MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Mohan Babu: ఎన్టీఆర్‌ తో సినిమా చేశాక మోహన్‌బాబు పని అయిపోయిందన్నారు.. తిరిగి టాప్‌లో నిలబెట్టిన మూవీ ఏంటో తెలుసా?

Mohan Babu: ఎన్టీఆర్‌ తో సినిమా చేశాక మోహన్‌బాబు పని అయిపోయిందన్నారు.. తిరిగి టాప్‌లో నిలబెట్టిన మూవీ ఏంటో తెలుసా?

ఎన్టీఆర్‌తో `మేజర్‌ చంద్రకాంత్‌`లో నటించారు మోహన్‌ బాబు.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఆడకపోవడంతో ఇక మోహన్‌ బాబు పని అయిపోయిందన్నారు. కానీ ఒక్క సినిమా అన్ని లెక్కలు మార్చేసింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 23 2026, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేజర్‌ చంద్రకాంత్‌తో హిట్‌ అందుకున్న మోహన్‌ బాబు
Image Credit : Asianet News

మేజర్‌ చంద్రకాంత్‌తో హిట్‌ అందుకున్న మోహన్‌ బాబు

ఎన్టీఆర్‌, మోహన్‌ బాబు కలిసి  సినిమాలు చేశారు. కానీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ `మేజర్‌ చంద్రకాంత్‌`. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్‌ పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఓ రకంగా ఆయనే హీరో అనేలా ఉంటుంది. మోహన్‌బాబు పాత్ర క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ లానే ఉంటుంది. సినిమా మాత్రం పెద్ద హిట్‌ అయ్యింది. అయితే ఈ మూవీ తర్వాత మోహన్‌ బాబు చాలా విమర్శలు ఫేస్‌ చేశారు. ఇందులో ఎన్టీఆరే హీరో అని అంతా అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మోహన్‌ బాబు పని అయిపోయిందన్నారు
Image Credit : aha

మోహన్‌ బాబు పని అయిపోయిందన్నారు

అంతేకాదు ఆ తర్వాత మోహన్‌ బాబు చేసిన సినిమాలు ఆడలేదు. ఆయన సోలో హీరోగా చేసిన సినిమాలు పరాజయం చెందాయి. వరుసగా మూడు నాలుగు సినిమాల విషయంలో అదే జరిగింది. `రౌడీ మొగుడు`, `అల్లరి పోలీస్‌`, `పుణ్యభూమి నాదేశం` పెద్దగా ఆడలేదు. `ఎం ధర్మరాజు ఎంఏ` కూడా యావరేజ్‌గానే ఆడింది. దీంతో అనేక విమర్శలు ఫేస్‌ చేశాడు కలెక్షన్ కింగ్‌. ఈ క్రమంలో తానేంటో చూపించారు మోహన్‌ బాబు. ఒక్క సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ఇక హీరోగా అయిపోయిందనుకున్న వారిచేతే టాప్‌ స్టార్‌గా పిలిపించుకున్నారు. మరి అంతగా మోహన్‌బాబుని టాప్‌ స్టార్‌గా నిలబెట్టిన మూవీ ఏంటనేది చూస్తే.. అదే `పెదరాయుడు`.

Related Articles

Related image1
Jana Nayagan Review: జన నాయకుడు మూవీ రివ్యూ.. విజయ్‌ చివరి మూవీ, అభిమానులకు పండగేనా?
Related image2
Chennai LoveStory Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ ఫస్ట్ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం హ్యాట్రిక్‌ కొట్టాడా?
34
మోహన్‌బాబు ని టాప్‌లో నిలబెట్టిన పెదరాయుడు
Image Credit : sun nxt

మోహన్‌బాబు ని టాప్‌లో నిలబెట్టిన పెదరాయుడు

`పెదరాయుడు` మూవీలో మోహన్‌ బాబు ద్విపాత్రాభినయం చేశారు. రజనీకాంత్‌ గెస్ట్ రోల్ చేశారు. దీన్ని రవిరాజా పినిశెట్టి రూపొందించారు. భానుప్రియ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం 1995 జూన్‌ 15న విడుదలైంది. టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఓ రకంగా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిందని చెప్పొచ్చు. ఈ సినిమా విజయంతో ఒక్కసారిగా టాప్‌లోకి వచ్చారు మోహన్‌ బాబు. టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరిగా నిలిచారు. ఈ సినిమా ప్రభావం చాలా ఏళ్లు ఉంది. ఆ తర్వాత మోహన్‌ బాబుకి ఎన్ని పరాజయాలు వచ్చినా, ఆయన ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు.

44
ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్న మోహన్‌బాబు
Image Credit : Asianet News

ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్న మోహన్‌బాబు

`పెదరాయుడు` తర్వాత `అదిరింది అల్లుడు`, `వీడెవడండి బాబు`, `అన్నమయ్య`, `రాయుడు`, `ఖైదీ గారు`, `శ్రీరాములయ్య`, `యమజాతకుడు`, `పోస్టమన్‌`, `రాయలసీమ రామన్న చౌదరి`, `తప్పు చేసి పప్పు కూడు` వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు ఆ స్థాయి విజయాలు రాలేదు. ఇప్పుడు కొంత గ్యాప్‌ తీసుకున్న మోహన్‌ బాబు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా, విలన్‌గా చేస్తున్నారు. `పారడైజ్‌`లో విలన్‌గా కనిపించబోతున్నారు. త్వరలో రిలీజ్‌ కాబోతున్న `శ్రీనివాస మంగాపురం`లోనూ నటించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Recommended image2
Tortoise First Look: అస్సలు గుర్తు పట్టలేని విధంగా రాజ్ తరుణ్, ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి
Recommended image3
Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
Related Stories
Recommended image1
Jana Nayagan Review: జన నాయకుడు మూవీ రివ్యూ.. విజయ్‌ చివరి మూవీ, అభిమానులకు పండగేనా?
Recommended image2
Chennai LoveStory Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ ఫస్ట్ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం హ్యాట్రిక్‌ కొట్టాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved