Relations: అబ్బాయిలకు పొడువు జుట్టు ఉన్న అమ్మాయిలే ఎందుకు నచ్చుతారు?
నీకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది? అని ఎవరైనా అబ్బాయిని అడిగితే.. వారు చెప్పే వాటిలో పొడవు జుట్టు ఒకటి. సినిమాల్లో హీరోయిన్లకు కూడా పొడవు జుట్టే ఎక్కువ చూపిస్తారు. అసలు, అబ్బాయిలు పొడవు జుట్టు ఉన్న అమ్మాయిలే ఎక్కువగా ఎందుకు నచ్చుతారో తెలుసా? దాని వెనక ఏదైనా కారణం ఉందా?

ఫ్యాషన్ ట్రెండ్స్
ప్రతి అబ్బాయికీ తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అనే కోరికలు ఉంటాయి. ఎక్కువగా అబ్బాయిలను.. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే పొడవాటి జుట్టు ఉండాలి అనే రిక్వైర్మెంట్ ని చెబుతూ ఉంటారు. తమ భార్యలు జుట్టు కత్తిరించుకుంటామన్నా కూడా ఒప్పుకోని భర్తలు కూడా ఉంటారు. అంతెందుకు సినిమాల్లో డైరెక్టర్లు కూడా హీరోయిన్ ని చూపించేటప్పుడు పొడవాటి జుట్టు ఉన్నట్లుగా, గాలికి ఎగురుతున్నట్లుగా అందంగా చూపిస్తారు. అసలు అబ్బాయిలకు ఈ పొడవు జుట్టు ఫ్యాంటసీ ఎందుకు ఉంటుంది? దాని వెనక కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
ఆరోగ్య లక్షణం
మంచి ఆరోగ్య లక్షణం: పూర్వకాలంలో అమ్మాయిల పొడవాటి జుట్టుకి (పొడవాటి జుట్టు గల అమ్మాయి) చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇది ఆరోగ్యానికి, అందానికి సంబంధించినది.
అందానికి చిహ్నం
అందానికి గుర్తు: చాలా సంస్కృతుల్లో, పొడవాటి జుట్టును అందం, స్త్రీత్వంకి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఎక్కువగా అబ్బాయిలు పొడవాటి జుట్టు అమ్మాయినే కోరుకుంటారు. వారు అందంగా ఉంటారు అనేది వారి నమ్మకం.
మానసిక శాస్త్రం
మానసిక శాస్త్రం ఏం చెబుతుంది? పొడవాటి జుట్టును లైంగిక ఆకర్షణ (లైంగిక ఆకర్షణ) కి గుర్తుగా చూస్తారు. అలాంటి జుట్టు ఉన్న అమ్మాయితో..లైఫ్ బాగుంటుంది అనేది వారి నమ్మకం. అందుకే ఎక్కువ ఈ ఫ్యాంటసీ అబ్బాయిల్లో ఉంటుందట.
సహజమైన లుక్
పరిశోధన ఏం చెబుతుంది? కొన్ని పరిశోధనలు అబ్బాయిలు పొడవాటి జుట్టు గల అమ్మాయిలవైపు ఆకర్షితులవుతారని కనుగొన్నాయి. పొడవాటి జుట్టు సహజమైన, ఆకర్షణీయమైన లుక్ ఇస్తుంది. అబ్బాయిలు పొడవాటి జుట్టు వైపు ఆకర్షితులవడానికి అనేక కారణాలున్నాయి.