MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. భూమిక, గుణశేఖర్‌ మూవీని వీళ్లు తప్పక చూడాలి

Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. భూమిక, గుణశేఖర్‌ మూవీని వీళ్లు తప్పక చూడాలి

Euphoria Review: భూమిక ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ రూపొందించిన చిత్రం `యుఫోరియా`. నేటి ట్రెండ్‌ని, యువత పోకడలను ఆవిష్కరించిన ఈ మూవీ ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో చూద్దాం. 

5 Min read
Author : Aithagoni Raju
Published : Feb 06 2026, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
యుఫోరియా మూవీ రివ్యూ
Image Credit : X/@GunaaTeamworks

యుఫోరియా మూవీ రివ్యూ

దర్శకుడు గుణశేఖర్‌ తెలుగులో విజువల్ వండర్స్ కి, లావిష్‌ ఫిల్మ్స్ కి పెట్టింది పేరు. `ఒక్కడు`తో ఆయన సృష్టించిన సంచలనం అలాంటిది. `చూడాలని వుంది`, `అర్జున్‌`, `రుద్రమదేవి`వంటి చిత్రాలతో తానేంటో చూపించారు. ఇటీవల ఆయనకు సక్సెస్‌ లు లేవు. `శాకుంతలం`తో చేసిన ప్రయత్నం తేడా కొట్టింది. ఇప్పుడు మరోసారి తానేంటో నిరూపించుకునేందుకు `యుఫోరియా` మూవీతో వచ్చారు. నేటి యువతరం, స్టూడెంట్స్ ఎలా పెడదారి పడతున్నారనే కాన్సెప్ట్ తో జెంజీ జనరేషన్‌ చేస్తున్న లోపాలను ఎత్తిచూపుతూ నిజ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో భూమిక, గౌతమ్‌ మీనన్‌, సారా అర్జున్‌, రోహిత్‌, విఘ్నేశ్ గవిరెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. స్టూడెంట్స్ గా అంతా కొత్తవాళ్లే నటించారు. రాగిణి గుణ సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ, యుక్తా గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 6న)న విడుదలైంది. సినిమాని విమల్‌ థియేటర్లో స్పెషల్‌ ప్రీమియర్‌ వీక్షించాము. మరి సినిమా ఎలా ఉంది? ఈ నేటితరాన్ని ఆకట్టుకుంటుందా? పేరెంట్స్ ఈ మూవీని ఎందుకు చూడాలి అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
యుఫోరియా మూవీ కథ ఇదే
Image Credit : X/@GunaaTeamworks

యుఫోరియా మూవీ కథ ఇదే

వికాస్‌(విఘ్నేష్‌ గవిరెడ్డి) వికాస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో స్టూడెంట్‌. చైత్ర(సారా అర్జున్‌) మరో స్కూల్‌ స్టూడెంట్‌. ఓ రోజు ఫ్రెండ్‌ పిలవడంతో చైత్ర పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీకి వికాస్‌తోపాటు నలుగురు ఫ్రెండ్స్ కూడా వస్తారు. చైత్రని చూసి వికాస్‌ ఫిదా అవుతాడు. ఆమెని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు. పార్టీ అయిపోయాక చైత్రని కన్విన్స్ చేసి ఫ్రెండ్‌ బర్త్ డే పార్టీకి తీసుకెళ్తాడు. కారులో వెళ్తూ ఆమెకి కేక్ తో మత్తు ఇస్తారు. ఆ తర్వాత కారులోనే ఐదుగురు కుర్రాళ్లు అఘాయిత్యానికి పాల్పడతారు. ఇంటికొచ్చాక అమ్మతో జరిగింది చెబుతుంది చైత్ర. దీంతో ఆ కుర్రాళ్లపై కేసు పెడతారు. పోలీస్‌ కమిషనర్‌ జయదేవ్‌(గౌతమ్‌ మీనన్‌) పిల్లలు మైనర్లు కావడంతో వారి పేర్లు కాకుండా వారి పేరెంట్స్ పేర్లు వెల్లడిస్తారు. వారంతా పొలిటికల్‌ లీడర్స్, బాగా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న నాయకులు. అందులో వికాస్‌ పేరేంట్స్ వింధ్యా(భూమిక), వివేక్‌ చక్రవర్తి(రోహిత్) పేరు కూడా బయటకు వస్తాయి. వింధ్యా వేములపల్లి వికాస్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌, వివేక్‌ రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌. వికాస్‌ పేరెంట్స్. తన కొడుకు ఇలాంటి పనిచేశాడని తెలిసి ఆమె ప్రిన్సిపల్‌గా రాజీనామా చేస్తుంది. తన కొడుకు తప్పు చేశాడని ఏకంగా ఆధారాలు కూడా పోలీసులకు ఇస్తుంది. దీంతో ఈ ఐదుగురు కుర్రాళ్లకి 20ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. జైల్లో వికాస్‌ ఏం చేశాడు? సిటీలో మాద్రక ద్రవ్యాల రవాణాకి, జైల్‌కి ఉన్న సంబంధం ఏంటి? వికాస్‌ తల్లి ఎందుకు తాగుడికి బానిస అయ్యింది? ఆమె తనని శిక్షించాలని ఎందుకు కోర్ట్ కి ఎక్కింది? చివరికి దర్శకుడు గుణ శేఖర్‌ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? అనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Ram Charan: తొలి దెబ్బ చాలా గట్టిగా తగిలింది.. రాంచరణ్ పర్సనల్ లైఫ్ పై అబద్దాలు, చిరంజీవి ఏం చేశారంటే
Related image2
Nandamuri Heroes Net Worth: నందమూరి హీరోలకు మతిపోయే ఆస్తులు.. ఎన్టీఆర్‌ కి బాలయ్య ఝలక్‌
37
యుఫోరియా మూవీ ఎలా ఉందంటే(విశ్లేషణ)
Image Credit : X/@GunaaTeamworks

యుఫోరియా మూవీ ఎలా ఉందంటే(విశ్లేషణ)

నేటితరం యువత, ముఖ్యంగా స్టూడెంట్స్ ఎలా పెడదారి పడుతున్నారనేది ఈ మూవీలో చూపించారు దర్శకుడు. బిజీ లైఫ్‌లో పిల్లల్ని పేరెంట్స్ పట్టించుకోవడం లేదు. వారికి టైమ్‌ ఇవ్వడం లేదు. వాళ్లు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు. దీంతో వారికి చెప్పేవారు లేక ఫ్రెండ్స్ తో కలిసి ఎలా పెడదారి పడుతున్నారు? వాళ్లు చేష్టలు సమాజానికి ఎంతటి నష్టాన్ని చేకూరుస్తున్నాయి? మ ద్యం మత్తులో ఎలాంటి ఆఘడాలకు పాల్పడుతున్నారు, అమాయక పిల్లలు ఎలా బలవుతున్నారనేది ఇందులో చూపించారు దర్శకుడు. నేటి ట్రెండ్‌ని,  యువతరం పోకడలను, సిటీ కల్చర్‌ని ఆవిష్కరించారు. ఇంట్లో పట్టించుకునేవారు లేక మ ద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసగా మారి అనేక చెడు అలవాట్లకి బానిస అవుతున్నారనేది, ఇందులో పిల్లదే కాదు, వారిని పట్టించుకోని పెద్దలది కూడా తప్పే అని చెప్పిన సందేశం బాగుంది. ఇక సినిమాగా చూసినప్పుడు ప్రారంభంలో స్కూల్‌ స్టూడెంట్స్ కలిసి పార్టీకి వెళ్లడం, అక్కడ అమ్మాయిని చూసి ఇంప్రెస్‌ అయి ఆమెని మాయమాటలతో పడేసి అఘాయిత్యానికి పాల్పడటంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలు పార్టీలకు వెళ్లొద్దా, సమాజంలో కలవొద్దా? వేగంగా పరుగులు పెడుతున్న సమాజాన్ని అందుకోవద్దా అని చైత్ర చెప్పే మాటలు ఆలోచింప చేస్తాయి. అదే సమయంలో తాను బాధితురాలిని అయినా, పరువు అనేది అడ్డు వచ్చినా తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే అమ్మాయి ధైర్యాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. అంతేకాదు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వాళ్లు ధైర్యంగా రాజకీయ నాయకులను ఎదురించిన తీరు ఆకట్టుకుంది. ఈ కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్‌ చేయడం, కోర్ట్ లో శిక్ష వేసే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. సెకండాఫ్‌ జైలుకి షిఫ్ట్ అవుతుంది. జైలు నుంచి అనేక సంఘవిద్రోహ కార్యకలాపాలు జరుగుతాయని చూపించిన తీరు బాగుంది. దీని వెనక యదార్థ నిజాలను బయటపెట్టడం అదిరిపోయింది. అత్యాచారం చేసి వచ్చిన వాళ్లని జైల్లో ఎలా ట్రీట్‌ చేస్తారు? వంటివి కళ్లకు కట్టినట్టు చూపించారు. సెకండాఫ్‌ అంతా కొడుకుని బాాగు చేయడం కోసం తల్లి పడే బాధ, ఆమె తాగుడికి బానిస కావడం వంటివి ఎంగేజ్‌ చేస్తాయి. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది.

47
యుఫోరియా మూవీలో ప్లస్‌ లు, మైనస్ లు
Image Credit : X/@GunaaTeamworks

యుఫోరియా మూవీలో ప్లస్‌ లు, మైనస్ లు

సినిమాలో సమాజంలోని యదార్థ సంఘటనలు అంతే యదార్థంగా ఆవిష్కరించిన తీరు బాగుంది. నేటి తరం ట్రెండ్‌ని, అఘాయిత్యాన్ని ఆవిష్కరించడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ వంటివి ఎంగేజింగ్‌గా సాగాయి. పిల్లల విషయంలో పేరెంట్స్ పడే బాధని చూపించిన తీరు ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. అలాగే ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌, జైల్లో జరిగే కార్యకలాపాలు, క్లైమాక్స్ సినిమాకి ప్రధాన బలంగా చెప్పొచ్చు. క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం గుండెని బరువెక్కిస్తుంది. సినిమా ద్వారా దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశం బాగుంది. ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన అంశాలను ఇందులో చూపించారు. కానీ సినిమాగా చూసినప్పుడు దాన్ని ఎంగేజ్‌ చేసేలా, ఆద్యంతం రసవత్తరంగా సాగేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యారు. ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్‌ కాలేకపోయారు. అసలు గుణశేఖర్‌ తీసిన సినిమానేనా అనేలా ఉంది. రైటింగ్‌ పరంగా చాలా వీక్‌ ఉంది. డైలాగ్‌లు మరీ సాధారణంగా ఉన్నాయి. ఆయన మార్క్ ఎక్కడా కనిపించలేదు. కొన్ని సన్నివేశాలు చాలా సిల్లీగా ఉన్నాయి. ముఖ్యంగా సీన్‌ రీ క్రియేషన్‌ మాత్రం షాకిచ్చేలా ఉంటుంది. అదే సమయంలో సినిమా ప్రారంభంలో పేరెంట్స్ లో పిల్లల్లో ఒక పెయిన్‌ ఉంటుంది. అది ఎమోషనల్‌గా ఉంటుంది. కానీ ఆ పెయిన్‌తో కూడిన ఎమోషన్స్ సినిమా మొత్తం రన్‌ కాలేదు. దాన్ని బలంగా చూపించలేకపోయారు. దీంతో చాలా సీన్లు తేలిపోయాయి. అదే సమయంలోసీన్‌ సీన్ కి సంబంధం లేకుండా కట్‌, పేస్ట్ లా ఉన్నాయి. సీన్లుగా సన్నివేశాలను చూపించారు తప్పితే, ఒక కథగా సాగిన తీరుని ఎంగేజింగ్‌గా ఆవిష్కరించడంలో గుణశేఖర్‌ సక్సెస్‌ కాలేకపోయాయి. పోలీసుల హడావుడి ప్రారంభంలో బాగున్నా, ఆ తర్వాత హడావుడిగానే మిగిలిపోయింది. భూమిక పాత్రని చూపించిన తీరు కూడా బాగా లేదు. ఆమె ఎంట్రీ అదిరిపోయింది. కానీ కోర్ట్ సీన్‌ మాత్రం తేలిపోయింది. హీరోయిన్‌ పాత్రని ఎక్కువ చూపించలేదు. ఆమె ఎలా కోలుకుంది? ఎలా నిలబడిందనేది చూపించలేదు. కాకపోతే క్లైమాక్స్ ఒక్కటి కాస్త ఎమోషనల్‌గా ఉంది. ఎమోషన్స్, పెయిన్‌ వర్కౌట్‌ అయ్యిందంటే అదొక క్లైమాక్స్ లోనే.

57
యుఫోరియా మూవీలో నటీనటులు ఎలా నటించారంటే?
Image Credit : X/@GunaaTeamworks

యుఫోరియా మూవీలో నటీనటులు ఎలా నటించారంటే?

చైత్ర పాత్రలో సారా అర్జున్‌ చాలా బాగా నటించింది. అదరగొట్టింది. ఫ్రెష్‌ లుక్‌ సినిమాకి ప్లస్‌ అయ్యింది. ఆమె పాత్ర అమ్మాయికి ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తుంది. కాకపోతే ఆమె పాత్రని పరిమితం చేయడం పెద్ద మైనస్‌. మరోవైపు వికాస్‌ గా విఘ్నేష్‌ చాలా బాగా చేశాడు. అదరగొట్టాడు. జెంజీ కుర్రాడిగా, పెడదారి పట్టే అబ్బాయిగా, ఖైదీగా, మారిన వ్యక్తిగా ఇలా విభిన్నమైన షేడ్స్ లో ఆకట్టుకున్నాడు. చాలా బాగా చేశాడు. భూమిక పాత్ర సినిమాకి బ్యాక్‌ బోన్‌. కాకపోతే ఆమెని సరిగ్గా చూపించలేదు. కోర్ట్ సీన్‌ కూడా బాగా రాసుకోలేదు. చాలా సిల్లీగా ఉంది. నటిగా భూమిక మాత్రం బాగా చేసింది. పోలీస్‌ కమిషనర్‌గా గౌతమ్‌ మీనన్‌ ఉన్నంతలో మెప్పించాడు. అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత రోహిత్‌ కనిపించాడు. కానీ ఆయన పాత్ర ఏమాత్రం ప్రభావం చూపించేలా లేదు. ఖైదీగా పృథ్వీ ఫర్వాలేదు. లిఖిత కూడా మెప్పించింది. మిగిలినపాత్రధారులు ఓకే అనిపించారు.

67
యుఫోరియా మూవీలో టెక్నీషియన్ల పనితీరు
Image Credit : X/@GunaaTeamworks

యుఫోరియా మూవీలో టెక్నీషియన్ల పనితీరు

కాల భైరవ సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ ని ఎలివేట్‌ చేయడంలో తన మార్క్ ని చూపించారు. చాలా సీన్లని నిలబెట్టాడు. ప్రవీణ్‌ కే పోతన్‌ కెమెరా వర్క్ ఆకట్టుకుంది. ఎస్‌హెచ్‌ ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ లోపాలు కనిపిస్తున్నాయి. సినిమా కట్‌ పేస్ట్ లా ఉందని, కంటిన్యూటీ దెబ్బతిన్నది. నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా రిచ్‌గా, క్వాలిటీగా ఉంది. దర్శకుడు గుణశేఖర్‌ చెప్పాలనుకున్న సందేశం బాగుంది. కాకపోతే చెప్పిన తీరు ఆకట్టుకునేలా లేదు. రైటింగ్‌ సైడ్‌ చాలా వీక్‌గా ఉంది. స్క్రీన్‌ ప్లే పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కాకపోతే పేరెంట్స్ నిర్లక్ష్యం, వారు పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల పిల్లలు పెడదారి పడుతున్నారు, వారు చేసే తప్పులకు పెద్దలు కూడా బాధ్యులే అని చెప్పిన తీరు మాత్రం బాగుంది.

77
యుఫోరియా మూవీ ఫైనల్‌గా
Image Credit : X/@GunaaTeamworks

యుఫోరియా మూవీ ఫైనల్‌గా

సినిమాగా ఆకట్టుకోలేకపోయినా, పేరెంట్స్ కి, పిల్లలకి ఇచ్చిన సందేశం బాగుంది. పేరెంట్స్ చూడాల్సిన మూవీ. 

రేటింగ్‌ 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
Recommended image2
Hi Movie First Review: తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
Malliswari Movie Review: చైనాలో 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా, తనకంటే 2 ఏళ్లు పెద్దదైన హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్..
Related Stories
Recommended image1
Ram Charan: తొలి దెబ్బ చాలా గట్టిగా తగిలింది.. రాంచరణ్ పర్సనల్ లైఫ్ పై అబద్దాలు, చిరంజీవి ఏం చేశారంటే
Recommended image2
Nandamuri Heroes Net Worth: నందమూరి హీరోలకు మతిపోయే ఆస్తులు.. ఎన్టీఆర్‌ కి బాలయ్య ఝలక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved