Wrinkles: ముఖంపై ముడతలను తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..!
Wrinkles: వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావడం సర్వ సాధారణం. కానీ చాలా మందికి వృద్ధాప్య చిహ్నాలు ముందుగానే కనిపిస్తాయి. దీంతో వారెంతో ఒత్తిడికి గురవుతారు. ఈ సమస్య వల్ల వీరి ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతినే ప్రమాదముంది.

ముఖంపై ముడతలు ఏర్పడటం వృద్ధాప్యానికి చిహ్నం. అందుకే ఇవి వయసు మీద పడుతున్న వారికే వచ్చేవి. అయితే ప్రస్తుత కాలంలో వృద్ధాప్య చిహ్నాలు కొందరిలో ముందుగానే వస్తున్నాయి. ఇలాంటి వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడమే కాదు.. ఇబ్బందిగా ఫీలవుతుంటారు కూడా. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల వృద్ధాప్య ఛాయలు ముందుగానే వస్తాయి. దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కన్ని రకాల ఆహారాలు ముడతలను తగ్గిస్తాయి. అవేంటంటే..
అవకాడో.. అవకాడోలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే కొవ్వు ఆమ్లాలు కూడా నిర్జీవమైన చర్మాన్ని స్మూత్ గా చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు ఇవి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా తయారుచేస్తాయి.
బచ్చలికూర.. బచ్చలికూరను అన్ని ఆకుకూరల్లో ఉత్తమ కూరగాయగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది హైడ్రేటింగ్, యాంటీ ఆక్సిడెంట్ల లక్షణలను కూడా కలిగి ఉంటుంది. ఇవి చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బచ్చలికూరను తినడం వల్ల ఒంట్లో నీటి కొరతే ఏర్పడదు. అంతేకాదు ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది. దీన్ని మీరు సలాడ్ గా లేదా వెజిటేబుల్ సూప్ లేదా జ్యూస్ గా చేసుకుని తీసుకోవచ్చు.
చిలగడదుంప.. చిలకడదుంపలను ఉడకబెట్టడం లేదా పాలతో కలిపి తినొచ్చు. ఇది చర్మంలోని ఒత్తిడిని కలిగించి ముడతలను మటుమాయం చేస్తుంది. అంతేకాదు ఇవి ముఖాన్ని కాంతివంతంగా కూడా తయారుచేస్తాయి.
బొప్పాయి.. బొప్పాయి పండులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ముఖంపై ముడతలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ముడతలను తగ్గించేందుకు తోడ్పడతాయి. ఇందులో విటమిన్ ఎ, విటమన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. బొప్పాయి ప్రీరాడికల్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. ముఖంపై ఉండే జిడ్డంతా పోయి ముఖాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది.