MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • హార్ట్ ఎటాక్ రాకూడదంటే ఈ అలవాట్లు ఉండాల్సిందే..!

హార్ట్ ఎటాక్ రాకూడదంటే ఈ అలవాట్లు ఉండాల్సిందే..!

టైం కు నిద్రపోవడం, మంచి ఆహారం తినడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, పొగాకును మానుకోవడం వంటి అలవాట్లు చేసుకుంటే చాలు మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం తప్పినట్టే.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 25 2022, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
heart atack

heart atack

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 29న నాడు హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాదు యువకులు కూడా గుండెపోటుకు బలైపోతున్నారు. ఈ గుండెపోటు సర్వసాధారణ సమస్యలా మారిపోయింది.

26
world heart day

world heart day

చాలా మంది హెల్తీగా ఉండాలని ప్రతిరోజూ వ్యాయామం చేస్తాయి. అలాగే  ఆరోగ్యకరమైన ఆహారాలనే తింటుటారు. అయినప్పటికీ గుండెపోటు బారిన పడుతుంటారు. టైం కి పడుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, పొగాకుకు దూరంగా, మద్యపానానికి దూరంగా ఉంటేనే చాలు మీ గుండె ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. ఈ అలవాట్లే మిమ్మల్ని గుండెపోటు ప్రమాదం నుంచి తప్పిస్తాయి. గుండెపోటు రాకూడదంటే ఇంకేమేం చేయాలో తెలుసుకుందాం పదండి..

36
heart

heart

సూర్యోదయానికి ముందే మేల్కోవాలి: సమయానికి పడుకోండి. అలాగే సూర్యుడు ఉదయించడానికే మునుపే లేవండి. కొద్ది సేపు వ్యాయామం చేయండి. రోజూ ఇలా చేయడం చాలా మంచి అలవాట. దీనివల్ల మీరు రీఫ్రెష్ గా ఉండటమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు. రోజూ 7 నుంచి 8 గంటలు పడుకుంటే ఆరోగ్యానికి మంచిది. 

46

ఆరోగ్యంగా తినండి, మద్యానికి దూరంగా ఉండండి:  మద్యం ఎన్నో రోగాలకు దారితీస్తుంది. దీన్ని తాగడం వల్ల లివర్ పాడవడమే కాదు.. గుండె కూడా రిస్క్ లో పడుతుంది. అందుకే మద్యంతాగే అలవాటును మానుకోండి. పండ్లు, కూరగాయలను, సలాడ్లను ఎక్కువగా తీసుకోండి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

56

వ్యాయామాలు చేయండి:  రోజంతా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం వల్ల బ్యాక్ పెయిన్ నే కాదు శరీరంలో కొలెస్ట్రాల్, బరువు విపరీతంగా పెరిగిపోతాయి. వీటివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి. కాబట్టి రోజుకు ఒక 30 నిమిషాలపాటైనా వ్యాయామం చేయండడి. క్రమం తప్పకుండా ఏరోబిక్, బరువు శిక్షణ, యోగా వ్యాయామాలు చేస్తే హెల్తీగా ఉంటారు. 
 

66
heart

heart

త్వరగా పడుకోండి:  అర్థరాత్రి వరకు మేలుకువగా ఉండటం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ ఇది అస్సలు మంచి అలవాటు కాదు. దీనివల్ల బరువు పెరగడమే కాదు జీవక్రియలు దెబ్బతింటాయి. పనిపట్ల ఏకాగ్రత తగ్గుడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి వీలైనంత తొందరగా పడుకోండి. ఇందుకోసం మీ రోజును ప్లాన్ చేసుకోండి.షెడ్యూల్ చేయండి. ప్రతిరోజూ డైరీ రాయండి. త్వరగా నిద్రపోవడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం, ఉదయాన్నే మేల్కొవడం వంటి అలవాట్ల వల్ల మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Okra Farming: ఈ ఒక్క దాంతో ఇంట్లోనే బెండకాయ తోటే వేసేయొచ్చు
Recommended image2
Bitter Gourd: కాకరకాయతో ఈ 7 లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!
Recommended image3
Gut Health: పేగుల ఆరోగ్యం కోసం ఈ 7 పండ్లు తినండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved