MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Carmeni Selvam Movie Review: కార్మేని సెల్వం మూవీ రివ్యూ, రేటింగ్‌.. సముద్రఖని చెప్పిన జీవిత పాఠం ఎలా ఉందంటే?

Carmeni Selvam Movie Review: కార్మేని సెల్వం మూవీ రివ్యూ, రేటింగ్‌.. సముద్రఖని చెప్పిన జీవిత పాఠం ఎలా ఉందంటే?

సముద్రఖని, గౌతమ్‌ మీనన్‌, అభినయ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `కార్మేని సెల్వం`. మధ్యతరగతి జీవితాన్ని ఆవిష్కరించే ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 03 2026, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్మేని సెల్వం మూవీ రివ్యూ
Image Credit : Asianet News

కార్మేని సెల్వం మూవీ రివ్యూ

సముద్రఖని ఓ వైపు పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ తో మెప్పిస్తూనే, మరోవైపు తనే మెయిన్‌ లీడ్‌గా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన `కార్మేని సెల్వం` అనే చిత్రంలో నటించారు. లక్ష్మీ ప్రియా ఆయనకు జోడీగా చేసింది. గౌతమ్‌ మీనన్‌, అభినయ కీలక పాత్రలు పోషించారు. పాత్‌ వే ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్‌ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి రామ్‌ చక్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగులో నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 3)న విడుదలైంది. మరి ఇందులో సముద్రఖని అప్పుల విషయంలో చెప్పిన జీవిత పాఠం ఏంటి? సినిమా ఎలా ఉందనేది చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కార్మేని సెల్వం మూవీ కథ ఇదే
Image Credit : Asianet News

కార్మేని సెల్వం మూవీ కథ ఇదే

సెల్వం(సముద్రఖని).. బిజినెస్‌ మ్యాన్‌ సంపత్‌ సార్‌(గౌతమ్‌ మీనన్‌) వద్ద కార్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య శాంతి(లక్ష్మీ ప్రియా) టిఫిన్‌ సెంటర్‌ నడిపిస్తుంటుంది. వీరికి కొడుకు బాలు ఉంటాడు.  చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఆశలతో బతుకుతుంది. సొంతంగా కారు కొనాలి, ఇళ్లు కట్టుకోవాలి, అందరిలో గొప్పగా ఉండాలి అని భార్య ఎంతో ఆశపడుతుంది. అందుకోసం రోజువారి సంపాదనలో కొంత దాచిపెడుతుంది. అయితే సంపత్‌, తన భార్య దేవి(అభినయ)తో కలిసి టూర్‌ వెళ్తారు. దీంతో ఆ కారుని టాక్సీగా మార్చి డబ్బులు సంపాదించాలని ప్లాన్‌ చేస్తాడు సెల్వం. క్యాబ్‌ నడిపిస్తాడు. ఈ క్రమంలో చాలా మంది కస్టమర్లు కలుస్తారు. రకారకాల డబ్బులు సంపాదించే ఐడియాలు చెబుతారు. అప్పులు చేసి, డబ్బులు సంపాదించాలని, క్రికెడ్‌ కార్డ్ వాడకం, ప్లాట్‌ కొనాలని, ఆన్‌లైన్‌ షాపింగ్‌, బెట్టింగ్‌ ఇలా రకరకాలుగా అలవాటు అవుతాయి, లగ్జరీగా లైఫ్‌ని లీడ్‌ చేసే క్రమంలో బాగా అప్పులు చేస్తాడు సెల్వం. ఇంట్లో భార్యకి టైమ్‌ ఇవ్వలేడు, దీంతో ఆమె గొడవ చేస్తుంది. అప్పులు చేయడం వల్ల చికాకులు ఎక్కువవుతాయి. అదే సమయంలో కారు యాక్సిడెంట్‌ అవుతుంది? ఆ తర్వాత సెల్వంలో వచ్చిన మార్పేంటి? ఆయన షార్జాకి ఎందుకు వెళ్లాడు? అక్కడ సెల్వం ఏం కోల్పోయాడు? ఆయన చేసిన తప్పేంటి? సంపత్‌ సార్‌ ఇచ్చిన సర్‌ ప్రైజ్‌ ఏంటి? సెల్వం జీవితం చెప్పిన సందేశం ఏంటనేది మిగిలిన సినిమా.

36
కార్మేని సెల్వం మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

కార్మేని సెల్వం మూవీ ఎలా ఉందంటే?

