Fan: ఫ్యాన్ తిరుగుతున్నా గాలి ఎందుకు రాదు?
పేరుకు ఫ్యాన్ వేగంగా తిరుగుతున్నట్లే కనిపిస్తూ ఉంటుంది. కానీ... గాలి మాత్రం రాదు. అసలు.. దీని వెనక కారణం ఏంటి? ఫ్యాన్ తిరిగినా కూడా గాలి ఎందుకు రాదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం....

ఫ్యాన్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. రోజంతా ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. చాలా మంది ఈ సీలింగ్ ఫ్యాన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పేరుకు ఫ్యాన్ వేగంగా తిరుగుతున్నట్లే కనిపిస్తూ ఉంటుంది. కానీ... గాలి మాత్రం రాదు. దీంతో.. చాలా మంది తమ ఫ్యాన్ సరిగా పని చేయడం లేదని.. ఈ ఫ్యాన్ ఉన్నా.. మళ్లీ టేబుల్ ఫ్యాన్ వాడాల్సి వస్తోందని వాపోతూ ఉంటారు. అసలు.. దీని వెనక కారణం ఏంటి? ఫ్యాన్ తిరిగినా కూడా గాలి ఎందుకు రాదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం....
1.ఫ్యాన్ రెక్కలు...
ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేయాలనే పేరుతో చాలా మంది తెగ కడిగేస్తూ ఉంటారు. గట్టిగా రుద్దేస్తూ ఉంటారు. అయితే.. అలా శుభ్రం చేసే సమయంలో ఫ్యాన్ రెక్కలు పొరపాటున వంగిపోతూ ఉంటాయి. అవి వంగినట్లు మన కంటికి మాత్రం కనిపించవు. అలా వంగిపోయినప్పుడే.. ప్యాన్ వేగంగా తిరుగుతున్నా కూడా మనకు మాత్రం గాలి రాదు.
2.ఫ్యాన్ మోటారు సమస్య..
ఫ్యాన్ మోటార్‌లో సమస్య ఉంటే, రిగులేటర్ బాగా పనిచేయకపోతే లేదా కండెన్సర్ బలహీనపడితే ఫ్యాన్ వేగం తగ్గి గాలి తక్కువగా వస్తుంది. ఇలాంటి అనుమానం ఏదైనా ఉంటే.. వెంటనే రిపేర్ చేయించుకోవడం మంచిది. మోటార్ చులకన అవడం లేదా బర్న్ అవడం వల్ల ఫ్యాన్ సరిగ్గా తిరగదు. ఫ్యాన్ నుంచి వింత శబ్దం వినిపించినా, వేగం తగ్గినా మోటార్ చెక్ చేయాలి.
3. బ్లేడ్‌ల పై దుమ్ము
బ్లేడ్‌లపై అధిక దుమ్ము పేరుకుపోతే గాలి ప్రవాహం తగ్గిపోతుంది. పూరిగా శుభ్రం చేయకపోతే ఇది సమస్యగా మారుతుంది. అందుకే రెగ్యులర్ గా సున్నితంగా శుభ్రం చేస్తూ ఉండాలి.
4. ఫ్యాన్ హైట్ సమస్య:
ఫ్యాన్ ఎక్కువ ఎత్తులో ఉంటే గాలి కిందికి అందదు. రూమ్ సైజు, ఫ్యాన్ పొడవు సరిపోలకపోతే గాలి సరఫరా తగ్గుతుంది. అందుకే మరీ పైకి కాకుండా.. గాలి తగిలే ఎత్తులోనే ఫ్యాన్ పెట్టుకోవాలి.
ఏం చేయాలి..?
ఫ్యాన్ బ్లేడ్ కోణాన్ని పరిశీలించండి, అవసరమైతే సరిచేయించుకోండి.
ఫ్యాన్ వేగం తగ్గితే ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించి కండెన్సర్ లేదా మోటార్ మార్చించుకోండి.
దుమ్ము తొలగించడానికి బ్లేడ్‌లను రెగ్యులర్‌గా శుభ్రం చేయండి.
రూమ్ సైజుకు తగ్గ ఫ్యాన్ ఎత్తు ఉండేలా చూడండి (7-9 అడుగుల ఎత్తు ఐడియల్).
ప్రొఫెషనల్ చెక్ చేయించి మోటార్‌లో ఏదైనా లోపం ఉందేమో పరిశీలించండి.
ఈ స్టెప్‌లను పాటించటం ద్వారా ఫ్యాన్ నుంచి గాలి సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.