- Home
- Life
- Bath After Eating: తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా? అయితే మీరు ఆ రోగాలకు స్వాగతం పలుకుతున్నట్టే..
Bath After Eating: తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా? అయితే మీరు ఆ రోగాలకు స్వాగతం పలుకుతున్నట్టే..
Bath After Eating: ఈ పిల్లలు చెప్తే వినరు.. తిన్నాకా స్నానం చేయకూడదురా అంటే స్నానం చేస్తుంటారు. ఏం పిల్లలో ఏమో అంటూ అమ్మమ్మో.. తాతో చెప్తూ ఉంటారు. వాళ్లు చెప్పే ఇలాంటి మాటల వెనక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని మనం తెలుసుకోవాలి.

Bath After Eating: అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు చెప్పే ప్రతి విషయం వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుంది. అది వారు చెప్పకపోయినా.. వారి మాటలను మనం ఖచ్చితంగా వినాల్సిందే. లేదంటే ఏరి కోరి అనారోగ్య సమస్యలను తెచ్చుకున్న వారవుతాం. ముఖ్యంగా చాలా మంది తిన్న తర్వాతనే స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నానమ్మో, తాతో చెప్పినా.. అది మన చెవికి చేరదు. ఎందుకంటే మనం చేసిందే రైట్ అనుకుంటాం కాబట్టి.
కానీ తిన్న తర్వాత స్నానం చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఇవి తెలిసినా.. కొంతమంది వామ్మో కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయిరో అంటూ .. ముందు అన్నం తినేసి, ఆ తర్వాత స్నానం చేస్తుంటారు. కొంతమంది మాత్రం స్నానం చేసాకే అన్నం తింటుంటారు. అయితే తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఎలాంటి రోగాలొస్తాయి.. సైంటిఫిక్ రీజనేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..
తిన్న వెంటనే వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర Temperature ఎంతుందో అంతకు రెండు మూడు రెట్లు Temperature పెరిగే అవకాశముంది. అలా పెరిగితే.. Hyperthermic action ఏర్పడటంతో మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ తగ్గడం మొదలవుతుంది.
అంతేకాదు ఇది Nervous system ను Relax చేస్తుంది. దీంతో తిన్న ఆహారం తొందరగా జీర్ణం కాదు. జీర్ణం కావడానికి ఎక్కువ టైం తీసుకోవడంతో అజీర్థి సమస్యలు, గుండెలో మంట, ఛాతిలో మంట, తిమ్మిర్లు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వేడి నీళ్లు మంచివి కాకపోతే చన్నీళ్లు మంచివా.. అనుకోవచ్చు. హమ్ మీరునుకున్నట్లు స్నానానికి చన్నీళ్లు మంచివే. తిన్న తర్వాత చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల తిన్నది తొందరగా జీర్ణమవుతుంది. అలాగే ఫుడ్ లో ఉండే ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతుంది.
తిన్న తర్వాత స్నానం చేసే బదులు స్నానం చేసిన తర్వాతే తినడం ఉత్తమం. లేదంటే తిన్న తర్వాత పక్కాగా 2 గంటల సేపు ఆగి ఆ తర్వాత స్నానం చేయాలి. వేడి నీళ్లైనా, చల్ల నీళ్లైనా తిన్న తర్వాత స్నానం చేయాలనుకునే వారు పక్కాగా రెండు గంటల తర్వాతే స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది.
స్నానం చేస్తే శరీరంపై పేరుకుపోయిన మురికంతా పోతుంది. స్నానం చేయడంతో బాడీలోని ప్రతి Cellఉత్తేజితమవుతుంది. అంతేకాదు స్నానం చేస్తే ఫుల్ ఎనర్జిటిక్ గా మారితారు. ఫ్రెష్ గా అనిపిస్తారు. స్నానం చేసిన తర్వాతే ఎక్కువగా ఆకలి అవుతుంది. కాబట్టి స్నానం చేసిన తర్వాతే తినడం అలవాటు చేసుకోండి.
ఒకవేళ తిన్న తర్వాతే స్నానం చేస్తా అంటే మాత్రం మీరు అనేక అనారోగ్య సమస్యలను ఏరి కోరి ఆహ్వానం పలికినట్టే అవుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించడం ప్రారంభవవుతుంది. దీంతో మీరు మలబద్దకం సమస్య బారిన పడాల్సి వస్తుంది. ఇంతేకాదు ఇలా స్నానం చేయడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా స్నానాకి ముందు తినడం వల్ల తిన్నది ఒంటి పట్టదు జాగ్రత్త..