మిడిల్‌ క్లాస్‌ జీవితాన్ని ఆవిష్కరించిన మూవీ ఇది. పక్క వాళ్లు కార్లు, బంగ్లాలు, హడావుడి, హంగామాని చూసి మనం కూడా అలా అయిపోవాలని, అలా బతకాలని అప్పులు చేస్తాం. తీరా అవి తీర్చలేని భారంగా మారడంతో జీవితం రోడ్డు మీదకు వస్తుందని చెప్పే చిత్రమిది. బిజీ లైఫ్‌లో ఫ్యామిలీకి టైమ్‌ని కేటాయించాలని చెప్పే చిత్రమిది. మన స్థోమత మేరకు బతకాలని కళ్లకి కట్టినట్టు చూపించారు. ఆద్యంతం ఎమోషనల్‌ డ్రామా అని చెప్పొచ్చు. సినిమా స్లోగా ప్రారంభమైనా, డ్రామా ప్రధానంగా సాగుతుంది. ఆ తర్వాత ఎమోషనల్‌ సైడ్‌ తీసుకుంటుంది. గుండెని బరువెక్కిస్తుంది. మంచి సందేశాన్ని అందించి ఊరటనిస్తుంది. ఇక మూవీగా చూసినప్పుడు సముద్రఖని.. గౌతమ్‌ మీనన్‌ వద్ద డ్రైవర్‌గా చేయడం, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించారు. అలాగే సముద్రఖని ఫ్యామిలీ ద్వారా మిడిల్‌ క్లాస్‌ ఇన్నోసెంట్‌ మెంటాల్టీని ఆవిష్కరించారు. పరువు, మర్యాదల కోసం మధ్యతరగతి వాళ్లు ఏం చేస్తారనేది ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు. బంధువుల ఫంక్షన్లలో పట్టింపులు, అవమానాలను ఆవిష్కరించారు. మంచి జీవితం కోసం, కారు, ఇళ్లు కోసం దాచుకున్న డబ్బుని బంధువుల్లో మర్యాదల కోసం ఖర్చు చేయడం వంటివి మధ్యతరగతి కుటుంబాల పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. మొబైల్‌ వచ్చాక లగ్జరీ అలవాట్లు, బయట డబ్బుల కోసం చాలా మంది ఉచిత సలహాలు విని, వాటిని పాటించడం వల్ల ఎదురయ్యే నష్టాలను ఈ చిత్రంలో చూపించారు. అనవసరమైన వాటికోసం పాకులాడితే, అవసరమైనవి కోల్పోవాల్సి వస్తుందని చెప్పిన డైలాగ్‌ బాగుంది. సెకండాఫ్‌లో లైఫ్‌ని ప్రాక్టికల్‌గా చూపించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.  ఫ్యామిలీ మధ్య ఉండే బాండింగ్‌, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ఫోన్లు పూడ్చలేవని, దగ్గరుంటేనే ఆ అనుభూతిని పొందగలం అని, అందరు కలిసి ఉంటే చిన్న ఉద్యోగమైనా, తక్కువ సంపాదన ఉన్నా హ్యాపీగా లైఫ్‌ని లీడ్‌ చేయోచ్చనేది బాగుంది. సినిమా సెకండాఫ్‌ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. అయితే మూవీ స్లోగా సాగడం మైనస్‌గా చెప్పొచ్చు. ప్రతిదీ డీటెయిలింగ్‌గా చూపించే ప్రయత్నం కొంత సాగదీసినట్టుగా ఉంటుంది. ఇలాంటి కొన్ని సీన్లని కట్‌ చేస్తే మూవీ మంచి ఎమోషనల్‌ రైడ్‌లా ఉండేది. 

46
కార్మేని సెల్వంలో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

కార్మేని సెల్వంలో నటీనటులు ఎలా చేశారంటే?

కార్వేని సెల్వంలో సముద్రఖని నటన అదిరిపోయింది. ఆయన మిడిల్ క్లాస్ వ్యక్తి పాత్రలో జీవించాడు. క్యాబ్‌డ్రైవర్‌గా ఆయన జీవితం చాలా మంది రియల్‌ లైఫ్‌లను ఆవిష్కరిస్తుంది. అద్భుతమైన నటనతో, అంతే అద్భుతమైన ఎమోషన్స్ తో మెప్పించాడు. కట్టిపడేశాడు. భార్య కోరికల విషయంలో సాటిస్పై చేయలేక, డబ్బు సంపాదించలేక తను పడే సంఘర్షణ మెప్పిస్తుంది. ఇక ఆయన భార్య శాంతి పాత్రలో లక్ష్మీ ప్రియా ఒదిగిపోయింది. ఆమె పాత్ర హైలెట్గా నిలుస్తుంది. ఎక్కడా నటిస్తున్నట్టు లేదు, పాత్రలో జీవించింది. అలాగే సంపత్ సార్ పాత్రలో గౌతమ్ మేనన్ కాసేపు మెరిశారు. ఆయన పాత్ర సర్‌ప్రైజ్‌లా ఉంటుంది. ఆయన భార్యగా అభినయ ఉన్నంతసేపు మెప్పించింది. సముద్రఖని కొడుకుగా చేసిన కుర్రాడు చాలా బాగా నటించి మెప్పించాడు.

56
కార్మేని సెల్వం టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

కార్మేని సెల్వం టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. కథలో భాగంగా పాటలు ఉంటాయి. కథని ముందుకు నడిపించేలా ఉంటాయి. అలాగే బీజీఎం ఎమోషనల్ సీన్లని బాగా ఎలివేట్ చేసింది. విజువల్ పరంగాను ఆకట్టుకునే లాగా ఉంది. ఎడిటింగ్‌ పరమైన కొన్ని లోపాలు ఉన్నాయి. ఇంకా కొంచెం ట్రిమ్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. మధ్యతరగతి జీవితాన్ని చాలా బాగా ఆవిష్కరించారు. అయితే దాన్ని మరింత ఎంగేజింగ్‌గా, షార్ప్ గా చెబితే బాగుండేది. మిడిల్‌ క్లాస్‌ ఆడియెన్స్ కి బాగా నచ్చే మూవీ అవుతుంది.

66
ఫైనల్‌ నోట్‌
Image Credit : Asianet News

ఫైనల్‌ నోట్‌

మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌ని ఆవిష్కరించే ఎమోషనల్‌ రైడ్‌ `కార్మేని సెల్వం`. మధ్యతరగతి వాళ్లు తప్పక చూడాల్సిన మూవీ.

రేటింగ్‌ 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image2
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image3
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Biker Movie Review: బైకర్‌ మూవీ రివ్యూ, రేటింగ్.. రాజశేఖర్‌, శర్వానంద్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Raakaasa Movie Review: రాకాస మూవీ రివ్యూ, రేటింగ్‌.. నిహారిక, సంగీత్‌ శోభన్‌ ల మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved