MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఫ్రిజ్ లో ఏ కూరగాయల్ని ఎక్కడ పెట్టాలి?

ఫ్రిజ్ లో ఏ కూరగాయల్ని ఎక్కడ పెట్టాలి?

ఫ్రిజ్ లో కూల్ డ్రింక్స్, మిగిలిపోయిన వంటలతో పాటుగా మనం కొన్ని ప్రతి కూరగాయను పెడుతుంటాం. కానీ వీటిని ఫ్రిజ్ లో ఎక్కడెక్కడ పెట్టాలో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 24 2025, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
fridge

fridge

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంది. ఫ్రిజ్ లో పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్, మిగిలిపోయిన ఆహారాలను పెట్టడం సర్వ సాధారణ విషయం. చాలా మంది ఫ్రిజ్ ను ఖాళీ లేకుండా ఇంట్లో ఉన్న రకరకాల వస్తువులతో నింపేస్తుంటారు. కానీ ఫ్రిజ్ లో ఏ కూరగాయల్ని ఎక్కడ పెట్టాలో మాత్రం తెలియదు. నిజానికి ఏవి ఎక్కడ ఉండాలో.. అక్కడే ఉంటేనే అవి చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి. మురిగిపోవు, పాడవవు. అందుకే కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని ఫ్రిజ్ లో ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఫ్రిజ్ లో కూరగాయల్ని ఎక్కడ పెట్టాలి?

ఫ్రిజ్ లో కూరగాయల్ని డ్రాయర్ లేదా క్రిస్పర్ విభాగంలో పెట్టొచ్చు. ఎందుకంటే ఇది కూరగాయలు చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉండేందుకు అవసరమైన ఉష్ణోగ్రతను, తేమను కలిగి ఉంటుంది. ఇక్కడ పెడితే మీ కూరగాయలు మురిగిపోయే అవకాశం అసలే ఉండదు. 

35

క్యారెట్లు, ముల్లంగిని ఫ్రిజ్ లో ఎక్కడ ఉంచాలి?

క్యారెట్లు, ముల్లంగి వంటి కూరగాయల్ని ఫ్రిజ్ లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఈ కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వీటిని ఫ్రిజ్ లో క్రిస్పర్ డ్రాయర్లలో పెట్టాలి. అలాగే వీటిని ప్లాస్టిక్ కవర్లలో పెడితే ఇవి ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉంటాయి. 

ఆకుకూరలను ఫ్రిజ్ లో ఎక్కడ పెట్టాలి? 

ఆకు కూరలు చాలా తొందరగా వాడిపోతాయి. పనికిరాకుండా అవుతాయి. అందుకే వీటిని చాలా మంది ఫ్రిజ్ లో పెడుతుంటారు. అయితే కొంతమంది ఫ్రిజ్ లో ఆకు కూరల్ని పెట్టినా ఫ్రెష్ గా ఉండవని చెప్తుంటారు. దీనికి ఒక కారణం ఉంది. ఫ్రిజ్ లో ఆకు కూరలైన పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి వాటిని ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి ఫ్రిజ్ అడుగు భాగాన పెట్టాలి. ఇలా చేస్తే అవి తొందరగా పాడవకుండా, మురిగిపోకుండా ఉంటాయి. 

45
fridge

fridge

టమాటాలు, దోసకాయలను ఫ్రిజ్ లో ఎక్కడ పెట్టాలి?

బయట కంటే ఫ్రిజ్ లో ఉంటేనే టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. మురిగిపోకుండా ఉంటాయి. అందుకే టమాటాలు, దోసకాయలను ఎప్పుడూ కూడా ఫ్రిజ్ పై భాగంలోనే పెట్టాలి. దీనివల్ల వాటి ఫ్రెష్ నెస్ అలాగే ఉంటుంది. అలాగే వాటి టేస్ట్ కూడా ఏ మాత్రం మారదు. 

పండ్లు, కూరగాయలను కలిపి ఉంచితే ఏమౌతుంది? 

ఎప్పుడూ కూడా పండ్లను, కూరగాయల్ని కలిపి అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే పండ్లు వాయువును విడుదల చేస్తాయి. దీనివల్ల ఫ్రిజ్ లోని కూరగాయలు తొందరగా పాడైపోతాయి. అందుకే వీటిని ఫ్రిజ్ లో సపరేట్ గా ఉంచాలని చెప్తారు. 

55

ఫ్రిజ్ లో ఏ కూరగాయల్ని పెట్టకూడదు? 

ఫ్రిజ్ లో అన్ని రకాల కూరగాయల్ని పెట్టేస్తుంటారు. కానీ కొన్నింటిని అస్సలు పెట్టకూడదు. ముఖ్యంగా వెల్లుల్లి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే వీటిని ఫ్రిజ్ లో పెడితే అవి తొందరగా కుళ్లిపోతాయి. పనికిరాకుండా పోతాయి. దీనివల్ల ఫ్రిజ్ లో ఉన్న ఇతర కూరగాయలు కూడా చెడిపోతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care Tips: తలస్నానం చేసేటప్పుడు ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే.. జుట్టు రాలమన్నా రాలదు!
Recommended image2
Stone Toe Rings: రంగు రంగుల రాళ్ల మెట్టెలు...పాదాలకు మెరిసే అందం
Recommended image3
Beaded Anklet: రంగు రంగుల పూసల పట్టీలు.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved