White Hair Treatment: ఈ నూనె తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది..
White Hair Treatment: తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మార్కెట్ లో రకరకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని రకాల నూనెలను అప్లై చేయడం వల్ల జుట్టు చాలా ఫాస్ట్ గా నల్లగా మారుతుంది. అదేంటంటే..

White Hair Treatment: మారుతున్న జీవన శైలి కారణంగా నేడు చాలా మంది తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీరంలో పోషకాల లోపం ఉంటే కూడా తెల్లజుట్టు రావడం మొదలవుతుంది.
నిజానికి తెల్ల జుట్టు వయసు మీద పడుతున్న వారికి చిహ్నంగా ఉండేది. కానీ ప్రస్తుతం యువత కూడా తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఇక ఈ తెల్లజుట్టును వదిలించుకోవడానికి కొందరు మెహందీని ఉపయోగిస్తే.. మరికొంతమందేమో హెయిర్ కలర్స్ ను వాడుతుంటారు. అలాగే పార్లర్లకు వెల్లకుండా ఇంట్లోనే ఉంటూ నేచురల్ పద్దతిలో జుట్టును నల్లగా మార్చుకునే ప్రయత్నం చేసేవారు కూడా ఉన్నారు. ఇలా చేసే వారందరూ జుట్టుకు ఖరీదైన వస్తువులను అప్లై చేస్తుంటారు. కానీ ఏది అవసరమో అది మాత్రం చేయరు.
తెల్ల జుట్టు నల్లగా మారడానికి మనం ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటుగా కొన్ని రకాల నూనెలు కూడా ఎంతో సహాయపడతాయి. వారానికి రెండు సార్లు ఈ నూనెలను జుట్టుకు రాయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఎలాంటి నూనెను అప్లై చేయాలో తెలుసుకుందాం పదండి.
కొబ్బరి నూనె (Coconut oil)లో మెహందీ ఆకులను కలపండి.. కొబ్బరి నూనెలో మెహందీ ఆకులను కలిపి జుట్టురు రాస్తే కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని జుట్టుకు అప్లై చేయడం ద్వారా.. మీ జుట్టు మూలాల (Hair roots)నుంచి నల్లగా మారడం ప్రారంభమవుతాయి.
ఇందుకోసం ముందుగా మీరు చేయాల్సింది ఏమంటే.. 3 నుంచి 4 టీ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి స్టవ్ పై పెట్టండి. ఈ నూనె మరుగుతున్నప్పుడు అందులో కొన్ని హెన్నాఆకులను వేయండి. ఈ ఈ నూనె గోధుమ రంగులోకి మారేంత వరకు అలాగే మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి .. చల్లారిన తర్వాత జుట్టు మూలాలకు ఈ నూనెను అప్లై చేయండి.
ఈ నూనెను జుట్టుకు పెట్టిన తర్వాత 40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత నీట్ గా కడిగేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే తెల్ల జుట్టు చాలా తొందరగా నల్లగా మారుతుంది.
ఆవనూనెతో తలస్నానం.. ఆవ నూనె కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చగలదు. ఇందుకోసం.. ముందుగా గ్యాస్ పై ఒక Iron pan పెట్టి అందులో ఆవనూనెను పోయండి. దీనిని తక్కువ మంటపై వేడి చేయండి. ఇందులో హెన్నా ఆకులను వేడి బాగా మరిగించుకోవాలి. ఈ నూనె పూర్తిగా నల్లగా మారిన తర్వాత స్టవ్ ను ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇది జుట్టును నల్లగా మార్చడమే కాకుండా.. బలంగా, షైనీగా కూడా తయారుచేస్తుంది.