ముల్తానీ మట్టితో అదిరిపోయే అందం మీ సొంతం..
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ తో ముఖంపై ఉండే మొటిమలు, మొటిమల తాలూకు మచ్చటు వదిలిపోతాయి. అంతేకాదు ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది.

ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మొటిమలు, మొటిమల తాలూకు నల్లని మచ్చలు. ఈ మచ్చలను తొలగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ సమస్యనుంచి బయటపడేందుకు మార్కెట్ లోకి కొత్తగా వచ్చే ప్రొడక్ట్స్ అన్నింటినీ ఉపయోగిస్తుంటారు. అయినా అవి అంత ఈజీగా వదిలిపోవు. దీనికి తోడు మండుతున్న ఎండలకు ట్యాన్ సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యలకు ఫేస్ క్రీములతో చెక్ పెట్టలేము.
కానీ ముల్తానీ మట్టితో ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖంపై ఉండే చర్మం రంగు ఒకే విధంగా కనిపిస్తుంది. ట్యాన్ సమస్య కూడా వదిలిపోతుంది. దీంతో మీరు అందంగా మారిపోతారు. ఇందుకోసం ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
కొంత ముల్తానీ మట్టిని తీసుకుని అందులో రోజ్ వాటర్ లేదా నీళ్లతో పేస్ట్ మాదిరి తయారుచేసిపెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్నిన ముఖానికి పట్టించాలి. ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి.
ఈ సీజనల్ ఇలా ముఖానికి ముల్తానీ మట్టిని పెట్టుకుంటే టాన్ సమస్య రాదు. ముఖ్యంగా జిడ్డు చర్మంగలవారు ఈ ఫేస్ ప్యాక్ ను తరచుగా పెట్టుకోవడం వల్ల జిడ్డు వదిలిపోతుంది.
ఈ ముల్తానీ మట్టి సెబంను పీల్చేస్తుంది. దీంతో చర్మంపై ఉండే మలినాలు, జిడ్డు వదిలిపోతుంది. అంతేకాదు స్కిన్ పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను కూడా వదిలిస్తుంది. దీంతో మీ స్కిన్ రీఫ్రెష్ గా మారుతుంది.
టేబుల్ స్పూన్ ముల్తానీ ముట్టిలో కాస్త అలొవేరా జెల్లును మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడగాలి. ఇలా తరచుగా చేస్తే ముఖం తాజాగా, యవ్వనంగా తయారవుతుంది.