Lunar Eclipse 2022: ఈ నెల 16 నే తొలి చంద్రగ్రహణం.. మనపై దీని ప్రభావం ఉంటుందా? ఉండదా?
Lunar Eclipse 2022: ఈ సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో మొదటిది ఈనెల 16 ఏర్పడనుంది. అయితే ఈ చంద్రగ్రహనం మన దేశంలో కనిపించదు. అయినా ఈ గ్రహణం మనపై ప్రభావాన్నిచూపిస్తుందా? లేదా?

Lunar Eclipse 2022: భారతదేశ సనాతన ధర్మం ప్రకారం సూర్యగ్రహణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. చంద్రగ్రహణానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మే నెలలో ఏర్పడనుంది. ఇది సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజుల తర్వాత ఏర్పడనుందన్న మాట. అంటే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ నెల 16 తారీఖున ఏర్పడనుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏ సంవత్సరం రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో మొదటి చంద్రగ్రహణం వైశాఖ పూర్ణిమ రోజున ఏర్పడనుంది.
ఈ ఏడాదిలో ఏర్పడనున్న రెండూ చంద్రగ్రహణాలు కూడా సంపూర్ణమైనవే. ఈ గ్రహణం ప్రపంచమంతా ఎన్నో ప్రాంతాల్లో కనిపిస్తుంది. కానీ ఈ గ్రహణం భారత దేశంలో ఇది పాక్షికంగానే ఉంటుంది. అంటే దీని ప్రభావం తక్కువనే చెప్పాలి. గ్రహణాల ప్రకారం.. వివిధ రాశుల వారిపై దీని ప్రభావం ఉండదని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు.
చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందంటే.. చంద్రునికి భూమికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్య, చంద్ర, భూమి సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. దీన్నే ‘బ్లడ్ మూన్’ చంద్రగ్రహణం అనికూడా అంటారు. చంద్రుడు.. సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపై కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..2022లో మొదటి చంద్రగ్రహణం మే 16న, రెండవది 2022 నవంబర్ 8న ఏర్పడనున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మొదటి చంద్రగ్రహణం.. 16 మే 2022న ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం పాక్షికంగానే ఉండనుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖం మే 16న పూర్ణిమ జరుపుకుంటారు. అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. కాబట్టి వివిధ రాశుల వారిపై శుభ, అశుభ ఫలితాలు ఉండవని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు.
2022 మే 16న సంభవించే తొలి చంద్రగ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో పూర్తిగా కనిపిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం మనదేశంలో లేదు.. కనుక ఈ గ్రహణ సమయాన్ని సూతకాలంగా పరిగణించరు. కాబట్టి ఇండియాలో ఈ గ్రహణం ఎలాంటి శుభ లేదా అశుభ ప్రభావాన్ని చూపించదు.
యూకెలో ఈ తొలి చంద్రగ్రహణాన్ని తెల్లవారు జామున 2:30 గంటల నుంచి ఉదయం 5:10 గంటల వరకు ఈ గ్రహణాన్నిచూడొచ్చు.