Household Tips: ఇంట్లో దుర్వాసన పోవాలంటే సింపుల్ పరిష్కారం
Household Tips: ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నా బ్యాడ్ స్మెల్ ఇబ్బంది పెడుతోందా? సమస్య శుభ్రతలో కాదు, వెంటిలేషన్ లోపమేనంటున్నారు నిపుణులు. వంటగది, బాత్‌రూమ్, తేమ, చెత్త బుట్టలు వంటి కారణాలే దుర్వాసనకు కారణమవుతున్నాయని చెబుతున్నారు.

ఎందుకిలా జరుగుతోందని ఎప్పుడైనా ఆలోచించారా?
చాలా మంది ఇల్లు పదే పదే క్లీన్ చేస్తూ ఉంటారు. దుమ్ము, ధూళీ లేకుండా శుభ్రం చేసుకుంటారు. ఇంట్లో ఎన్ని పనులున్నా కూడా...ఇల్లు క్లీన్ గా ఉంచుకోవడం ఒక అలవాటు. కానీ ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నా కూడా ఇంట్లో బ్యాడ్ స్మెల్ తో ఇబ్బంది పడుతుంటారు. దుర్వాసన రాకుండా రూం స్ప్రేలు వాడతారు. అయినా కూడా చుట్టాలు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆ స్మెల్ కి లోపల రావడానికి కూడా ఇష్టపడరు. బయటే ఉండిపోతారు. ఎంత నీట్ గా ఉంచుకుంటున్నా..ఎందుకిలా జరుగుతోందని ఎప్పుడైనా ఆలోచించారా?
సమస్య మన శుభ్రతలో కాదు..వెంటిలేషన్‌లో
ఇల్లు ఎంత శుభ్రంగా తుడిచినా దుర్వాసన వస్తూనే ఉంటుందా? అయితే సమస్య మన శుభ్రతలో కాదు..వెంటిలేషన్‌లోనే ఉందంటున్నారు నిపుణులు. రోజూ క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ తగ్గకపోవడం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య. ఇళ్లలో ఉండే ఈ దుర్వాసనను ఇంట్లో వారికి తెలియకపోవచ్చు. దానికి కారణం… రోజూ ఇంట్లోనే ఉండటం వల్ల మన ముక్కు ఆ వాసనకు అలవాటు పడిపోతుంది. కానీ అతిథులు తలుపు దగ్గరే ఆగిపోవడం, కిటికీ తీసేటప్పుడు అసలు సమస్య తెలుస్తుంది. నిజానికి ఇంట్లో భరించలేని వాసన రావడం అంటే పరిశుభ్రత లోపం కాదు, వెంటిలేషన్ సరైన రీతిలో ప్రసారం కాకపోవడం. తేమ, లోపల గాలి బయటకు వెళ్లకపోవడమే అసలు కారణాలు.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ కచ్చితంగా పెట్టుకోవాలి
అసలు వాసన ఎక్కడి నుంచి వస్తుందో ముందుగా గుర్తించాలి. వంటగదిలోనా, బాత్‌రూంలోనా? అని చూసుకోవాలి. ముఖ్యంగా పెంపుడు జంతువులు, డస్ట్ బిన్, మాసిన బట్టలు కూడా వాసనకు కారణమే. వర్షాకాలంలోనూ లేదా తేమ ఎక్కువగా ఉండే సమయంలోనూ దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్టలు ఆరకపోవడం, తేమ ఉండిపోవడంతో వాసన వచ్చేస్తుంది.
అందులోనూ మన వంటగదిలో ఉండే మసాలాల వాసన ఎక్కువసేపు నిలిచిపోతుంది. సరైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోతే ఆ వాసన గోడలు, అల్మారాలు, కర్టెన్లకు అంటుకుంటుంది. వంట చేసే సమయంలో కచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడాలి. కిటికీలు తెరిచి ఉంచాలి. గోడలు, అల్మారాలు తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. రాత్రి పడుకునే ముందు ఒక బౌల్ వెనిగర్ వంటగదిలో ఉంచితే వాసన తగ్గుతుంది.
వర్షాకాలంలో ఇంటి పరిస్థితి మరీ దారుణం
వర్షాకాలంలో ఇంటి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తేమ కారణంగా బూజు, ఫంగస్ ఏర్పడి దుర్వాసన వస్తుంది. అందుకే ఇంట్లో వెంటిలేషన్ ఉండేలా కిటికీలు తెరవాలి. మూలల్లో బేకింగ్ సోడా, అల్మారాల్లో కర్పూరం ఉంచితే ఉపయోగం ఉంటుంది. బాత్‌రూమ్‌లలో డ్రెయిన్ క్లీనింగ్, సరైన వెంటిలేషన్ చాలా అవసరం. ఒక్కోసారి ఆ బాత్‌రూమ్ నుంచి కూడా ఇంట్లోకి వాసన వచ్చే ప్రమాదముంది. సరిగ్గా ఫ్లష్ చేయకపోయినా, మాసినబట్టలు ఎక్కువరోజులు అందులోనే ఉంచేసిన వాసన వచ్చేస్తుంది. ఒకవేళ స్నానం చేసినా ఫ్రెష్ గా ఉండే అనుభూతి ఉండదు.
డస్ట్ బిన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి
ఇక చెత్త బుట్టలు రోజూ ఖాళీ చేయకపోతే ఆహార వ్యర్థాల వల్ల దుర్వాసన వస్తుంది.డస్ట్ బిన్ రోజూ ఖాళీ చేయడం, వారానికి ఒకసారి శుభ్రం చేయడం తప్పనిసరి. పెంపుడు జంతువుల వల్ల వచ్చే వాసనను తగ్గించేందుకు అవి పడుకునే చోట, తినేచోట ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి, ఫ్లోర్లపై తడిగుడ్డపెట్టడం చాలా అవసరం. చేయడం అవసరం.
ఇన్ స్టంట్ ఫ్రెష్ నెస్ కోసం ఎయిర్ ఫ్రెషనర్లు వాడటం అప్పటికి ఫలితం ఇచ్చినా....అది ఆరోగ్యానికి చాలా హానికరం. దగ్గు, అలెర్జీ, గొంతు మంటలు వచ్చే అవకాశం ఉంది. సో రూం స్ప్రేల కంటే ముందు ఇంట్లో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. రోజంతా తలుపులు, కిటికీలు మూసేయకుండా...తెరిచి ఉంచండి. సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూసుకోండి. నిత్యం గాలి ప్రసారం కావడం వల్ల చెడు వాసన బయటకు వెళ్లి బయట గాలి లోపలి వస్తుంది. అప్పుడు ఎలాంటి స్ప్రేలు అవసరం లేదు. బేకింగ్ సోడా, కాఫీ పొడి వంటి సహజ పదార్థాలు వాసనను పీల్చుకుంటాయి.

