Healthy diet: డిన్నర్ లో అన్నం తినాలా? చపాతీ తినాలా? ఏది తింటే మంచిది?
Healthy diet: రాత్రి పూట అన్నం తింటే మంచిదా? లేకపోతే చపాతీ తింటే మంచిదా? ఏది తింటే మనం ఆరోగ్యంగా ఉంటామన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

Rice Chapathi
Healthy diet: ఈ గజిబిజీ లైఫ్ లో ఆకలేస్తే ఏదో ఒకటి తినడం అనారోగ్యం బారిన పడటం సర్వసాధారణమైంది. అందుకే చాలా మంది ఆరోగ్యంగా ఉండేందు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఏది మంచిది కాదు వంటి విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
ఇకపోతే మనదేశంలో ఎక్కువగా రైస్ నే తింటూ ఉంటారు. రాత్రి పూట రైస్ లేదా చపాతీలను తినడం అలవాటు చేసుకున్నారు. అయితే మధ్యాహ్నం సమయంలో రైస్ తీసుకున్నా మరేం సమస్య లేదు కానీ.. రాత్రి సమయంలో తీసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు. డిన్నర్ లో అన్నం తింటే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి..
బియ్యం, గోధుమలు రెండూ ప్రాసెస్ చేసినవే. ఈ రెండిటిలో పోషకవిలువల్లో పెద్దగా ఏం తేడా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ అన్నం, చపాతీల్లో sodium content లో తేడా ఉంటుందట. బియ్యంలో కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు, కేలరీలు అధిక మొత్తంలో ఉంటాయి. చపాతీల్లో అలా కాదు.
ఇకపోతే మార్కెట్లో కొనుక్కునే పాలీష్ బియ్యంలో విటమిన్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తినడం వల్ల అది తొందరగా అరిగిపోయి మళ్లీ తొందరగా ఆకలి అవుతుంది.
కానీ చపాతీ అలా కాదు. ఎందుకంటే చపాతీల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల ఇవి అంత తొందరగా జీర్ణమవ్వదు. దీనివల్ల మీకు తొందరగా ఆకలి వేయదు.
వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు రాత్రి పూట డిన్నర్ లో అన్నానికి బదులుగా చపాతీలనే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. నైట్ టైం చపాతీ రోటీలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.
చపాతీలను పెరుగు, రకరకాల కూరగాయల కూరతో తింటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. కాగా గోధుమలు, బార్లీ, జొన్నలు కలగలిసిన పిండితో రోటీలను చేసుకుని తింటే మరింత మంచిదని చెబుతున్నారు. ఈ రోటీల్లో ఫాస్పరస్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
ఈ చపాతీలను డిన్నర్ గా 8 గంటల్లోపు తింటే మెరుగైన ఆరోగ్యం మీ సొంతమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.