MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy: కొందరు మహిళలు త్వరగా గర్భం దాలుస్తారు.. కొందరికి ఏళ్లు గడిచినా ప్రెగ్నెన్సీ రాదు ఎందుకు?

Pregnancy: కొందరు మహిళలు త్వరగా గర్భం దాలుస్తారు.. కొందరికి ఏళ్లు గడిచినా ప్రెగ్నెన్సీ రాదు ఎందుకు?

Pregnancy: కొంతమంది మహిళలు పెళ్లయిన వెంటనే చాలా సులువుగా గర్భం దాలుస్తారు. కానీ కొందరికి ఏళ్లు గడుస్తున్నా ప్రెగ్నెన్సీ రాదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? గర్భధారణ ఆలస్యమవడానికి కారణాలేంటో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 04 2026, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గర్భం ధరించకలేకపోవడానికి కారణాలు
Image Credit : Gemini

గర్భం ధరించకలేకపోవడానికి కారణాలు

కొంతమంది మహిళలు పెళ్లయిన రెండు మూడు నెలలకే గర్భం ధరిస్తారు. కానీ కొందరు మహిళలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా ప్రెగ్నెన్సీ రాక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఎంతోమంది మహిళలు డిప్రెషన్ కు గురవుతూ ఉంటారు. అయితే  దీని వెనుక చాలా శాస్త్రీయ కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ కారణాల గురించి భార్యభర్తలిద్దరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వయసు ముఖ్యం
Image Credit : social media

వయసు ముఖ్యం

గర్భధారణ విషయంలో మహిళ వయసు చాలా ముఖ్యమైనది. 35 ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో అండాల నాణ్యత, అండాశయ నిల్వ తగ్గుతాయి. అందుకే సరైన వయసులో గర్భం ధరించేందుకు ప్లాన్ చేసుకోవాలి. 30 ఏళ్లలోపే పిల్లల్ని కనడంచ చాలా ఉత్తమం. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది.

34
పీసీఓఎస్, థైరాయిడ్
Image Credit : Gemini AI

పీసీఓఎస్, థైరాయిడ్

మహిళలకు నెలసరి సక్రమంగా రాకపోయినా కూడా గర్భధారణ ఆలస్యమవుతుంది. నెలసరి సరిగా రాకపోతే అండం విడుదల సరిగ్గా జరగదు. దీనికి తోడు పీసీఓఎస్, థైరాయిడ్ వంటి సమస్యలు మహిళలకు ఉన్నా కూడా గర్భధారణ కష్టంగా మారుతుంది. ఈ రెండు సమస్యలు కూడా అండం విడుదలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ రెండు సమస్యలు ఉన్న మహిళలు వెంటనే చికిత్స తీసుకోవాలి.

44
ఒత్తిడి కూడా కారణం
Image Credit : Getty

ఒత్తిడి కూడా కారణం

ఇప్పుడు మహిళలపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. తీవ్రమైన ఒత్తిడి సంతానోత్పత్తిపై చెడు ప్రభావం చూపిస్తుంది. భార్యాభర్తల్లో ఎవరికి ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నా అది గర్భధారణపై ప్రభావం చూపిస్తాయి. అండాశయ ఆరోగ్యం, వీర్య కణాల నాణ్యత, హార్మోన్ల సమతుల్యతను ఆ చెడు అలవాట్లు దెబ్బతీస్తాయి. అలాగే అధిక బరువు ఉన్నవారు లేదా మరీ సన్నగా ఉన్నవారు కూడ గర్భం ధరించడం కష్టమవుతుంది. ఈ పరిస్థితులు కూడా అండాల నాణ్యత, హార్మోన్లపై ప్రభావం చూపుతాయి.

35 ఏళ్లలోపు వయసున్న మహిళలు ఏడాది పాటు సహజంగా గర్భం ధరించేందుకు ప్రయత్నించవచ్చు. అప్పటికీ గర్భం రాకపోతే అప్పుడు వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.  సంతానం కలగకపోవడం అనేది కేవలం మహిళల సమస్య కాదు… సుమారు 40 శాతం కేసుల్లో మగవారిలో ఉన్న సమస్యల వల్ల కడూా గర్భధారణ ఆలస్యం అవుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
చిన్న దెబ్బకే ఎముక విరుగుతోందా? ఈ ఆహారం మీ కోసమే!
Recommended image2
Vada: గారెలు క్రిస్పీగా వచ్చే సీక్రెట్ ఇదే.. దీన్ని గారెల పిండిలో కలపండి చాలు
Recommended image3
Oil Can: సబ్బు, నీళ్లు వాడకుండా 2 నిమిషాల్లో నూనె డబ్బా క్లీన్ చేయండి
Related Stories
Recommended image1
Fridge Cover: ఫ్రిడ్జ్‌కు కవర్ వేస్తున్నారా? ఎన్ని రకాలుగా నష్టమో తెలుసుకోండి
Recommended image2
Milk Cooker: మిల్క్ కుక్కర్‌లో పాలు మరగబెట్టవచ్చా? దాన్ని వాడడం ఎంతవరకు సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved