి ఎలా కావాలో అలా రూపొందించారు. ఆయనకు పర్‌ఫెక్ట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్‌ చేశారు. చాలా వరకు తెలుగు భగవంత్‌ కేసరినే ఫాలో అయినా, రాజకీయ అంశాల విషయంలో మాత్రం తమ మార్క్ కనిపిస్తుంది. అక్కడ తాను చేసిన మ్యాజిక్‌ కనిపిస్తుంది. ఆ విషయంలో వినోద్‌ సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. అదే సమయంలో ఒక ప్యాక్డ్ కమర్షియల్‌ సినిమాని విజయ్‌ అభిమానులకు అందించారని చెప్పొచ్చు.

77
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

ఇది విజయ్‌ రాజకీయ ఎంట్రీకి పర్‌ఫెక్ట్ గా సెట్‌ అయ్యేలా రూపొందించిన సినిమా. అదే సమయంలో అభిమానులకు మంచి ఫుల్‌మీల్స్ పెట్టే సినిమా అవుతుంది. వారికి ఒక ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చే సినిమా కూడా అవుతుంది. వారు దీన్ని సెలబ్రేట్‌ చేసుకుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ తెలుగు ఆడియెన్స్ కి మాత్రం అంతగా ఎక్కదు.

రేటింగ్‌ 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
టీవీకే విజయ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Operation Aruna Reddy Review: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ.. పోసాని ఎట్టకేలకు హిట్‌ కొట్టాడా?
Recommended image2
Oh Sukumari Review: ఓ సుకుమారి మూవీ రివ్యూ.. తిరువీర్‌, ఐశ్వర్యా రాజేష్‌ నవ్వించడంలో సక్సెస్ అయ్యారా
Recommended image3
Lenin Movie Review: లెనిన్‌ మూవీ రివ్యూ.. అఖిల్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Related Stories
Recommended image1
Jana Nayagan Team Salary: 'జన నాయగన్' స్టార్ల రెమ్యూనరేషన్‌... విజయ్‌ కి హైయ్యెస్ట్, మిగిలిన వారికి ఎంతంటే?
Recommended image2
Chennai LoveStory Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ ఫస్ట్ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం హ్యాట్రిక్‌ కొట్టాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved