MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Biker Movie Review: బైకర్‌ మూవీ రివ్యూ, రేటింగ్.. రాజశేఖర్‌, శర్వానంద్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?

Biker Movie Review: బైకర్‌ మూవీ రివ్యూ, రేటింగ్.. రాజశేఖర్‌, శర్వానంద్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?

రాజశేఖర్‌ క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుని ఇప్పుడు `బైకర్‌` చిత్రంలో నటించారు. శర్వానంద్‌ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 3)న విడుదలయ్యింది. సినిమా ఎలా ఉందంటే? 

4 Min read
Author : Aithagoni Raju
Published : Apr 03 2026, 07:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బైకర్‌ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

బైకర్‌ మూవీ రివ్యూ

శర్వానంద్‌ వరుస పరాజయాల అనంతరం ఇప్పుడిప్పుడు గాడిన పడుతున్నాడు. ఆయన ఈ సంక్రాంతికి `నారీ నారీ నడుమ మురారి` చిత్రంతో హిట్‌ కొట్టాడు. ఇప్పుడు `బైకర్‌` మూవీతో వచ్చారు. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో యాంగ్రీమ్యాన్‌ రాజశేఖర్‌ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఆయన హీరో నుంచి క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుని చేస్తోన్న రెండో చిత్రమిది. గతంలో `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొంత గ్యాప్‌తో `బైకర్‌`లో నటించారు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీక్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 3)న విడుదలైంది.   శర్వానంద్‌ కి మరో హిట్‌ పడిందా? రాజశేఖర్‌ కమ్‌ బ్యాక్‌ అయ్యే సినిమా అయ్యిందా? ఇంతకి మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బైకర్‌ మూవీ కథ
Image Credit : Asianet News

బైకర్‌ మూవీ కథ

విక్రమ్‌ నారాయణ్‌ (శర్వానంద్‌) ఇండియాలోనే అరుదైన బైక్‌ రైడర్‌. అతనిలోని టాలెంట్‌ని చూసి తండ్రి సునీల్‌ నారాయణ్‌(రాజశేఖర్‌) రేసర్‌గా ఎంకరేజ్‌ చేస్తాడు. ఆయన మాజీ ఇండియా బైక్‌ రైడర్‌. ఒకప్పుడు తోపు ఆటగాడు. ఇండియాకి బైక్‌ రేసింగ్‌లో గుర్తింపు తెచ్చిన ఒకే ఒక్క ఆటగాడు. దీంతో తన కొడుకు విక్కీని ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలనుకుంటాడు. బెస్ట్ రేసర్ గా తీర్చిదిద్దుతాడు. ఇండియాలో బైక్‌ రేసింగ్‌ పోటీలో విక్కీ విన్నర్‌గా నిలుస్తాడు. అయితే ఆ తర్వాత జరిగే పోటీ నుంచి సడెన్‌గా తప్పుకుంటాడు. విక్కీ కోసం సునీల్‌ స్పాన్సర్లని కూడా సెట్‌ చేస్తాడు. ఇక కెరీర్‌లో తిరుగులేదనే సమయంలో పెద్ది ట్విస్ట్. ఆయన అనన్య(మాళవిక నాయర్‌)ని ప్రేమిస్తాడు. కీలక పోటీల నుంచి ఆయన తప్పుకుంటాడు. తన ప్రియురాలికే ప్రయారిటీ ఇస్తాడు. మరి విక్కీ సడెన్‌గా ఎందుకు ఈ పోటీ నుంచి తప్పుకుంటాడు. తండ్రికి, విక్కీకి మధ్య జరిగిన గొడవేంటి? అనన్యతో లవ్‌ ట్రాక్‌ ఎలా స్టార్ట్ అయ్యింది. దూరమైన తండ్రీకొడుకులు మళ్లీ కలిశారా? గొప్ప బైక్ రేసింగ్‌ కోచింగ్‌గా ఉన్న సునీల్‌ నారాయణ్‌ చేసిన ఫ్రాడ్‌ ఏంటి? అనేది మిగిలిన కథ.

37
బైకర్‌ మూవీ విశ్లేషణ
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీ విశ్లేషణ

స్పోర్ట్ నేపథ్యంలో మన వద్ద అడపాదడపా సినిమాలు వస్తున్నాయి. క్రికెట్‌, బాక్సింగ్‌, కబడ్డీ, రన్నింగ్‌ వంటి ఆటలతో కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు మెప్పించాయి. కానీ మొదటిసారి బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో శర్వానంద్‌ `బైకర్‌` మూవీ చేశాడు. అయితే ఆట ఏదైనా అందులో డ్రామా, ఎమోషన్స్, స్ట్రగుల్స్ చాలా ముఖ్యం. అవి కనెక్ట్ అయితే సినిమా అందరికి నచ్చుతుంది. లేదంటే పరాజయం తప్పదు. అయితే `బైకర్‌` సినిమాని కూడా ఆడియెన్స్ కి కనెక్ట్ చేయడంలో చాలా వరకు సక్సెస్‌ అయ్యారు మేకర్స్. ఇది రేసింగ్‌ నేపథ్యంలో సాగే ఎమోషనల్‌ డ్రామా. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అలానే సాగుతుంది. సినిమాగా చూసిప్పుడు బైక్‌ రేసింగ్‌ కోచ్‌గా, దేశంలోనే గొప్ప స్థానంలో ఉన్న రాజశేఖర్‌ని కుట్ర చేసి పదవి నుంచి తొలగిస్తారు. డబ్బు తీసుకొని తన కొడుకు పారిపోయాడనే నింద ఆయనపై పడుతుంది. కట్‌ చేస్తే, రేసింగ్‌ తో సంబంధం లేకుండా రాజశేఖర్ కొడుకు అయిన శర్వానంద్‌ ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటాడు. భార్య మాళవికతో రొమాన్స్, కొడుకుతో సరదాగా సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటాడు. అదే సమయంలో కొడుకుని గుర్తు చేసుకుంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాడు. అప్పట్లో తాను బైక్‌ రేసర్‌గా చేసిన సాహసాలు, తండ్రి సమక్షంలో తాను రేసింగ్‌ నేర్చుకున్న తీరుని, పడ్డ స్ట్రగుల్స్ ని నెమరేసుకుంటారు. దీంతో సినిమా సీరియస్‌ టోన్‌లోకి మారిపోతుంది. తాను ఎలా బైక్‌ రేసర్‌గా రాణించాడు, ఎలా సక్సెస్‌ అయ్యాడు, తన కోసం నాన్న ఎలాంటి పోరాటం చేశాడు? తనని విన్నర్‌గా నిలిపేందుకు ఆయన ఏం చేశాడనేది చూపించారు. దీంతో ఆయా సన్నివేశాలు రేసింగ్‌లాగానే రేసిగా వెళ్తాయి. అదే సమయంలో ఎమోషనల్‌గానూ ఉంటాయి. రేసింగ్‌ పోటీ ఉత్కంఠకి గురి చేస్తుంది. తోటి రేసర్‌తో సవాల్‌, పోటీలో పాల్గొనడం వంటివి ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో లవ్‌, రొమాన్స్ కూడా అలరించేలా ఉంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ ని పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో తండ్రికి జరిగిన అవమానం శర్వానంద్‌కి తెలియడం, దీంతో ఆయన మళ్లీ రేసింగ్‌ పోటీలో పాల్గొంటానని చెప్పడం, ఆ తర్వాత తండ్రిని కలవడం వంటి సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. సెకండాఫ్‌లో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్‌ బాండింగ్‌ని, పైకి సీరియస్‌గా ఉన్నా, కొడుకు విషయంలో తండ్రికి ఉన్న ప్రేమ, కొడుకుని ఛాంపియన్‌గా నిలబట్టడం కోసం  త్యాగం చేయడం వంటివి చూపించారు. క్లైమాక్స్ ఎమోషనల్‌గా గుండెని బరువెక్కించి ముగుస్తుంది.

47
బైకర్‌ మూవీలో ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీలో ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్

 విక్కీగా శర్వానంద్‌ నటన ఆకట్టుకుంటుంది. ఆయన పాత్రలో ఒదిగిపోయాడు. ఒక కొత్త శర్వానంద్‌ కనిపిస్తాడు. నటన పరంగానే, డాన్సుల పరంగా ఆదరగొట్టాడు. రేసింగ్‌ సీన్లలో, ఎమోషనల్‌ సీన్లలో అదరగొట్టాడు. ఇక సునీల్‌ నారాయణ్‌ పాత్రలో రాజశేఖర్‌ యాప్ట్ అనిపించాడు. సీరియస్‌ రోల్‌లో, స్టయిలీష్‌ లుక్‌లో అదరగొట్టాడు. ఇందులో రాజశేఖర్‌కి ఒక క్యారెక్టర్‌ అని అనిపించదు, ఆయన కూడా ఓ హీరో అనిపిస్తుంది. అనన్యగా, శర్వా లవర్‌గా, భార్యగా మాళవిక నాయర్‌ మెప్పించింది. ఆమె పాత్రకి మంచి ప్రయారిటీ దక్కింది. తనుకూడా అంతే బాగా చేసింది. తులసి నటన మెప్పిస్తుంది. శర్వానంద్‌ కొడుకుగా చేసిన కుర్రాడు హైలైట్‌ అయ్యాడు. బ్రహ్మాజీ ఇందులో కాస్త సీరియస్‌ రోల్‌లో కనిపించి అలరించారు. ఇక మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

57
బైకర్‌ మూవీలో టెక్నీషియన్ల పనితీరు
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీలో టెక్నీషియన్ల పనితీరు

జిబ్రాన్‌ మ్యూజిక్‌ సినిమాకి ప్లస్‌ అయ్యింది. బిజీఎం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఫస్టాఫ్‌లో వచ్చే మొదటి సాంగ్‌ కొత్తగా ఉంది. సందర్భానుసారంగా కథలో భాగంగా వచ్చే పాటలు ఓకే అనిపించాయి. జే యువరాజ్‌ కెమెరా బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, కనువిందు చేసేలా ఉన్నాయి. లాంగ్‌ షాట్స్ వాహ్‌ అనిపించాయి. ఎడిటింగ్‌ పరంగా ఇంకా బాగా చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. బాగా రిచ్‌గా తీశారు. దర్శకుడు అభిలాష్‌ రెడ్డి ఎంచుకున్న కథ బాగుంది. కానీ బైక్‌ రేసింగ్‌ అనేది మన తెలుగులో కొత్త పాయింట్‌. కానీ దాని ట్రీట్‌మెంట్‌ కొంత ఓల్డ్ ఫార్ములా లాగానే అనిపించింది. రేసింగ్‌ని ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించాడు. కానీ ఎమోషన్స్ పరంగా ఇంకా బాగా చేయాల్సింది. చాలా వరకు మూవీ చప్పగా సాగుతుంది, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు స్ట్రగుల్స్, డ్రామా వంటి వాటిపై ఇంకా బాగా వర్క్ చేయాల్సింది.

67
బైకర్‌లో ప్లస్‌లు, మైనస్‌లు
Image Credit : X/@UV_Creations

బైకర్‌లో ప్లస్‌లు, మైనస్‌లు

సినిమాలో శర్వానంద్‌, తన కొడుకుతో వచ్చే సన్నివేశాలు, సరదాగా నవ్వించేలా ఉంటాయి. తన భార్యతో రొమాన్స్ బాగానే ఉంది. రేసింగ్‌ ఎపిసోడ్‌ ఉత్కంఠకి గురి చేస్తుంది.  క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. అలాగే జిబ్రాన్  బిజిఎం బాగుంది. విజువల్స్ బాగున్నాయి. నటీనటులు బాగా చేశారు. మెయిన్‌ కాస్టింగ్‌ సినిమాకి ప్లస్‌ అయ్యారని చెప్పొచ్చు.

మైనస్‌లు సినిమా చాలా వరకు డ్రైగా సాగింది. ఏమాత్రం హై మూమెంట్స్ లేవు. డ్రామా అంతగా పండలేదు. ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు.  తండ్రీకొడుకుల బాండింగ్‌కి సంబంధించిన ఎమోషన్స్ ఎలివేట్‌ కాలేదు. క్లైమాక్స్ లో తప్ప మరెక్కడా అది కనిపించలేదు. స్పోర్ట్స్ డ్రామాలో ఉండాల్సిన డ్రామా ఇందులో అంతగా లేదు. దీంతో ఓల్డ్ సినిమాలను తలపించింది. ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఇవ్వలేకపోయింది. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ తప్ప మరేదీ కొత్తగా లేదనే ఫీలింగ్‌ తెప్పించింది. సినిమా స్లోగా సాగడం మరో మైనస్‌గా చెప్పొచ్చు.

77
ఫైనల్‌ నోట్‌
Image Credit : Asianet News

ఫైనల్‌ నోట్‌

రేస్‌ తక్కువ, సాగదీత ఎక్కువ.. ఎమోషనల్‌గానూ, డ్రామా పరంగానూ మెప్పించలేకపోయిన `బైకర్‌`.

రేటింగ్‌: 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image2
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image3
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
డిప్రెషన్ లో ఉన్న హీరోని.. పిలిచి మరీ క్లాస్ పీకిన చిరంజీవి, మెగాస్టార్ దెబ్బకు మళ్లీ సెట్ అయిన హీరో ఎవరు?
Recommended image2
Allu Arjun: ఆ హీరోయిన్‌ పెళ్లి చేసుకుంటే అల్లు అర్జున్‌ హార్ట్ బ్రేక్‌.. బన్నీ ఆరాధించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved