వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, ఇతర కీటకాలు పెరుగుతాయి. ఫలితంగా వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. అందుకే నీరు నిల్వ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాకాలంలో దోమల బెడద ప్రధాన సమస్య. వీటి నుండి రక్షణ పొందేందుకు కిటికీలకు దోమతెరలు (మష్కిటో నెట్స్) వాడటం చాలా ప్రభావవంతమైన పరిష్కారం.
మురికి, తేమ ఉన్న ప్రదేశాల్లో దోమలు, ఈగలు వంటి కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కీటకాల వ్యాప్తిని తగ్గించవచ్చు.
తెలుపు, నీలం రంగుల లైట్లు కీటకాలను ఆకర్షిస్తాయి. కాబట్టి వీటి బదులు వెచ్చని లేదా పసుపు రంగు లైట్లు వాడటం మంచిది. ఇవి కీటకాలకు చెక్ పెడుతాయి.
ఖాళీ గదుల్లో, మంచం, టేబుల్ కింద వెల్లుల్లి నీళ్ళు కలిపిన స్ప్రే చేస్తే కీటకాలు దరిచేరవు. ఇది సహజ, రసాయన రహిత నివారణ పద్ధతి
వేప, లెమన్ గ్రాస్, లావెండర్, యూకలిప్టస్ వంటి నూనెలు కీటకాలను తరిమికొడతాయి. వీటిని నూనెగా స్ప్రే చేయవచ్చు లేదా మొక్కలుగా ఇంట్లో పెంచి సహజ రక్షణ పొందవచ్చు.
వర్షాకాలంలో ముదురు రంగు దుస్తులు కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి, కాబట్టి బయటకి వెళ్ళేటప్పుడు లేత రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇది కీటకాల నుంచి రక్షణలో సహాయపడుతుంది