MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వామ్మో.. వర్క్ ఫ్రమ్ హోం చేసేవారికి ఇన్ని రోగాలొస్తాయా?

వామ్మో.. వర్క్ ఫ్రమ్ హోం చేసేవారికి ఇన్ని రోగాలొస్తాయా?

కరోనా రాకతో వర్క్ ఫ్రమ్ హోం చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ వర్క్ ఫ్రం హోం వల్ల కలిగే ఉపయోగాల సంగతి పక్కన పెడితే.. దీని వల్ల కలిగే నష్టాలు మాత్రం ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయి. ముఖ్యంగా గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2 Min read
Mahesh Rajamoni
Published : Feb 03 2022, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


కరోనా రాకతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో వారు ఒకే దగ్గర కూర్చొని గంటల తరబడి పనిచేయాల్సి వస్తోంది. అంతేకాదు కూర్చున్నంత సేపు ఏదో ఒకటి తింటూనే ఉండేవారు చాలా మందే ఉన్నారు. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? కూర్చున్నంత సేపూ ఏదో ఒకటి తినడం వల్ల శరీరానికి ఎంతో హానీ జరుగుతుందని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. అందులోనూ కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. 

26

ఆఫీసులకు వెళ్లి పనిచేస్తున్న వారైతే ఒక పదో లేక పదిహేను నిమిషాలకొకసారో నడుస్తూ ఉంటారు. కానీ వర్క్ ఫ్రమ్ హోం వల్ల ఒకే ప్లేస్ కు అంకితమవుతున్నారు. ముఖ్యంగా కూర్చున్న దగ్గర నుంచి ఇంచ్ కూడా కదలరు. ఇలాగే ఒక 25 సంవత్సరాలు పనిచేస్తే.. మనిషి విపరీతంగా బరువు పెరిగిపోయే ప్రమాదముందని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. అంతేకాదు ఇంకా ఎన్నో రోగాల బారిన పడే ప్రమాదముంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

36

కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధి సోకుతుంది. అలాగే కూర్చొని కూర్చోని వెన్నెముక వంగుతుంది. అంతేకాదు కళ్ల కంద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాగే హెయిర్ ఫాల్ సమస్య కూడా వస్తుంది. రిపిటేటివ్ టైపింగ్  స్ట్రైన్ , ఊబకాయం వంటి సమస్యలు కూడా చుట్టుముడుతాయి. 

46

కంప్యూటర్ ముందు ఎక్కువ పనిగంటలు పనిచేయడం వల్ల స్కిన్ పొడిబారడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. అంతేకాదు మీ చర్మం ముడతలు పడుతుంది. అంతేకాదు టెక్ నెస్  కూడా వస్తుంది. 

56

నివారణా మార్గాలు:  ఎక్కువ పనిగంటలు కంప్యూటర్ పై వర్క్ చేస్తుంటే.. ప్రతిరోజూ చిన్న పాటి Workouts, శారీరక శ్రమ, పరుగు, నడక వంటివి తప్పకుండా చేయాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఒకవేల మీకు పడకపై పనిచేసే అలవాటుంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే దానీపై వర్క్ చేస్తే మీరు గజిబిజీకి గురయ్యి ఒత్తిడి ఏర్పడుంది. అందుకే వర్క్ చేయాలంటే దానికోసం ప్రత్యేకంగా ఒక డెస్క్ ను ఏర్పాటు చేసుకోండి. అయితే రోజుకు కంప్యూటర్ పై 6 నుంచి 8 గంటలే పనికి సమయాన్ని కేటాయించండి. 

66

ప్రతి రోజూ కనీసం ఒకటినుంచి రెండు గంటలైనా.. ఫోన్లు ఇతర Electronic Gadgets ను చూడకుండా ఉండండి. ఆ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు ఉపయోగించుకోండి. దీని వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. వీటితో పాటుగా ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయమం చేయండి. దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంంది. ముఖ్యంగా మన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాదు మెదడును ఉత్తేజంగా మారుస్తుంది. వీటిన్నింటితో పాటుగా ప్రతిరోజూ  7 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి.  ‌

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పరగడుపున మునగాకు నీరు తాగితే ఏమౌతుంది?
Recommended image2
New Year 2026: కొత్త సంవత్సరంలో ఈ ఐదు పనులు మాత్రం చేయకూడదు
Recommended image3
Amla Oil: కొబ్బరి నూనె కాదు, ఉసిరి నూనె జుట్టుకు రాస్తే ఏమౌతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved