MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Yoga Day 2022: ఈ 5 యోగాసనాలతో తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు..

Yoga Day 2022: ఈ 5 యోగాసనాలతో తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు..

Yoga Day 2022: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీని వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో..  యోగా చేయడం ద్వారా.. గర్భిణీ స్త్రీలు ఈ సమస్యల నుంచి బయటపడటమే కాకుండా.. బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2022, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గర్భిణీ స్త్రీలు లు ఎక్కువగా పనిచేయకూడదు, వ్యాయామం లేదా యోగా చేయొద్దని సలహానిస్తుంటారు. కానీ గర్భిణీ స్త్రీలు చురుగ్గా ఉండటం చాలా అవసరం. అప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. అందుకోసం గర్బిణులు ఇంటి పనులను చేయాలని డాక్టర్లు సలహానివ్వడమే కాదు.. తేలికపాటి cardiovascular exercises యోగా చేయమని కూడా చెప్తుంటారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

 ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. దీని కారణంగా వీళ్లు చాలాసార్లు బాధపడాల్సి వస్తుంటుంది. అటువంటి పరిస్థితిలో.. యోగా ద్వారా వారు తమను తాము ఫిట్ గా ఉంచుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు తమను తాము ఫిట్ గా ఉంచుకునేందుకు ఈ ఐదు యోగాసనాలు ఉపయోగపడతాయి. 
 

37

తడాసనం (Thadasanam) - గర్భిణీ స్త్రీలకు వెన్ను నొప్పి (Back pain) ఉంటుంది. తడాసనం వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది, దానితో పాటు వెన్నెముక (Spine)కూడా బలంగా ఉంటుంది. ఈ ఆసనాన్ని గర్భం ధరించిన మొదటి ఆరు నెలలు మాత్రమే చేయాలి.

47

వీరభద్రాసనం (Veerabhadrasanam)- వీరభద్ర ఆసనాన్ని యోధుల భంగిమ అని కూడా అంటారు. గర్భధారణ సమయంలో వీరభద్రాసనం చేయడం వల్ల శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. ఇది చేతులు (Hands), భుజాలు (Shoulders), తొడలు (Thighs), దిగువ వీపు (Lower back)కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ అవయవాలన్నింతో పాటు స్టామినా కూడా పెరుగుతుంది. అయితే అధిక రక్తపోటు సమస్య  ఉన్న వారు ఈ ఆసనాన్నిచేయకూడదు. 

57

కోనాసనం (Konasana)- ఈ ఆసనం స్త్రీలకు దివ్యౌషధం లాంటిది. దీనివల్ల  వెన్నుపాము (Spinal cord) బలంగా ఉంటుంది. రక్త ప్రసరణ (Blood circulation)సరిగ్గా జరుగుతుంది. రోగనిరోధక శక్తి (Immunity)పెరుగుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం యొక్క పై, దిగువ భాగం ఆరోగ్యంగా ఉంటుంది.
 

67

మార్గరీ ఆసనం (Marjari Asana)- ఈ ఆసనాన్ని పిల్లి భంగిమ అని కూడా అంటారు. ఇది వెన్నెముకకు బలాన్ని ఇస్తుంది. శరీరాన్ని Flexibility గా ఉంచుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. దీనితో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది.
 

77

శవాసనం (Savasana): గర్భధారణ సమయంలో మహిళల మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. దీంతో వీరు ఒత్తిడికి లోనవుతారు. ఈ ఆసనం వేయడం ద్వారా.. ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో గర్భంలో బిడ్డ ఎదుగుదల బాగా జరుగుతుంది. దీన్ని ప్రతిరోజూ చేయాలి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ సండే ఇంట్లో ద‌బ్బిడి దిబిడే.. చికెన్ ఫ్రై ఇలా చేస్తే, ఇంట్లో వాళ్లు ఫిదా అవ్వాల్సిందే
Recommended image2
Summer Sleep Tips: ఈజిప్ట్ రాజుల సీక్రెట్ ఇదే..ఏసీ, ఫ్యాన్ లేకుండానే హాయిగా నిద్ర పడుతుంది
Recommended image3
Besan Tadka: తాలింపులో ఇదొక్కటి కలపండి చాలు..మీ వంటలు అద్భుతః..మళ్లీ మళ్లీ కావాలంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved