Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Wisdom Teeth Pain: జ్ఞాన దంతాల నొప్పిని భరించలేకపోతున్నారా? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది..

Wisdom Teeth Pain: జ్ఞాన దంతాల నొప్పిని భరించలేకపోతున్నారా? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది..

Wisdom Teeth Pain: నోటి మూలాల్లో ఉండే జ్ఞాన దంతాలు పెద్దవి అవుతున్న సమయంలో విపరీతమైన నొప్పి పుడుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు.  

Mahesh Rajamoni | Published : May 03 2022, 01:59 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

Wisdom Teeth Pain: జ్ఞాన దంతాలు పెద్దవి అవుతున్న సమయంలో విపరీతమైన నొప్పి పుడుతుంది. ముఖ్యంగా ఈ నొప్పి వల్ల ఏది తినలేరు కూడా. కొన్ని కొన్ని సందర్బాల్లో అయితే ఈ నొప్పి భరించలేదిగా ఉన్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్లు ఉబ్బడం వంటి సమస్యలు తలెత్తుంటాయి. పరిస్థితి మరింత దారుణంగా మారితే పంటిని తొలగిస్తారు వైద్యులు. అయితే ఈ పంటినొప్పి  వచ్చినప్పుడు హాస్పటల్లు అందుబాటులో లేనప్పుడు ఈ ఇంటి చిట్కాలను పాటించడం వల్ల వెంటనే ఉపశమనం పొందవచ్చు. అవేంటంటే.. 
 

27
Asianet Image

ఐస్ క్రీమ్.. జ్ఞాన దంతాల నొప్పిని భరించలేనప్పుడు ఐస్ క్రీం తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే నొప్పి పుడుతున్న ప్రాంతంలో ఐస్ క్యూబ్స్ ను పెడితే కూడా ఆ నొప్పి నుంచి బయటపడొచ్చు. 

37
Asianet Image

ఉప్పు.. పంటి నొప్పిని తగ్గించడానికి ఉప్పు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. భరించలేని పంటి నొప్పి కలుగుతున్నప్పుడు కొన్ని నీళ్లు తీసుకుని అందులో కాస్త ఉప్పును వేసి.. వాటిని నోటిలో పోసుకుని పుక్కిలిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

47
Asianet Image

లవంగాల నూనె.. లవంగాలు నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పంటి నొప్పిని, వాపును తగ్గించడానికి లవంగాలు ఎంతో సహాయపడతాయి. జ్ఞాన దంతాల నొప్పి పుట్టినప్పుడు లవంగాల నూనెను కాటన్ బాల్స్ కు కొద్దిగా అద్ది నొప్పి దగ్గర అప్లై చేయండి. దీంతో వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

57
Asianet Image

పసుపు.. పసుపు ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. ఎందుకంటే దీనిలో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జ్ఞాన దంతాల నొప్పిని చిటికెలో వదిలించగలవు. పసుపు, ఉప్పు, ఆవాలను కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీనిని జ్ఞాన దంతాలపై అప్లై చేయాలి. కానీ ఈ పేస్ట్ గొంతు లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే పంటి నొప్పి మటుమాయం అవుతుంది.  

67
Asianet Image

కొబ్బరి నూనె.. కొబ్బరి నూనె కూడా జ్ఞాన దంతాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే ఇది క్రిమికీటకాలకు వ్యతిరేకంగా పోరాడగలదు. జ్ఞాన దంతాల నొప్పి తగ్గాలంటే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకుని నోట్లో వేసుకోండి. 20  నిమిషాల తర్వాత పుక్కిలించి బయటకు ఊసేయండి. ఆ తర్వాత నోటిని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. 
 

77
Asianet Image

వెల్లుల్లి.. వెల్లుల్లిలో యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ బయోటిక్ గుణాలుంటాయి. ఇవి జ్ఞాన దంతాల నొప్పిని చిటికెలో తగ్గించగలవు. ఇందుకోసం రెండు మూడు వెల్లుల్లిలను కొంచెం బరకుగా చేసి ముద్దగా చేసి నొప్పిగా ఉన్న దంతంపై పెట్టండి. కొద్ది సేపటికే నొప్పి మటుమాయం అవుతుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories