MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీకు తెలుసా.. ఇటువంటి ఆహారం తీసుకున్నాక నీళ్లను తాగితే అస్సలు మంచిది కాదట..

మీకు తెలుసా.. ఇటువంటి ఆహారం తీసుకున్నాక నీళ్లను తాగితే అస్సలు మంచిది కాదట..

ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నా సరే వెనువెంటనే నీళ్లను తాగిందాక కొందరికి మనసు కుదుట పడదు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను, పండ్లను తీసుకున్న తర్వాత నీళ్లను అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 28 2022, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇతర సమయాల్లో నీళ్లు తాగకున్నా.. ఏదైనా ఆహారం తిన్నప్పుడు మాత్రం పక్కాగా నీళ్లను తాగుతుంటాం. కొందరైతే అన్నం తినేటప్పుడు కానీ మరేదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ బుక్క బుక్కకు నీళ్లను తాగిందాక ఊరుకోరు. నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినా కొన్నిరకాల ఆహార పదార్థాలను తినేటప్పుడు, తిన్న తర్వాత నీళ్లను అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినే ప్రమాదముంది. అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినేటప్పుడు నీళ్లను అస్సలు తాగకూడదు. ఏయే ఆహారాలను తీసుకునేటప్పుడు నీళ్లను తాగకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

చాలా మంది ఫుడ్ తీసుకునేటప్పుడే కాదు పండ్లు తినేటప్పుడు కూడా తరచుగా నీళ్లను  తాగుతూ ఉంటారు. కానీ పండ్లను తిన్న వెనువెంటనే నీళ్లను అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పండ్లలో ఈస్ట్, చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి. మనం తిన్న ఆ పండ్లు Properly digested అవ్వాలి. కాగా ఇటువంటి ఆహారం జీర్ణం అవడానికి కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల అవాలి. అయితే పండ్లు తిని ఆ వెంటనే నీళ్లను తాగితే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కరిగిపోయి ఆ పండ్లు జీర్ణం కావు. ఆ సమయంలో కడుపు తీవ్ర ఇబ్బందికి గురవుతుంది. అందుకే కొన్ని రకాల పండ్లు తిన్న వెంటనే నీళ్లను అస్సలు తాగకూడదు. 
 

35

నారింజ, దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లలో ఈస్ట్, చక్కెర, నీటి శాతం ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ పండ్లను తిన్నప్పుడు వెంటనే నీళ్లను తాగకూడదు. ఎందుకంటే ఈ పండ్లను తిన్న వెంటనే నీళ్లను సేవిస్తే డయేరియా వంటి ప్రమాదకరమైన జబ్బు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇవే కాదు అన్నం తిన్న తర్వాత కూడా నీళ్లను తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

45

అన్నం తిన్న తర్వాత అప్పుడే నీటిని తాగితే  Digestive system కు ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఆ ఆహారం జీర్ణం అవడం కష్టతరమవుతుంది. అందుకే తిన్న వెంటనే కాకుండా 30 నిమిషాల తర్వాత నీటిని తాగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. తిన్న వెంటనే నీళ్లను తాగితే ఊబకాయం సమస్య బారిన పడతామని ఆయుర్వేదం చేబుతోంది. వీటితో పాటుగా ఐస్ క్రీం తిన్న తర్వాత కూడా ఆ వెంటనే నీళ్లను తాగొద్దు. 

55


అలాగే నువ్వులు, వేరు శెనగలు తిన్నవెంటనే కూడా నీళ్లకు దూరంగానే ఉండాలి. వీటిని తిన్న వెంటనే నీళ్లు తాగితే దగ్గు సమస్య అటాక్ చేసే ప్రమాదముంది. ఇకపోతే చెరుకు తిని కూడా నీళ్లను తాగకూడదు. ఎందుకంటే ఈ చెరకులో పొటాషియం, క్యాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అటువంటప్పుడు దాన్ని తిన్న వెంటనే నీళ్లను తాగితే నోటిలో పొక్కులు, పగుళ్లు వస్తాయి. అలాగే కడుపులో కూడా సమస్యలు రావొచ్చు. అందుకే పండ్లను, ఆహారాన్ని తీసుకునే ముందు ఈ విషయాలను గుర్తించుకోవాలి. లేదంటే ఈ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gardening: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు
Recommended image2
Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం
Recommended image3
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved