CHOLESTEROL: కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని తినడం తగ్గించండి..
CHOLESTEROL: మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒక మంచి కొలెస్ట్రాల్ అయితే రెండోది చెడు కొలెస్ట్రాల్. ఇందులో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉంది.
High Cholesterol
మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్ ) శరీరానికి ఎంతో అవసరం. కానీ చెడు కొలెస్ట్రాల్ మాత్రం అస్సలు మంచిది కాదు. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలతో పాటుగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
High Cholesterol
అయితే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునేవారు కొన్ని రకాల ఆహారాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.
బేకింగ్ సోడా (Baking soda): బేకింగ్ సోడాను చాలా ఆహారాల్లో ఉపయోగిస్తుంటాం. కానీ ఈ బేకింగ్ సోడా చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది కూడా. అందుకే సోడాను పరిమితి పరిమాణంలోనే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
వెన్న (Butter): మన దేశంలో వెన్నను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందులోనూ వెన్నలేకుండా ముద్దకూడా తినని వారు చాలా మందే ఉంటారు. కానీ సాధారణంగా మనం మార్కెట్ లో కొనే వెన్నలో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అమాంతం పెంచుతుంది.
ఆయిల్ ఫుడ్ (Oil food): ఆయిలీ ఫుడ్ యే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి అసలు కారణమని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ మన దేశంలో ఆయిల్ ఫుడ్ ను తినేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ ఈ అలవాటును ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బయట కనిపించే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మన నోరూరించినా.. వీటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిని తినడం వల్ల శరీరంలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కూడా.
పాప్ కార్న్ (Popcorn): పాప్ కార్న్ ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో.. ఫ్రెండ్స్ బయటకు వెళ్లినప్పుడు, మూవీ చూస్తున్నప్పుడు వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఎందుకంటే మార్కెట్ లో లభించే పాప్ కార్న్ లో కేలరీలు అధికంగా ఉండే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. అందుకే మార్కెట్ లో లభించే పాప్ కార్న్ లను తినకండి. కావాలంటే ఇంట్లో తయరుచేసుకుని తినండి.
ప్రాసెస్ చేసిన మాంసం (Processed meat): మాంసం తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. కానీ ప్రాసెస్ చేసిన మాంసం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడంతో పాటుగా గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది.