అలియా భట్, రణ్ బీర్ కపూర్ లలో ఎవరు బాగా చదువుకున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు?
రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఇద్దరూ మంచి నటులన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ రోజు అలియా భట్ పుట్టిన రోజు. అందుకే ఈ అందమైన దంపతులిద్దరూ ఎంత ఎంత చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారో తెలుసుకుందాం పదండి.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ చాలా సినిమాల్లో నటించారు. ఈ హీరోయిన్ చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె ప్రముఖ సినీ దర్శకుడు మహేష్ భట్ కూతురు. అలియా భట్ మార్చి 15, 1993 న పుట్టింది. ఈమె గుజరాతీ సంతతికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. అలియా తల్లి సోనీ రజ్దాన్ జర్మన్ సంతతికి చెందిన భారతీయ కశ్మీరీ. సినీ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా ఆలియాకు నటనపై ఇంట్రెస్ట్ పెరిగింది.
అలియా బట్ రణ్ బీర్ ను చేసుకుని కపూర్ కుటుంబానికి కోడలు అయ్యింది. ఈమె గొప్ప హీరోయిన్ మాత్రమే కాదు మంచి వ్యాపారవేత్త కూడా. అయితే అలియా భట్, రణబీర్ కపూర్ లు ఏం చదువుకున్నారు? ఎంత చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారో తెలుసా?
అలియా భట్ విద్యార్హత
అలియా భట్ చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేదట. ఈమె జమ్నాబాయి నార్సీ స్కూల్లో చదువుకుంది. కానీ నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఈమె చదువును మధ్యలోనే వదిలేసింది. అంటే అలియా భట్ పదో తరగతి వరకు మాత్రమే చదువుకుంది. పదో తరగతిలో అలియాకు 71 శాతం మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఈమె 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాలో నటించింది. దీంతో ఈ హీరోయిన్ 12వ తరగతి పరీక్షలు రాయలేదు. దీంతో అలియా ఇంటర్ ను కంప్లీట్ చేయలేదు.
రణబీర్ కపూర్ ఎడ్యుకేషన్
రణబీర్ కపూర్ మహారాష్ట్రలోని బాంబే స్కాటిష్ స్కూల్ లో చదివాడు. ఆ తర్వాత ముంబైలోని హెచ్ ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఆ తర్వాత పై చదువుల కోసం న్యూయార్క్ వెళ్లాడు. అక్కడి నుంచి రణబీర్ విజువల్ ఆర్ట్స్ స్కూల్ లో అడ్మిషన్ తీసుకుని అక్కడే ఉన్నత చదువులు చదివాడు. అక్కడి నుంచి లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ లో కోర్సు పూర్తి చేశాడు.
అలియా భట్ సినిమాలు
బాలీవుడ్ లోకి అలియా భల్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆలియా భట్ తన చదువులను మధ్యలోనే వదిలేసింది. కానీ ఆమెకు పుస్తకాలను చదవడమంటే చాలా ఇష్టమట. అందుకే వీలున్నప్పుడల్లా అలియా భట్ పుస్తకాలను చదువుతుంటుందట. అలియా భట్ .. హైవే, రాజీ, టూ స్టేట్స్, గంగూబాయి కతియాబరి వంటి అద్భుతమైన సినిమాల్లో నటించింది. ఈ సినిమాల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఈమె పోచార్ సిరీస్ లో కూడా నటించింది.